Real Tarzan Died :40 ఏళ్లు అడవుల్లోనే జీవించి..సమాజంలోకి వచ్చిన రియల్ టార్జాన్ మృతి

రియల్ లైఫ్ టార్జాన్ గా పేరొందిన హోవాన్ లాంగ్ క్యాన్సర్ తో కన్నుమూశాడు. అడవిలో సంతోషంగా జీవించిన లాంగ్ మానవ సమాజంలోకి వచ్చిన కొంతకాలానికే ప్రాణాలు విడిచాడు.

10TV Telugu News

Real Tarzan Ho Van Lang died : 40 ఏళ్లు అడవుల్లోనే జీవించి కొంతకాలం క్రితం మానవ సమాజంలోకి వచ్చిన రియల్ టార్జాన్ గా పేరొందిన హో వాన్ లాంగ్ మృతి చెందాడు. వియత్నాంలో రియల్ టార్జాన్ అంటూ సోషల్ మీడియాలో కథనాలు వచ్చాయి. దీంతో ప్రపంచ వ్యాప్తంగా అందరి దృష్టి హోవాన్ లాంగ్ పైనే దృష్టిపడింది. వియత్నాం యుద్ధ సమయంలో చిన్నవాడిగా ఉన్న హోవాన్ లాంగ్ అడవుల్లోకి పారిపోయాడు. అప్పటినుంచి అడవుల్లోనే ఆకులు అలములు తింటు..చిన్న చిన్న జంతువుల్ని వేటాడుతు వాటిని తింటూ 40 ఏళ్ల పాటు అడవిలోనే బతికాడు హో వాన్ లాంగ్. కానీ ఇటీవల అడవుల నుంచి నాగరిక సమాజంలోకి అడుగుపెట్టాడు. కానీ ఇక్కడి సమాజం అంతా హోవాన్ కు గందరగోళంగా అనిపించింది. అలాగే సమాజంలో బతకటానికి అలవాటు పడుతున్నాడు. ఈ క్రమంలోనే అతని విషాదం జరిగిపోయింది.

ఆటవిక సమాజం నుంచి నాగరిజక సమాజంలోకి వచ్చిన తర్వాత వాన్ లాంగ్ 52 ఏళ్ల వయసులో సెప్టెంబర్ 6,2021 లివర్ క్యాన్సర్ తో ప్రాణాలు విడిచాడు. గత కొంతకాలంగా లివర్ క్యాన్సర్ తో లాంగ్ పోరాడాడు. చిట్టచివరికి ఈనెల 6న ప్రాణాలు విడిచాడు. లాంగ్ మరణం గురించి ట్రా బాంగ్ జిల్లా డాంగ్ పార్టీ కమిటీ కార్యదర్శి మిన్ థావో మాట్లాడుతు..2021 ప్రారంభంలోనే లాంగ్ కడుపునొప్పితో బాథపడుతుండటంతో క్వాంగ్ ఎన్‌గై నగరంలోని హాస్పిటల్ కు తీసుకెళ్లగా పరీక్షలు చేసిన డాక్టర్లు లివర్ క్యాన్సర్ గా నిర్ధారించారని..చికిత్స పొందుతు లాంగ్ చనిపోయాడని తెలిపారు. “కోవిడ్ -19 మహమ్మారి ప్రబలిన క్రమంలో లాంగ్ ఇంట్లో  ఉండాల్సి వచ్చింది. అలా  వ్యాధి ముదిరి లాంగ్ చనిపోయాడని తెలిపారు.

అడవిలో తనకు నచ్చినట్లుగా స్వేచ్చగా ఉండే లాంగ్ మానవ సమాజంలోకి వచ్చాక అంతా గందరగోళంగా మారిపోయాడు. అచ్చం చిన్నపిల్లాడిలాగే ఉండేవాడు. ఈ సమాజ పోకడలు ఏమీ తెలియని అమాకంగానే జీవించాడు. ఆడవాళ్ల గురించి అస్సలే తెలీదు. దీంతో అతనికి స్త్రీ సాంగత్యం కూడా తెలీదు. అచ్చం చిన్నపిల్లాడిలాగానే చిన్నారులతో ఆడుకునేవాడు. అడవుల్లో ప్రకృతి సహజమైన ఆహారం తినే లాంగ్ సభ్య సమాజంలోకి వచ్చాక అతని ఆహార శైలి మారిపోయింది. దీంతో అస్వస్థతకు గురయ్యాడు. అలా లివర్ క్యాన్సర్ తో ప్రాణాలు విడిచాడు. అతని మరణంతో స్థానికంగా విషాదం నెలకొంది. అడవుల్లో ఉంటేనే లాంగ్ బ్రతికి ఉండేవాడేమో అనిపిస్తోంది.

వియత్నాం యుద్ధం సమయంలో లాంగ్ చాలా చిన్నవాడు. అతడికి రెండేళ్ల వయసు ఉంటుంది. అయినవాళ్లందరూ యుద్ధంలో చనిపోగా, లాంగ్, తండ్రి, సోదరుడు మిగిలారు. లాంగ్ ను తీసుకుని తండ్రి అడవుల్లోకి పారిపోయి ప్రాణాలు కాపాడుకున్నాడు. చెట్లపైనా, గుహల్లోనూ నివసిస్తూ అక్కడ దొరికే వాటిని తింటూ నాలుగు దశాబ్దాలు గడిపారు. లాంగ్ కు ఊహ తెలియకముందే అడవిలోకి వెళ్లిపోవడంతో కనీసం స్త్రీ సాంగత్యం గురించి కూడా తెలియకుండా పెరిగాడు. 2013లో అధికారులు ఎంతో శ్రమించి వీరి జాడను కనుగొని ప్రజల్లోకి తీసుకువచ్చారు.

Read more : Real Tarzan : రియల్ టార్జాన్..40ఏళ్లు అడువుల్లోనే..

కాగా..1972 లో జరిగిన వియత్నాం యుద్ధం సమయంలో అతని కుటుంబ సభ్యులు చనిపోయాక లాంగ్ తండ్రి థాన్ అతడిని అడవుల్లోకి తీసుకెళ్లాడు. అప్పటి నుంచి లాంగ్ అక్కడే ఉండిపోయాడు. ఆ తరువాత 2017లో లాంగ్ తండ్రి థాన్ మరణించగా..2016లో లాంగ్ తన అడవిలో తన నివాసానికి తిరిగి వెళ్లిపోయాడు. అలా 41ఏళ్లపాటు అడవుల్లోనే ఉండిపోయాడు. ఈ క్రమంలో కొంతమంది లాంగ్ ను గుర్తించి అడవుల నుంచి తిరిగి గ్రామానికి తీసుకువచ్చారు. వచ్చిన తర్వాత ఇటీవల లాంగ్ ఆరోగ్యం బాగా క్షీణించింది. వైద్య పరీక్షల్లో అతడు లివర్ క్యాన్సర్ తో బాధపడుతున్నట్టు వెల్లడైంది. గ్రామస్తులందరినీ విషాదంలో ముంచెత్తుతూ గత సోమవారం కన్నుమూశాడు.

Read more : NASA: ప్రతీ 45 నిమిషాలకు సూర్యోదయం.. సూర్యాస్తమయాలు మారుతుంటాయక్కడ

అడవిలో సహజసిద్ధ ఆహారం తిని ఆరోగ్యంగా ఉన్న లాంగ్, బయటి ప్రపంచంలోని శుద్ధి చేసిన ఆహారాన్ని తినడం, మద్యం తాగడం వంటి వాటివల్లే తీవ్ర అస్వస్థతకు గురయ్యాడని లాంగ్ స్నేహితుడు అల్వారో సెరెజో అభిప్రాయపడ్డారు. ఈ సభ్య సమాజపు పోకడలు..మారిన ఆహారశైలి వంటివి లాంగ్ ఆరోగ్యాన్ని పాడుచేయటం వల్ల అనారోగ్యానికి గురై చనిపోయి ఉంటాడని తెలిపారు.

ఇంతకాలం అడవుల్లో స్వేచ్చగా సంతోషంగా ఉన్న లాంగ్ ఈ సమాజంలోకి వచ్చి ప్రాణాలు కోల్పోయాడని..అతని మరణం చాలా విచారకరమని అన్నారు. లాంగ్ చాలా అందమైనవాడు. అమాయకుడు. అతడిని మర్చిపోవటం చాలా కష్టం అని అడవిపువ్వులాంటి వాడు ఇలా క్యాన్సర్ తో మరణించటం చాలా చాలా బాధాకరమని అన్నారు.

10TV Telugu News