కొత్త మానవ వైరస్ జన్యువుల సృష్టికి.. వైరస్‌లు మన జన్యు సంకేతాన్నే దొంగిలిస్తాయంట!

  • Published By: srihari ,Published On : June 19, 2020 / 09:01 AM IST
కొత్త మానవ వైరస్ జన్యువుల సృష్టికి.. వైరస్‌లు మన జన్యు సంకేతాన్నే దొంగిలిస్తాయంట!

సృష్టికి ప్రతిసృష్టి చేయడంలో వైరస్‌లు ఎప్పుడు ముందుంటాయి. మనిషి శరీరంలోనికి ప్రవేశించి జన్యువుల సంకేతాన్ని దొంగలించగలవని ఓ అధ్యయనం తేల్చింది. ‘Invasion of the Body Snatchers’ మూవీలో సీన్ మాదిరిగానే వైరస్ ఒక మనిషి శరీరంలోకి ప్రవేశించి జన్యువులను వేల కొలది కాపీ చేస్తూ ఫ్యాక్టరీగా మారేస్తుంది. ఇప్పుడు కరోనా వైరస్ సమయంలో పరిశోధకులు సైతం ఇదే విషయాన్ని వెల్లడిస్తున్నారు. influenza సహా ఇతర ప్రాణాంతక అంటు వైరస్ సమూహాలు అతిపెద్ద సంఖ్యలో మానవ శరీరంలోని జన్యు సంకేతాలను దొంగలించగలవని పరిశోధకులు గుర్తించారు.

అంతేకాదు.. తమ వాహకం సాయంతో కొత్త మానవ వైరస్ జన్యువులను సృష్టించగలవని గుర్తించారు. ఈ అధ్యయనాన్ని జూన్ 25న ఆన్ లైన్ సెల్‌లో పబ్లీష్ చేశారు. న్యూయార్క్ లోని Mount Sinaiలో  Icahn School of Medicine, Global Health and Emerging Pathogens Institute వద్ద పరిశోధకుల నేతృత్వంలోని బృందం ఈ అధ్యయనాన్ని నిర్వహించింది. యూకేలోని MRC-University of Glasgow Centre for Virus Researchలోనూ క్రాస్-డిసిప్లినరీ సహకార అధ్యయనానికి నేతృత్వం వహించారు.

వైరాలజిస్టుల క్రాస్-డిసిప్లినరీ బృందం సెగ్మెంటెడ్ నెగటివ్-స్ట్రాండ్ RNA వైరస్‌లు (sNSVలు) అని పిలిచే పెద్ద సమూహ వైరస్‌లను గుర్తించింది. ఇందులో మానవుల తీవ్రమైన వ్యాధికారకాలు, పెంపుడు జంతువులు, మొక్కలు, ఇన్ఫ్లుఎంజా వైరస్‌లు, లాసా వైరస్ (Lassa కారణంగా వచ్చే జ్వరం) ఉన్నాయి. వాహకాల ద్వారా జన్యు సంకేతాలను దొంగిలించడాన్ని వైరస్‌లు గతంలో గుర్తించని ప్రోటీన్ల సంపదను ఉత్పత్తి చేస్తాయని గుర్తించారు పరిశోధకులు. UFO (Upstream Frankenstein Open reading frame) ప్రోటీన్‌లుగా నిర్ధారించారు. హోస్ట్, వైరల్ సీక్వెన్స్‌లను కలపడం ద్వారా encod అవుతాయి.

ఈ అధ్యయనానికి ముందు ఈ రకమైన ప్రోటీన్ల ఉనికి గురించి తెలియదని పరిశోధకులు అంటున్నారు. ఈ UFO ప్రోటీన్లు వైరల్ సంక్రమణ మార్గాన్ని మార్చగలవు. వైరస్‌లు తమ సొంత ప్రోటీన్లను నిర్మించలేవు అందుకే తమ హోస్ట్ కణాలలో ప్రోటీన్లను మార్చుకుంటాయి. దీనినే “క్యాప్-స్నాచింగ్” అని పిలుస్తారు. దీనిలో సెల్ స్వంత ప్రోటీన్-ఎన్కోడింగ్ మెసేజ్‌లలో (మెసెంజర్ RNA, లేదా mRNA) నుంచి చివరను కత్తిరిస్తాయి. ఆ క్రమాన్ని ఒక కాపీతో విస్తరించి వాటి స్వంత జన్యువులలోకి ప్రవేశపెడతాయని పరిశోధకులు గుర్తించారు.

Read: కరోనావైరస్ సమయంలో అత్యంత పాపులర్ డైట్స్ ఇవే!