పోలా.. అదిరిపోలా: 60 గుడ్లతో భారీ ఆమ్లెట్

పోలా.. అదిరిపోలా: 60 గుడ్లతో భారీ ఆమ్లెట్

Giant Omelette: రోజూ ఒకటే టేస్ట్ తినాలనుకునేవారు కొందరుంటే రోజుకొక టేస్ట్ చేయాలనుకునేవారు స్పెషల్. లేటెస్ట్ ఫుడ్ రిసిపీలతో కొత్త టేస్టులు చూడాలనుకునేవారికి ఇదొక స్పెషల్ డిష్. రోజూ తినే ఆమ్లెట్ లా కాకుండా గ్రాండ్‌గా అంటే 60గుడ్లతో ఆమ్లెట్లు వేసేశారు.

ఇదేదో ప్రయోగం కాదు.. కొరియన్ స్ట్రీట్ ఫుడ్ వెండర్ చేసిన ప్రయోగం ఇది. కొంచెం తిని ఎక్కువ క్యాలరీలు సంపాదించుకోవాలనుకునేవారికి ఈ ఫుడ్ చాలా బెటర్ అని చెప్తున్నారు. ఈ జెయింట్ ఆమ్లెట్ గురించి తెలిశాక.. రిసిపీ వైరల్ గా మారింది.



దీనిని మీరు కూడా ట్రై చేస్తారా:
ముందుగా చెఫ్ 60గుడ్లు కొట్టాడు. మామూలు ఉప్పును సరిపడనంత యాడ్ చేశాడు. ఆ తర్వాత ఉల్లికాడలు, తురిమిన క్యారెట్, ఉల్లిపాయ ముక్కలు, కొంచెం మాంసపు ముక్కలు కలిపి కాసేపటి వరకూ ఉడకబెట్టాడు.

ఆ తర్వాత దానిపై గుడ్ల సొన మొత్తం దానిపై వేసి ఒక వైపు ఉడికి ఆమ్లెట్ ను తిప్పుతూ వచ్చాడు. లేయర్లుగా తిప్పుతుండగా.. చివరకు అది పెద్ద ఇటుక సైజ్ కు వచ్చింది. ఆ తర్వాత ముదురు గోధుమరంగులోకి వచ్చిన ఆమ్లెట్ ను తీసి స్లైస్ లుగా కట్ చేసి చూడముచ్ఛటగా అమర్చాడు. దానిని అద్దాల్లో బయటకు కనిపించేలా పేర్చి ఉంచాడు.

దీనికి యూట్యూబ్ లో బీభత్సంగా లైకులు.. కామెంట్లు వస్తుండగా 17మిలియన్ వ్యూస్ దక్కించుకుంది. మాటల్లో చెప్పలేనంతగా ఉందంటూ ఫుడ్ లవర్స్ అంతా కామెంట్ చేస్తున్నారు.