మాల్యా లగ్జరీకి బ్రేక్ : నెలంతా దాంతో సర్దుకోవాల్సిందే 

  • Published By: veegamteam ,Published On : April 4, 2019 / 07:18 AM IST
మాల్యా లగ్జరీకి బ్రేక్ : నెలంతా దాంతో సర్దుకోవాల్సిందే 

లిక్కర్ కింగ్..కింగ్ ఫిషర్ అధినేత విజయ్ మాల్యా జల్సాలకు బ్రేక్ పడనుంది. రాజరికపు వైభోగాన్ని తలపించేలా మాల్యా జల్సాలుంటాయి. ఒకప్పుడు సొంత విమానాలు, చుట్టూ బిగ్గెస్ట్ సెలబ్రిటీలు చక్కర్లు..ఇటువంటి అత్యంత  లగ్జరీ లైఫ్ ను అనుభవించిన జల్సా పురుషుడు విజయ్ మాల్యా. లగ్జరీకి కేరాఫ్ అడ్రస్ గా గడిపిన మాల్యా భారత్ లో బ్యాంకులకు వేల కోట్లు డబ్బు ఎగ్గొట్టి..లండన్ కు చెక్కేసిన ఘనాపాటి. 

దీంతో  పలు కేసులను ఎదుర్కొంటున్న విజయ్ మాల్యా జల్సాలకు మరింత బ్రేక్ పడనుంది. తమ అప్పులు తీర్చకుండా మాల్యా బ్రిటన్ లో లగ్జరీ లైఫ్ ను అనుభవిస్తున్నాడని..బ్రిటన్ కోర్టుకు తెలిపిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా..మాల్యా నిర్వహిస్తున్న ఐసీఐసీఐ బ్యాంక్‌ యూకే పీఎల్సీ ఖాతాలకు సంబంధించిన 2,58,000 పౌండ్లను సీజ్‌ చేసేందుకు అనుమతించాలని కోరింది. ఈ  క్రమంలో మాల్యా అడ్వకేట్ మాట్లాడుతు..తన క్లయింట్ ప్రస్తుతం వారానికి 18,300 పౌండ్లు ఖర్చు చేస్తున్నారని..ఈ ఖర్చును నెలకు 29,500 పౌండ్లకు తగ్గించేందుకు అంగీకరించారని తెలిపారు. ఈలెక్కన చూడగా..మాల్యా 10 రోజులకు చేస్తున్న ఖర్చుతో నెలంతా గడపాల్సివుంటుందన్నమాట.
 

కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ కోసం తమ వద్ద తీసుకున్న అప్పును మాల్యా ఉద్దేశపూర్వకంగానే ఎగ్గొడుతున్నారని ఎస్బీఐ ఆరోపించింది. గత 20 సంవత్సరాల్లో మాల్యా రియల్ ఎస్టేట్, యాచెస్, స్కాచ్ విస్కీ, ఫార్ములా వన్, యునైటెడ్ బ్రేవరీస్, ఐపీఎల్ ఫ్రాంచైజీ ఇలా ఎన్నో వ్యాపారాలు చేసారనీ..అప్పులు తీర్చుకుండా అత్యంత లగ్జరీ లైఫ్ ను ఆయన కొనసాగించారనీ ఇప్పుడు కేసులల్లో ఉండి కూడా అదే లైఫ్ ను అనుభవిస్తున్నారనీ ఎస్బీఐ ఆరోపిస్తోంది. నష్టాల్లో ఉందంటున్న కింగ్‌ ఫిషర్‌ బీర్‌ యూరప్‌ నుంచి నెలనెలా 7500 పౌండ్ల ఆదాయం వస్తోందని ఎస్‌బీఐ ఆరోపించింది.
Read Also : ప్రపంచం మెచ్చింది : నా కోడిపిల్లను కాపాడండీ.. పాకెట్ మనీతో ఆస్పత్రికి పరిగెత్తిన బుడతడు