పోర్న్ వీడియోలకు లైక్ కొట్టిన ప్రముఖ మాజీ క్రికెటర్, అసలేం జరిగిందంటే

పాకిస్థాన్‌ మాజీ పేసర్‌ వకార్‌ యూనిస్‌ కు చేదు అనుభవం ఎదురైంది. ఆయన ప్రమేయం లేకుండానే ఆయన

  • Published By: naveen ,Published On : May 30, 2020 / 07:18 AM IST
పోర్న్ వీడియోలకు లైక్ కొట్టిన ప్రముఖ మాజీ క్రికెటర్, అసలేం జరిగిందంటే

పాకిస్థాన్‌ మాజీ పేసర్‌ వకార్‌ యూనిస్‌ కు చేదు అనుభవం ఎదురైంది. ఆయన ప్రమేయం లేకుండానే ఆయన

పాకిస్థాన్‌ మాజీ పేసర్‌ వకార్‌ యూనిస్‌ కు చేదు అనుభవం ఎదురైంది. ఆయన ప్రమేయం లేకుండానే ఆయన ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. వకార్ తన ట్విట్టర్ అకౌంట్ నుంచి పోర్న్ వీడియోలకు, ఫొటోలకు లైక్స్ కొట్టారు. అంతేకాకుండా పలు అసభ్యకరమైన పోస్టులను షేర్‌ చేశారు. ఇది చూసిన అభిమానులు షాక్ కి గురయ్యారు. వకార్ ఏంటి, ఇలా చీప్ గా బిహేవ్ చెయ్యడం ఏంటని కంగుతన్నారు. వకార్ తీరుపై విమర్శలు చేశారు. ఆయన తీరుని తప్పుపడుతూ కామెంట్స్ చేశారు. ఇంతలో ఈ విషయం వకార్ ను చేరింది. దీంతో ఆయన కూడా షాక్ అయ్యారు. అయితే వకార్ యూనిస్ కావాలని ఈ పని చెయ్యలేదు. ఆయనకు తెలియకుండానే ఇదంతా జరిగిపోయింది. ఆయన ట్విట్టర్ ఖాతా హ్యాక్ అయ్యింది.

ఇది సిగ్గుమాలిన పని, చాలా ఇబ్బందిగా ఉంది:
దీనిపై వెంటనే వకార్ వివరణ ఇచ్చాడు. తన ట్విటర్‌ అకౌంట్ హ్యాక్ అయిందని స్వయంగా తెలిపాడు. శుక్రవారం ఉదయం తాను నిద్ర లేచేసరికే ఎవరో హ్యాక్‌ చేశారని, అందులో నుంచి అసభ్యకరమైన వీడియోలను లైక్‌ చేశారని చెప్పాడు. అవి తనను, తన కుటుంబాన్ని వేదనకు గురిచేశాయన్నాడు. ఇది చెప్పడానికి చాలా బాధగా ఉంది. ఇది ఎంతో సిగ్గుమాలిన పని. ఇలా జరగడం నాకెంతో ఇబ్బందిగా, విచారంగా ఉందని ట్విటర్‌లో ఓ వీడియో పోస్టు చేశాడు వకార్‌. ఈ ఘటనతో తీవ్ర మనస్తాపం చెందిన వకార్ ఓ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. సోషల్ మీడియాను వదిలేస్తున్నట్టు ప్రకటించాడు. 

వకార్ సంచలన నిర్ణయం:
‘సామాజిక మాధ్యమాలంటే ప్రజలతో మమేకం అవ్వడానికి మార్గాలని భావించా. కానీ ఇతనెవరో అంతా నాశనం చేశాడు. అతనలా చేయడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ మూడు, నాలుగుసార్లు హ్యాక్‌ చేశాడు. వాడు నన్ను వదలడనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇకపై నేను సోషల్ మీడియాలోకి రావొద్దని నిర్ణయించుకున్నా. నా కుటుంబాన్ని చాలా ప్రేమిస్తా. ఈరోజు తర్వాత మీరంతా నన్ను ఇక్కడ చూడలేరు. ఎవర్నైనా ఇబ్బంది పెడితే క్షమించండి. హ్యాక్‌ అయిన సమయంలో నా అకౌంట్‌ నుంచి ఏదైనా పోస్ట్‌ అయ్యుంటే పెద్దగా పట్టించుకోకండి’ అని వకార్‌ యూనిస్‌ వీడియోలో చెప్పుకొచ్చాడు. అసలు విషయం తెలియక వకార్ ను తిట్టుకున్న నెటిజన్లు తర్వాత అయ్యో పాపం అని జాలి చూపించారు.

Read:  లాక్‌డౌన్ ప్రజలను పిచ్చోళ్లని చేసింది: సాక్షి ధోనీ