Virat Kohli 100th T20 Match : పాక్‌తో తన వందో టి-20 మ్యాచ్‌ ఆడనున్న విరాట్‌ కోహ్లీ..సూపర్‌ ఫామ్‌ అందుకునేందుకు కసరత్తు

పాక్‌తో మ్యాచ్‌ అనగానే రన్‌ మెషిన్‌ విరాట్‌ కోహ్లీ జూలు విదిల్చి తన అత్యుత్తమ ఆటతీరును బయటకు తీసుకొస్తాడు. గత కొంతకాలం నుంచి ఫామ్‌లేమితో ఇబ్బందులు పడుతోన్న ఈ పరుగుల రారాజుకు... ఆసియా కప్‌లో చక్కని ట్రాక్‌ రికార్డ్‌ ఉంది. ఇప్పటివరకు ఆసియా కప్‌లో ఎవరికీ సాధ్యం కానిరీతిలో వరుస సెంచరీలతో రికార్డు క్రియేట్‌ చేశాడు. టీ-ట్వంటీలో వందో మ్యాచ్‌ను ఆడుతోన్న కోహ్లీ... సూపర్‌ ఫామ్‌లోకి వచ్చేందుకు ప్రయత్నించడం ఖాయం.

Virat Kohli 100th T20 Match : పాక్‌తో తన వందో టి-20 మ్యాచ్‌ ఆడనున్న విరాట్‌ కోహ్లీ..సూపర్‌ ఫామ్‌ అందుకునేందుకు కసరత్తు

Virat Kohli 100th T20 Match

Virat Kohli 100th T20 Match : పాక్‌తో మ్యాచ్‌ అనగానే రన్‌ మెషిన్‌ విరాట్‌ కోహ్లీ జూలు విదిల్చి తన అత్యుత్తమ ఆటతీరును బయటకు తీసుకొస్తాడు. గత కొంతకాలం నుంచి ఫామ్‌లేమితో ఇబ్బందులు పడుతోన్న ఈ పరుగుల రారాజుకు… ఆసియా కప్‌లో చక్కని ట్రాక్‌ రికార్డ్‌ ఉంది. ఇప్పటివరకు ఆసియా కప్‌లో ఎవరికీ సాధ్యం కానిరీతిలో వరుస సెంచరీలతో రికార్డు క్రియేట్‌ చేశాడు. టీ-ట్వంటీలో వందో మ్యాచ్‌ను ఆడుతోన్న కోహ్లీ… సూపర్‌ ఫామ్‌లోకి వచ్చేందుకు ప్రయత్నించడం ఖాయం. క్రీజులో కాస్త కుదురుకున్నాక బంతిని దంచికొట్టడంలో సిద్ధహస్తుడిగా పేరున్న కోహ్లీ… కనీసం నాలుగైదు ఓవర్లు క్రీజులో కుదురుకుంటే పరుగులు వాటంతట అవే వస్తాయి. సిక్స్‌లు, ఫోర్‌లతో వందో మైల్‌స్టోన్‌ మ్యాచ్‌లో సెన్సేషన్‌ క్రియేట్‌ చేయొచ్చు.

ఛేజింగ్‌ అనగానే భారత జట్టులో ప్రతి ఒక్కరికీ మొదటగా గుర్తొచ్చే పేరు విరాట్‌ కోహ్లీ. ఎంత పెద్ద లక్ష్యమైన ఉఫ్‌మని ఊదేసేలా వేగవంతమైన బ్యాటింగ్‌తో భారత్‌కు ఎన్నో విజయాలు అందించాడు. ముఖ్యంగా ఆసియా కప్‌లో ఛేంజింగ్‌లో కోహ్లీ ఆటతీరుకు ఫిదా కావాల్సిందే. సరిగ్గా పదేళ్ళ క్రితం ఆసియాకప్‌లో తన పవరేంటో ప్రపంచానికి చాటాడు. వరుసగా రెండు మ్యాచ్‌ల్లోనూ సెంచరీలతో ప్రేక్షకులను అలరించాడు. 2012 మార్చి 18న మీర్పూర్‌లో పాక్‌పై జరిగిన మ్యాచ్‌లో 183 పరుగులు, 2014 ఫిబ్రవరి 26 ఫతుల్లాలో జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై 136 పరుగులు సాధించాడు కోహ్లీ. తన కేరీర్‌లోనే అత్యుత్తమ ఇన్నింగ్స్‌ ఆడిన కోహ్లీ పాక్‌పైనే అత్యధిక స్కోరు 183 పరుగులు సాధించాడు. అంతేకాకుండా ఆసియా కప్‌లో ఏ బ్యాటర్‌కైనా ఇదే ఇండివిడ్యువల్‌ హైయెస్ట్‌ స్కోర్‌ కావడం విశేషం.

India-Pakistan Match: బయటకు రావద్దు.. భారత్-పాక్ మ్యాచ్‌ను గుంపులుగా చూశారో.. విద్యార్థులకు వార్నింగ్ ఇచ్చిన కాలేజ్

వికెట్ల మధ్య పరుగంటే ఒకప్పుడు ధోని-కోహ్లీ జోడీయేనని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వికెట్ల మధ్య వేగవంతమైన పరుగే విరాట్‌కు ప్లస్‌పాయింట్‌గా చెప్పొచ్చు. ఒక పరుగు వచ్చే చోట రెండు పరుగులు, రెండు పరుగులు వచ్చే చోట మూడు పరుగులు, అసలేం పరుగు రాని చోట ఒక పరుగుకు ప్రయత్నించడం కోహ్లీ స్పెషాలిటీ. తనతో పాటు గ్రౌండ్‌లో తన భాగస్వామిని కూడా పరుగులు పెట్టిస్తాడు. ఇందులో ఎన్నోసార్లు సత్ఫలితాలను సాధించాడు. భారత్‌కు ఎన్నో విజయాలను అందించాడు. ఈసారి కూడా అదే రిపీట్‌ కావాలని ప్రతి ఒక్క భారతీయుడు కోరుకుంటున్నాడు. ఫామ్‌ లేనితో బాధపడుతోన్న విరాట్‌ కోహ్లీ… పాకిస్తాన్‌తో మ్యాచ్‌తో మళ్ళీ సూపర్‌ ఫామ్‌ అందుకునేందుకు రెడీ అవుతున్నాడు. గత రెండు సిరీస్‌ల నుంచి రెస్ట్‌ తీసుకున్న విరాట్‌ ఫ్రెష్‌గా పాక్‌కు చుక్కలు చూపిస్తే మాత్రం ఫ్యాన్స్‌కు పండగే..