ఫోన్ నుంచి నాలుగేళ్ల బుడ్డోడు ఫుడ్ ఆర్డర్ రూ.5వేల 500

ఫోన్ నుంచి నాలుగేళ్ల బుడ్డోడు ఫుడ్ ఆర్డర్ రూ.5వేల 500

FASTFOOD: పిల్లలు ఏం చేసినా సరదాగానే అనిపిస్తుంది. కాకపోతే కొంచెం ఖర్చుతో కూడి ఉంటాయంతే. ఇటీవలే కొద్ది రోజుల కింద హెయిర్ కట్ కు వెళ్లిన బుడ్డోడు జుట్టు కట్ చేయొద్దంటూ గోల చేసిన వీడియో వైరల్ అయితే.. మరో నాలుగేళ్ల బుడ్డోడు తల్లి ఫోన్ తీసుకుని చేసిన ఆర్డర్ గురించి సెన్సేషన్ గా మారింది.

తన కొడుకు తెలియకుండా ఫోన్ తీసేసుకుని పెట్టిన ఆర్డర్ ఖర్చు 400 బ్రెజిలియన్ రియాల్స్ అని.. అంటే దాదాపు రూ.5వేల 500ఆర్డర్ పెట్టేశాడని పంచుకుంది. ఆ ఫుడ్ ఆర్డర్ తో పాటు కొడుకును కూర్చోబెట్టి ఫొటోను పంచుకుంది ఆ మమ్మీ. ‘ఇలా జరగడం ఫస్ట్ టైం కాదు’ అని క్యాప్షన్ లో రాసుకొచ్చింది.



6 బర్గర్ మీల్స్, 6 హ్యాపీ స్నాక్స్, 8 ఎక్స్‌ట్రా టాయ్స్, 2 చికెన్ నగెట్స్ బిగ్ పోర్షన్స్, 12 నగెట్స్, ఒక పొటాటో చిప్స్, గ్రేప్ జూస్, 2 ఎక్స్ ట్రా సాసెస్. ‘నేను నవ్వుకుని ఏడ్చా కూడా. చేసేదేం లేక ఈ సోమవారం ఆ ఫాస్ట్ ఫుడ్ ని తిన్నాం. చాలా మంది దీని గురించి చెప్తున్నా నమ్మడం లేదు’ అని ఆమె పోస్టు చేసింది.

ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ పోస్టు వైరల్ అయి లక్ష లైకులు సంపాదించుకుంది. అంత బుడ్డోడు ఇలాంటి ఆర్డర్ చేయడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. ‘ఈ బుడ్డోడు జీనియస్’ అని పొగిడేస్తున్నారు. మరొకరేమో ఇదంతా డెలివరీ అయిన తర్వాత మీ ముఖం ఎలా ఉందో చూడాలని అనుకుంటున్నా అంటూ కామెంట్ చేశారు.

 

View this post on Instagram

 

A post shared by Raissa Wanderley (@raissawandrade)

ఇటువంటి ఘటన గురించి మీరేం అనుకుంటున్నారు మరి… మీకు కూడా రియల్ లైఫ్ లో ఇలాంటివేమైనా జరిగాయా..