lockdownలో బట్టల బాదుడే బీభత్సమైందట

lockdownలో బట్టల బాదుడే బీభత్సమైందట

లాక్ డౌన్ పుణ్యమా అని ఎనిమిది వారాల్లో 50 బ్యాగులు లాండ్రీకి వేయాల్సి వచ్చిందని.. అంటోంది కోడీ. ఫేస్ బుక్ పేజిలో తన బాధను వెల్లబోసుకున్న కోడీకి మద్ధతుగా చాలా మంది తల్లులు నిలిచారు. అవి మడతపెట్టకుండా ఉంచితే ఓ పర్వతంలా తయారవుతుందని, అలా అని మడతపెడదామంటే రోజుల కొద్దీ సమయం అవసరం అవుతుందని చెప్పుకొచ్చింది.

ప్రతీది మళ్లీ ఉతకాలి.. ఐరన్ చేయాలి… మడత బెట్టాలి. ఈ లాక్ డౌన్ లో నలుగురు పిల్లలకు తల్లి అయిన మహిళ.. సామర్థ్యమున్న మహిళ ఎప్పుడూ సొల్యూషన్ వెదుక్కుంటుంది. నువ్వు ఎక్కువగా బాధపడుతున్నావంటూ చెప్పుకొచ్చింది. స్కూల్ కు వెళ్లే పిల్లలు ఉన్నప్పుడు ఇవన్నీ కామన్ అంటూ కొట్టి పారేసింది.

పిల్లలను ప్రేమించినట్లే పనిని కూడా ప్రేమిస్తే ఈజీ అయిపోతుంది. మన మీద మనమే ఎక్కువ ఒత్తిడి పెంచుకుంటున్నాం. బట్టలు మడతపెట్టడం కంటే జీవితంలో చాలా పనులు ఉన్నాయి. ఫ్యామిలీతో సమయాన్ని ఎంజాయ్ చేయండి. మనం అనుకున్నప్పుడే అలాంటి పనులు చేసుకోవచ్చు.

ఇంకొకరమో బట్టల లాండ్రీకే ఎక్కువ ఖర్చులు అవుతున్నాయని.. ఒక్క పీస్ కోసం 30డాలర్లు ఖర్చు అవుతున్నాయని వాపోయింది. ఇదిలా ఉంటే ఆ పోస్టుకు ఇంటిని శుభ్రపరచుకోవడం ఎలా.. కిచెన్ సర్దుకోవడం ఎలా.. అంటూ వీడియోలు షూట్ చేసి సమాధానంగా పంపుతున్నారు.