Lyrebird Mimicking : వాటే టాలెంట్.. ఈ పక్షి ఏ శబ్దాన్ని అయినా ఇట్టే మిమిక్రీ చేయలగదు, వీడియో వైరల్

ఆ పక్షిని లైర్ బర్డ్ అంటారు. లైర్‌బర్డ్ అనేది నేలపై నివసించే ఆస్ట్రేలియన్ పక్షుల జాతి. ప్రకృతిలో వచ్చే సహజమైన శబ్దాలనే కాదు కృతిమమైన శబ్దాలను అనుకరించే సామర్థ్యం వాటికుంది. లైర్‌బర్డ్‌లు.. తాము విన్న శబ్దాలను ఎంతో అలవోకగా అనుకరిస్తాయి.

Lyrebird Mimicking : వాటే టాలెంట్.. ఈ పక్షి ఏ శబ్దాన్ని అయినా ఇట్టే మిమిక్రీ చేయలగదు, వీడియో వైరల్

Lyrebird Mimicking : అదో పక్షి. చూడటానికి సాధారణంగానే ఉంటుంది. కానీ, దాని టాలెంట్ గురించి ప్రత్యేకత గురించి తెలిస్తే నివ్వెరపోవడం ఖాయం. ఆ పక్షులుకున్న ప్రతిభ ఏంటో తెలిస్తే మైండ్ బ్లాంక్ అవ్వడం ఖాయం. ఇంతకీ దాని ప్రత్యేకత ఏంటో తెలుసా.. అది ఎలాంటి శబ్దాన్ని అయినా ఇట్టే మిమిక్రీ చేసేయగలదు. విన్న శబ్దం ఏదైనా సరే.. వెంటనే ఆ పక్షి కూడా అచ్చం అలానే సౌండ్ చేస్తుంది. ఈ బర్డ్ టాలెంట్ కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. వావ్.. వాటే టాలెంట్ అని మెచ్చుకుంటున్నారు.

Also Read..Naked Woman : బాబోయ్.. అర్థరాత్రి వీధుల్లో నగ్నంగా తిరుగుతూ ఇంటి డోర్లు తడుతున్న మహిళ, భయాందోళనలో స్థానికులు

ఆ పక్షిని లైర్ బర్డ్ అంటారు. లైర్‌బర్డ్ అనేది నేలపై నివసించే ఆస్ట్రేలియన్ పక్షుల జాతి. ప్రకృతిలో వచ్చే సహజమైన శబ్దాలనే కాదు కృతిమమైన శబ్దాలను అనుకరించే సామర్థ్యం వాటికుంది. లైర్‌బర్డ్‌లు.. తాము విన్న శబ్దాలను ఎంతో అలవోకగా అనుకరిస్తాయి.

Also Read..డేంజరస్ wedding photoshoot.. కొండ అంచున వేలాడుతూ ఫొజిచ్చిన కొత్త జంట

ఓ లైర్డ్ తాను విన్న శబ్దాలను వెంటనే అనుకరించడం వీడియోలో రికార్డ్ అయ్యింది. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ పక్షి టాలెంట్ కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. వారెవ్వా వాటే టాలెంట్ అని ఆశ్చర్యపోతున్నారు. అమేజింగ్ అని ఒకరు ట్వీట్ చేస్తే, ఇది ప్లేయింగ్ బర్డ్ టెక్నోనా అని మరొకరు ట్వీట్ చేశారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

ఓ లైర్డ్ బర్డ్.. రైలు సైరన్ శబ్దాన్ని, ఈలను, సైరన్లను సౌండ్ చేయడం వీడియోలో ఉంది. ఈ వీడియో అందరినీ అట్రాక్ట్ చేస్తోంది.