Woman Catches Giant Snake : OMG.. నీ గట్స్‌కి హ్యాట్సాఫ్.. వట్టి చేతులతోనే పేద్ద పాముని ఎలా పట్టుకుందో చూడండి…

సాధారణంగా చిన్న సైజు పాముని చూస్తే వెన్నులో వణుకుపుడుతుంది. ఒళ్లంతా చెమట్లు పట్టేస్తాయి. గుండె వేగం పెరుగుతుంది. అంతదూరంలో ఉన్న పాముని చూడగానే భయంతో పరుగుతీస్తాము. అలాంటిది భారీ సైజులో ఉన్న పాము అడుగుల దూరంలో కనిపిస్తే.. ఇంకేమైనా ఉందా.. పై ప్రాణాలు పైనే పోతాయి కదూ.

Woman Catches Giant Snake : OMG.. నీ గట్స్‌కి హ్యాట్సాఫ్.. వట్టి చేతులతోనే పేద్ద పాముని ఎలా పట్టుకుందో చూడండి…

Woman Catches Giant Snake

Woman Catches Giant Snake : సాధారణంగా చిన్న సైజు పాముని చూస్తే వెన్నులో వణుకుపుడుతుంది. ఒళ్లంతా చెమట్లు పట్టేస్తాయి. గుండె వేగం పెరుగుతుంది. అంతదూరంలో ఉన్న పాముని చూడగానే భయంతో పరుగుతీస్తాము. అలాంటిది భారీ సైజులో ఉన్న పాము అడుగుల దూరంలో కనిపిస్తే.. ఇంకేమైనా ఉందా.. పై ప్రాణాలు పైనే పోతాయి కదూ.

మన సంగతి పక్కన పెడితే.. ఓ యువతి చేసిన సాహసం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆమె కేవలం ఒట్టి చేతులతో పొడవైన పాముని పట్టుకుంది. అంత పెద్ద పాముని చూసినా అదరలేదు, బెదరలేదు. ఎంతో ధైర్యంగా దాన్ని పట్టుకుంది. అదీ ఒట్టి చేతులతోనే. దీనికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ యువతి సాహసానికి అంతా ఆశ్చర్యపోతున్నారు. అమేజింగ్, వావ్, ఓ మై గాడ్, నీ గట్స్ కి హ్యాట్సాఫ్ అని కామెంట్స్ చేస్తున్నారు.

ఆ ప్రాంతం గురించి, ఆ యువతి గురించి ఎలాంటి వివరాలు తెలియదు కానీ, ఆ అమ్మాయి సాహసం మాత్రం ఇప్పుడు సెన్సేషనల్ గా మారింది. వీడియోలో చూస్తే.. అదో పాడుబడిన ఇల్లు. అందులో ఓ గదిలో పెద్ద పాము ఒకటి కనిపించింది. అక్కడికి చేరుకున్న యువతి ముందు కర్రతో పాముని హ్యాండిల్ చేసింది. ఆ పాము చూడటానికి చాలా భయంకరంగా ఉంది. ఎంతో పొడవుంది. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా దాని చేతిలో చావడం ఖాయం. చూడటానికే పాము చాలా భయానకంగా ఉంది. గట్టిగా బుసలు కొడుతోంది.

అయినా ఆమె భయపడలేదు. దాని దగ్గరిగా వెళ్లింది. ఒట్టి చేతులతోనే దాన్ని పట్టుకుంది. ఆ తర్వాత దాన్ని బయటకు తీసుకొచ్చింది. పాముని పట్టుకునే క్రమంలో అది ఆమెను కాటేయాలని చూసింది. కోపంగా బుసలు కొట్టింది. అయినా ఆ యువతి అస్సలు భయపడలేదు. ఒట్టి చేతులతోనే పాముని ఒడిసిపట్టింది. ఆ తర్వాత ఓ సంచిలో దాన్ని బంధించింది.

యువతి పాముని పట్టుకుంటుండగా ఎవరో వీడియో తీశారు. ఈ వీడియో నాలుగు నిమిషాల నిడివితో ఉంది. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తక్కువ సమయంలోనే 1.4లక్షల లైకులు, 19వేల షేర్లు వచ్చాయి. పాముని పట్టడంలో ఆ యువతి చూసిన తెగువ, నైపుణ్యం అందరిని ఆకట్టుకుంటోంది.

పాముని పట్టుకునే క్రమంలో ఆమె చూపించిన టెక్నిక్స్ చాలా ప్రమాదకరమైనవనే కామెంట్స్ వస్తున్నాయి. ఆమె చావుతో ఇలా ఆడినందుకు కచ్చితంగా ఒలింపిక్ మెడల్ ఇవ్వాల్సిందే అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. పాము పట్టుకోవడానికి ఉపయోగించే టెక్నిక్స్ లో ఇది చాలా ప్రమాదకరమైనదని మరో నెటిజన్ కామెంట్ చేశాడు. ఆమె తన ప్రాణాలను పణంగా పెట్టి పాముని పట్టుకుంది. ఆమెకు చాలా లక్ ఉందని మరొకరు కామెంట్ చేశారు. పెద్ద పాముని ఎంతో ధైర్యంగా ఒట్టి చేతులతో యువతి ఎలా పట్టుకుందో మీరే చూడండి…