Frustration పీక్స్.. రూ.2.5 కోట్ల కార్ తగలబెట్టి యూట్యూబ్‌లో వీడియో!!

Frustration పీక్స్.. రూ.2.5 కోట్ల కార్ తగలబెట్టి యూట్యూబ్‌లో వీడియో!!

ఓ YouTuber చేసిన పనికి మిలియన్స్‌లో వ్యూయర్స్ సంపాదించాడు. రూ.2.5 కోట్ల విలువైన మెర్సిడెస్ కారును లైవ్‌లో తగులబెట్టేసి ఆ వీడియో అప్ లోడ్ చేశాడు. అంత ఖరీదైన కారును డీలర్‌షిప్ వద్ద కొనుక్కొని అవే సమస్యలు ఫేస్ చేస్తుండటంతో ఫ్రస్ట్రేషన్ లో ఆ నిర్ణయం తీసుకున్నాడట.

కారును కొనుగోలు చేసిన వ్యక్తి ఐదుసార్లు డీలర్ వద్దకు కంప్లైంట్ అంటూ వెళ్లినా సెట్ అవలేదు. చేసిన రిపైర్స్ ఏ మాత్రం హెల్ప్ కాకుండా పోయాయి. ఇలా 40రోజులు రిపైర్ లోనే కారు ఉండిపోయింది. దీనికి ఓ సారి సర్వీస్ కూడా అయింది. అప్పుడు టర్బైన్ ను జర్మనీ నుంచి ఆర్డర్ చేసి మరీ మార్పించానని చెప్తున్నాడు.



ఇటీవల మళ్లీ బ్రేక్‌డౌన్ అయిందని కంప్లైంట్ చేస్తుంటే.. డీలర్‌షిప్ కాల్స్ ఆన్సర్ చేయడం మానేసింది. దాంతో మిఖైల్ లిత్విన్ (మిషా) అనే వ్యక్తి కారును కాల్చేయాలనుకున్నాడు. తాను చేయాలనుకున్న నిరసనలో భాగమే ఇది. నాలుగు రోజుల క్రితమే అతని యూట్యూబ్ ఛానెల్ లో కారును ఓ ఖాళీ స్థలంలోకి తీసుకెళ్లి కాల్చేసి వీడియో అప్‌లోడ్ చేశాడు. అలా చేస్తుండగా కారు దిగినప్పటి నుంచి దాని మీద ఇందనం పోసి మండించడం వరకూ వీడియో షూట్ చేశాడు.

చాలా కాలంగా ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలని ప్రయత్నించా. కుదరలేదు. ఇక దీనిని తగలబెట్టాలని అనుకున్నా. అదే చేశా. నేను సంతోషంగా లేను. అంటూ ఆ వీడియో పోస్టు చేశాడు.

ఈ షాకింగ్ వీడియోను యూట్యూబ్ లో 11మిలియన్ మంది చూశారు. అంతేకాదు దీని తర్వాత అతని యూట్యూబ్ అకౌంట్ కు 5మిలియన్ సబ్‌స్క్రైబర్స్ పెరిగారు. ఇందులో కొందరేమో సబ్‌స్క్రిప్షన్ నుంచి తప్పుకున్నారు కూడా.

అతనికి వచ్చిన కామెంట్లలో విచిత్రమైనది ఏంటంటే.. ‘అమెరికన్ బ్లాగర్స్ ఐ ఫోన్స్ నాశనం చేస్తుంటే.. రష్యన్ బ్లాగర్స్ మెర్సిడెస్ లు తగులబెడుతున్నారు’ అంటూ ఇంకొకరు కామెంట్ చేశారు.