Virginia Toothbrush : ఇదేందయ్యా ఇది ఏడా సూడలె.. టూత్ బ్రష్‌తో జైలు గోడకు కన్నం వేసి ఖైదీలు పరార్

ఇద్దరు ఖైదీలు టూత్ బ్రష్ తో ఏకంగా జైలు గోడకి రంధ్రం చేసి పారిపోయారు. వర్జీనియాలో ఈ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.

Virginia Toothbrush : ఇదేందయ్యా ఇది ఏడా సూడలె.. టూత్ బ్రష్‌తో జైలు గోడకు కన్నం వేసి ఖైదీలు పరార్

Virginia Toothbrush : టూత్ బ్రష్ తో ఏం చేస్తారు అంటే.. ఆ.. నోటిని బ్రష్ చేస్తారు.. అంతకన్నా ఏం చేస్తారు అని ఠక్కున సమాధానం చెబుతారు కదూ. ఆగండి ఆగండి.. టూత్ బ్రష్.. నోటిని బ్రష్ చేయడం తప్ప మరెందుకూ పనికి రాదని అప్పుడే ఓ అంచనాకు వచ్చేయకండి. టూత్ బ్రష్ ని అంత తేలిగ్గా తీసిపారేయకండి. ఎందుకంటే.. టూత్ బ్రష్ ని జైలు గోడకు కన్నం వేసేందుకు కూడా వాడొచ్చని మీకు తెలుసా. ఏంటీ, షాక్ అయ్యారు కదూ. కానీ ఇది నిజ్జం. ఇద్దరు ఖైదీలు అంతకుమించి అన్నట్లుగా.. టూత్ బ్రష్ ను వాడుకున్నారు. ఏకంగా జైలు గోడకి రంధ్రం చేసి పారిపోయారు.

వర్జీనియాలో ఈ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. జైల్లో ఇద్దరు ఖైదీలు చేసిన పని పోలీసులకే దిమ్మతిరిగిపోయేలా చేసింది. క్రెడిట్ కార్డ్ మోసంలో జాన్ గార్జా(37), అర్లె నెమో(43) అనే ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో వేశారు. వారిద్దరూ జైల్లో ఖైదీలుగా ఉన్నారు. అయితే, జైలు నుంచి ఎస్కేప్ అయ్యేందుకు ఆ ఇద్దరు ఖతర్నాక్ స్కెచ్ వేశారు. ఇందుకోసం వారు టూత్ బ్రష్ ని ఆయుధంగా మార్చుకున్నారు. కొన్ని రోజులుగా టూత్ బ్రష్, లోహపు వస్తువు సాయంతో జైలు గోడకు రంధ్రం చేశారు. అదను చూసి పారిపోయారు.

Also Read..Rent a Girlfriend: అచ్చట అద్దెకు గర్ల్ ఫ్రెండ్స్‭ లభించును.. పార్ట్నర్‭గా పార్ట్ టైం డ్యూటీ

కొన్ని గంటల తర్వాత విషయం తెలుసుకున్న పోలీసులు కంగుతిన్నారు. ఖైదీలకు అటెండెన్స్ వేస్తున్న సమయంలో ఇద్దరు ఖైదీలు తక్కువ అయ్యారు. ఎవరా ఇద్దరు అని చూస్తే.. గార్జా, నెమో అని తేలింది. అంతే, పారిపోయిన ఆ ఇద్దరు ఖైదీలను పట్టుకునేందుకు రంగంలోకి దిగారు. జైలు సమీపంలోని అపార్ట్ మెంట్ ప్రజల సాయంతో తిరిగి ఆ ఇద్దరు ఖైదీలను పోలీసులు పట్టుకుని అరెస్ట్ చేయగలిగారు. కాగా, టూత్ బ్రష్ తో జైలు గోడకు కన్నం వేసి ఖైదీలు పారిపోయిన వైనం.. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది తెలిసి.. హవ్వ అని ముక్కున వేలేసుకుంటున్నారు.

Also Read..Hindenburg : మరో ‘బిగ్ వన్’పై హిండెన్ బర్గ్ రిపోర్ట్ ..! ఈసారి బ్రహ్మాస్త్రం ఎవరిపైనో..!!

ఈ ఘటనలో పోలీసులు అలర్ట్ అయ్యారు. జైలు గోడలు కొన్ని చోట్ల బలహీనంగా ఉండటాన్ని గుర్తించారు. వెంటనే మరమ్మత్తులు ప్రారంభించారు. గోడలు బలహీనంగా ఉన్న చోట్ల రిపేర్లు చేస్తున్నారు పోలీసు అధికారులు.