ప్రపంచంలోనే మోస్ట్ పాపులర్ టీవీ షో వాండా విజన్.. మ్యాజికల్ స్టోన్స్ రిటర్న్

ప్రపంచంలోనే మోస్ట్ పాపులర్ టీవీ షో వాండా విజన్.. మ్యాజికల్ స్టోన్స్ రిటర్న్

WandaVision: ప్రపంచంలోనే మోస్ట్ పాపులర్ టీవీ షోగా మారిపోయింది వాండావిజన్. పారోట్ అనలిటిక్స్ ప్రకారం.. సోషల్ మీడియా ట్రెండింగ్.. పైరసీ డేటా బయట దొరుకుతుండటాన్ని బట్టి చూస్తుంటే.. డిమాండ్ ఎంత ఉందో కనిపిస్తుంది. మార్వెల్ స్టూడియోస్ సిరీస్ నుంచి వచ్చిన వాండావిజన్ డిస్నీ ప్లస్ ప్లాట్ ఫాంపై టెలికాస్ట్ అయి ప్రపంచంలోనే డిమాండ్ ఉన్న టీవీ షో అయిపోయింది. ఇంతకీ అదెందుకు అంత ఫ్యామస్ అయిందంటే అవేజంర్స్ క్యారెక్టర్లు మిస్టీరియస్ గా మారిపోవడమే.

మొదటి మూడు ఎపిసోడ్ లకు ప్రపంచంలోనే 7, 35 ర్యాంకులు దక్కించుకున్నాయి. ఇక 4, 5ఎపిసోడ్లు అయితే ప్రపంచంలోనే నెం.1కు చేరుకుపోయాయి.

‘నెట్‍‌ఫ్లిక్స్.. లాంటి ప్లాట్ ఫాంపై సిరీస్ రిలీజ్ చేశాం. వారంలోనే అద్భుతమైన డిమాండ్ చూస్తున్నాం’ అని వాడే పేసన్ డెన్సీ అనే అనలిస్ట్ చెబుతున్నారు. పేసన్ డెన్నీ ప్రొడ్యూస్ చేసే షోలు ద క్రౌన్, ద క్వీన్స్ గ్యాంబిట్, కోబ్రా కై లాంటి షోలు అత్యద్భుతమైన రెస్పాన్స్ దక్కించుకున్నాయి. ఫస్ట్ టైం వాటన్నిటినీ మించిపోయి వారం వారం విడుదలవుతున్న షోలు ద మాండలోరియన్, వాండావిజన్ ప్రత్యేకంగా టాప్‌కు చేరాయి.

డిస్నీ ప్లస్ లాంటి కొత్త స్ట్రీమింగ్ ప్లాట్ ఫాం మీద రిలీజ్ అయిన మార్వెల్ స్టూడియోస్.. వాండావిజన్ పాపులారిటీ కంటెస్ట్ లో కాస్త లేటుగా ఎంటరైంది. ద ఫాల్కన్, ద వింటర్ సోల్జర్ మార్చిలోనే ఎంటరై ద మాండలోరియన్ కంటే 200శాతం వ్యూయర్ షిప్ దక్కించుకున్నాయి. ఇంకా మూడు ఎపిసోడ్లు మిగిలి ఉన్న వాండావిజన్ ఇంకెంత మంది ప్రేక్షకులను దక్కించుకుంటుందో.. ఏ ర్యాంకుకు చేరుకుంటుందో చూడాలి మరి.