Virgin Galactic: గంటన్నర ఆలస్యంగా ప్రయాణం మొదలుపెట్టిన గెలాక్టిక్

ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠగా ఎదురుచూస్తోన్న వర్జిన్ గెలాక్టిక్ వ్యోమనౌక ప్రయాణం మొదలైపోయింది. ముందుగా నిర్ణయించిన సమయం కంటే కాస్త ఆలస్యంగా మొదలైన ఈ ప్రయాణం భారత కాలమానం ప్రకారం ఆదివారం రాత్రి 8గంటలకు ఆరంభమైంది.

Virgin Galactic: గంటన్నర ఆలస్యంగా ప్రయాణం మొదలుపెట్టిన గెలాక్టిక్

Viriginaia Galactic

Virgin Galactic: ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠగా ఎదురుచూస్తోన్న వర్జిన్ గెలాక్టిక్ వ్యోమనౌక ప్రయాణం గంటన్నర ఆలస్యమైంది. ముందుగా నిర్ణయించిన సమయం కంటే వాతావరణ ప్రతికూలత కారణంగా ఆలస్యంగా మొదలైంది. ఈ ప్రయాణం భారత కాలమానం ప్రకారం ఆదివారం రాత్రి 8గంటలకు ఆరంభమైంది.

న్యూమెక్సికో నుంచి పయనమవుతున్న వర్జిన్ గెలాక్టిక్ సంస్థ వ్యోమనౌకలో భారత్ నుంచి అంతరిక్షంలోకి వెళ్తున్న నాలుగో వ్యోమగామి బండ్ల శిరీష ఉన్నారు.

ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాకు చెందిన శిరీష పేరేంట్స్ చాలా ఏళ్ల క్రితమే అమెరికాలో స్థిరపడ్డారు. ప్రముఖ అంతరిక్ష సంస్థ వర్జిన్ గెలాక్టిక్ మనుషులతో కూడిన ఎస్ఎస్ యూనిటీ -22 ను వీఎంఎన్ ఈవ్ అనే ఈ ప్రత్యేక విమానం భూతలం నుంచి 15 వేల మీటర్ల ఎత్తుకు తీసుకెళ్తుంది.

WATCH LIVE: @RichardBranson and crew of mission specialists fly to space on @VirginGalactic’s #Unity22. A new space age is here… https://t.co/kLI6mGCUro
— Virgin Galactic (@virgingalactic) July 11, 2021

అనంతరం అక్కడి నుండి రాకెట్ యూనిటీ-22 ను మరింత ఎత్తుకు తీసుకెళ్తోంది. ఈ వ్యోమ నౌకలో వర్జిన్ గెలాక్టిక్ సంస్థ ఫౌండర్ రిచర్డ్ బ్రాన్సన్‌, శిరీష బండ్లతో పాటు మరో నలుగురు ప్రయాణం చేయనున్నారు. ఈ యాత్రపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి కనబరుస్తోంది.

ఈ ఫీట్‌తో అంతరిక్షయానం చేసిన భారత మూలాలు కల నాలుగో వ్యోమగామిగా శిరీష బండ్ల రికార్డు సృష్టించనున్నారు. అంతకుముందు రాకేష్ శర్మ, కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్ రోదసీలోకి వెళ్లారు.