Viral Video: 1,167 పోస్టులకు పరీక్ష.. స్టేడియం మొత్తం నిండిపోయిన అభ్యర్థులు

ఆ మైదానంలో క్రికెట్ మ్యాచ్ జరగడం లేదు.. ఏదైనా కచేరీని కూడా నిర్వహించడం లేదు.. ఎగ్జిబిషన్ కూడా కొనసాగడం లేదు.. అయినప్పటికీ, ఆ స్టేడియానికి ఏకంగా 30,000 మంది వచ్చారు. కేవలం 1,167 పోలీసు ఉద్యోగాల కోసం నిర్వహించిన పరీక్ష రాయడానికి ఇంతమంది వచ్చారు. పాకిస్థాన్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. స్టేడియం మొత్తం అభ్యర్థులతో నిండిపోయింది.

Viral Video: 1,167 పోస్టులకు పరీక్ష.. స్టేడియం మొత్తం నిండిపోయిన అభ్యర్థులు

Viral Video

Viral Video: ఆ మైదానంలో క్రికెట్ మ్యాచ్ జరగడం లేదు.. ఏదైనా కచేరీని కూడా నిర్వహించడం లేదు.. ఎగ్జిబిషన్ కూడా కొనసాగడం లేదు.. అయినప్పటికీ, ఆ స్టేడియానికి ఏకంగా 30,000 మంది వచ్చారు. కేవలం 1,167 పోలీసు ఉద్యోగాల కోసం నిర్వహించిన పరీక్ష రాయడానికి ఇంతమంది వచ్చారు. పాకిస్థాన్ లో ఈ ఘటన చోటుచేసుకుంది.

స్టేడియం మొత్తం అభ్యర్థులతో నిండిపోయిన దృశ్యాలకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇస్లామాబాద్ లో పోలీసు ఉద్యోగాల ఖాళీల భర్తీ కోసం ఈ పరీక్ష నిర్వహించినట్లు అక్కడి మీడియా తెలిపింది. పాకిస్థాన్ లో ప్రస్తుతం నిరుద్యోగ సమస్య విపరీతంగా ఉంది. పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ కుదేలు అవుతోంది. నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగిపోయాయి.

పాకిస్థాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డెవలప్ మెంట్ ఎకనామిక్స్ తెలిపిన వివరాల ప్రకారం… ప్రస్తుతం పాకిస్థాన్ లోని 31 శాతం మంది యువత నిరుద్యోగంతో కొట్టుమిట్టాడుతున్నారు. చాలా మందికి ఉపాధి కరవవుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఒక్క ఉద్యోగ ఖాళీకి ప్రకటన చేసినప్పటికీ వేలాది మంది దరఖాస్తులు చేసుకునే పరిస్థితి నెలకొంది. పాక్ ఆర్థిక వ్యవస్థ ఇప్పట్లో కోలుకునే పరిస్థితులు కనబడట్లేదు.

Viral Video: మూడేళ్ల చిన్నారిని రైలు పట్టాలపైకి తోసేసిన మహిళ.. షాకింగ్ వీడియో