మాయాలేదు మర్మం లేదు : గాల్లోనే గడ్డకట్టుకుపోయిన గుడ్డుసొన, నూడుల్స్!!

మాయాలేదు మర్మం లేదు : గాల్లోనే గడ్డకట్టుకుపోయిన గుడ్డుసొన, నూడుల్స్!!

noodles and egg frozen in air In Serbia : గుడ్డుతో ఆమ్లెట్ వేద్దామని బౌల్ లోకి పోద్దామనుకునే సమయంలో గుడ్డు పెంకు పగులగొడితే చాలు జర్రున జారిపోతుంది. అలాగే చక్కగా రుచికరమైన నూడుల్స్ తయారు చేసి తిందామని ఫోర్క్ తో తీస్తే అవికూడా జర్రుమని జారి పోతుంటాయి. అయినా సరే వాటిని వదులుతామా చెప్పండి. చక్కగా లాగించేస్తాం.

కానీ పగులగొట్టిన కోడి గుడ్డులోని తెల్ల పచ్చ సొనలు కిందకు జారి పోకుండా గాల్లోనే అలా ‘ఫ్రీజ్’ అలాగే నూడుల్స్ కూడా ‘ఫ్రీజ్’ అయిపోవటాన్ని మీరెక్కడన్నా చూశారా? లేదు కదూ..ఇదిగో ఇక్కడ చూడండీ..కోడి గుడ్డులోని సొన..నూడుల్స్ ఎలా ‘ఫ్రీజ్’ అయిపోయాయో..!!

భలే ఉన్నాయి కదూ ఈ ఫ్రీజ్ అయిపోయిన గుడ్డు, నూడుల్స్..అవి అలా ఎందుకు ఉన్నాయంటే దీంట్లో ఏమీ మాయా లేదు మర్మం లేదు. చల్లటి వాతావరణ వల్ల అలా అవి ఫ్రీజ్ అయిపోయాయి. అంటే అక్కడ చలి ఏ స్థాయిలో ఉందో ఊహించుకోవచ్చు.

మనం ఇక్కడ కొద్దిపాటు చలికే మనం వణికిపోతుంటాం. శీతాకాలం వచ్చిదంటే చాలా గజగజా వణికిపోతాం.చలిమంటలు వేసుకుంటాం. స్వెట్టర్లు తొడుక్కుంటాం. అలాంటిది ఉత్తరార్ధగోళంలోని ప్రజలు ఎలా ఉంటారో తెలుసా? చలికాలంలో వారి బాధలు ఎలా ఉంటాయోనన్న ఆలోచన మీకెప్పుడన్నా వచ్చిందా? లేదు కదూ..ఆ చలి ప్రభావం ఎలా ఉంటుందో ఈ గాల్లోనే గడ్డ కట్టిన ‘గుడ్డు, నూడుల్స్’ ఫొటో చూస్తే.. మీకే అర్థం అవుతుంది. గాలిలోనే గడ్డకట్టుకుపోయిన నూడుల్స్, గుడ్డు ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. గడ్డకట్టుకుపోయి గాలిలోనే ఉండిపోయిన నూడుల్స్, గుడ్డు ఫొటోను ఓ ట్విట్టర్ యూజర్ పోస్టు చేయటంతో అది కాస్తా వైరల్ అయ్యింది.

సెర్బియాలోని నోవోసిబిర్‌స్క్‌లో సదరు యూజర్ ఈ ఫొటోను తీశాడు. ఇప్పుడు ఇక్కడ ఉష్ణోగ్రత మైనస్ 45 డిగ్రీలుగా ఉందంటూ ఆ ఫొటోకు క్యాప్షన్ కూడా తగిలించాడు. ఇప్పుడు మీకు అర్థం అవుతోందా? అక్కడి ప్రజల పరిస్థితి. తిందామనుకునేలోగా ఆహారం కాస్తా గడ్డకట్టుకుపోతుందక్కడ.

కాగా సెర్బియాలో వాతావరణం ఎప్పుడెలా ఉంటుందో అర్థం చేసుకోలేం. ఒకరోజు క్రితం మైనస్ 45 డిగ్రీలుగా ఉంటే..మరుసటిరోజు ప్లస్ నాలుగు డిగ్రీలుగా ఉంది. ఇది ప్లస్ 12 డిగ్రీలకు పెరగొచ్చు. ఆ తర్వాత ఇది క్రమంగా మైనస్ 23 డిగ్రీల నుంచి తిరిగి మైనస్ 30 డిగ్రీలకు చేరుకోవచ్చట.

ఈ ఫొటో సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతోంది. ఇప్పటికే వేలాది లైకులు, రీట్వీట్లు వచ్చాయి. సెర్మియాలో వాతావరణం గురించి నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. మా ఏరియాలో అయితే..23 డిగ్రీలకే వణికిపోతాం’’ ఇంటినుంచి రావాలంటే హడలిపోతాం..అని ఒకరంటే.. ఉష్ణోగ్రత 17 డిగ్రీలు ఉంటే స్నానం కూడా మానేస్తామని మరొకరు ఇలా ఫన్నీ ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు.

కాగా సెర్బియాలోని టోమ్స్ నగరంలో వాతావరణం అంత భయంకరమైన చలిలో ఉంటే కొంతమంది ఓ బర్త్ డే పార్టీని మైనస్ 39 డిగ్రీల చలిలో బికినీ పార్టీ చేసుకోవటం మరో విశేమని చెప్పాలి.