Viral: వింత జంతువని ఫోన్ చేసిన మహిళ.. తీరా అక్కడకి వెళ్లి చూస్తే..

కానీ ఒక్కోసారి మన కళ్ళని మనమే నమ్మలేని వింతలు.. నిజంగానే ఇది జరిగిందా అనిపించే ప్రమాదాలు.. ఇంత ఫూల్స్ అయ్యేలా భయపడ్డామా అని సన్నివేశాలు కూడా జరుగుతుంటాయి. అచ్చంగా పోలాండ్ లో చివరన చెప్పుకున్న లాంటి సంఘటనే ఒకటి జరిగింది.

Viral: వింత జంతువని ఫోన్ చేసిన మహిళ.. తీరా అక్కడకి వెళ్లి చూస్తే..

Viral

Viral: సాధారణంగా మన కంటికి ఏదైనా కాస్త ఆశ్చర్యంగా కనిపిస్తే మన చూపు అక్కడే ఆగికాసేపు చూస్తుండిపోతాం. అదే కాస్త భయంగా ఆ వస్తువు కనిపిస్తే వెంటనే చూపు తిప్పుకుంటాం. కానీ ఒక్కోసారి మన కళ్ళని మనమే నమ్మలేని వింతలు.. నిజంగానే ఇది జరిగిందా అనిపించే ప్రమాదాలు.. ఇంత ఫూల్స్ అయ్యేలా భయపడ్డామా అని సన్నివేశాలు కూడా జరుగుతుంటాయి. అచ్చంగా పోలాండ్ లో చివరన చెప్పుకున్న లాంటి సంఘటనే ఒకటి జరిగింది. మా ఇంటి వద్ద చెట్టు మీద ఏదో ఒక భయంకరమైన జంతువు వేలాడుతుంది.. అది చూసి చుట్టుపక్కల ప్రజలు భయాందోళనలో ఉన్నారు.. మీరు వెంటనే ఇక్కడకి రండని ఓ మహిళ యానిమల్ వెల్ఫేర్ సొసైటీకి ఫోన్ చేసింది. తీరా అక్కడకి వెళ్లిన వారికి అది చూసి షాక్ అయ్యారు.

పోలాండ్‌లోని క్రాకో అనే నగరంలో జరిగిన ఒక ఫన్నీ ఘటనను క్రాకో యానిమల్ వెల్ఫేర్ సొసైటీ ఫేస్‌బుక్ పేజీ ద్వారా పోస్ట్ చేసింది. ఈ సంస్థకు ఇటీవల ఒక మహిళ ఫోన్ చేసి తన ఇంటికి దగ్గర్లో ఉన్న చెట్టుపై ఒక అసాధారణ జంతువు ఉందని తెలిపింది. అది చెట్టు కొమ్మపై కూర్చున్నట్లు ఉండగా చూసేందుకు భయంకరంగా ఉందని.. ఇంతకు ముందెన్నడూ చూడని జంతువు కావడంతో భయంతో ప్రజలు ఇళ్ల కిటికీలను కూడా తెరవట్లేదని ఆమె వివరించింది. అధికారులు అడిగిన మరిన్ని వివరాలకు కూడా ఆమె సమాధానం చెప్పడంతో వారు కూడా ఇది ఏ జంతవును పోలినట్లుగా లేదని నిర్ధారించుకొని ఆమె చెప్పిన స్థలానికి వెళ్లారు.

అయితే.. అక్కడకి వెళ్లిన యానిమల్ వెల్ఫేర్ సొసైటీ అధికారులు ఆ చెట్టుపై ఉన్న దానిని చూసి షాక్ అయ్యారు. స్థానికులు భయపడినట్లుగా.. ఫోన్ చేసిన మహిళ చెప్పినట్లుగా అది భయంకరమైన జంతువు కాదు కాదా.. కనీసం అది ప్రాణమున్నదే కాదు. ఆ వస్తువు ఆ దేశంలో లభించే క్రొసియెంట్ అనే ఒక రకమైన బ్రెడ్. దాన్ని ఎవరో సమీపంలోని వారు పక్షులకు ఆహారంగా దాన్ని చెట్టుపై పెట్టారు. దాన్ని పక్షులు ఇష్టం వచ్చినట్లుగా పొడుచుకుతినడంతో అదొక వింత ఆకారంలోకి వచ్చింది. అది క్రొసియెంట్ అని తెలియని వారు చూడగానే భయపడేలా తయారైంది.

దీంతో ఫోన్ చేసిన మహిళతో పాటు స్థానికులు కూడా అందుకే భయపడిపోయారు. కానీ తీరా అధికారులు వచ్చాక అది క్రొసియెంట్ అని తెలియడంతో అందరూ నవ్వుకున్నారు. ఈ ఫన్నీ మూవ్మెంట్ మొత్తాన్ని కెమెరాలలో బంధించిన క్రాకో యానిమల్ వెల్ఫేర్ సొసైటీ తన ఫేస్‌బుక్‌లో ఈ వీడియోను పోస్ట్ చేశారు. వందల మంది ఈ వింత జీవి ఫోటోకు ఫన్నీ కామెంట్లు పెడుతూ షేర్ చేస్తుండడంతో ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతుంది.

Read: Chennai: హోటల్లో ఫుడ్ సర్వ్ ఆలస్యమైందని ఓనర్ చెవి కోసేశారు!