Jellyfish Video : ఒకేచోట వేలాది జెల్లీ ఫిష్ లు..బోటు చుట్టూ తెల్లని చుక్కల్లా..

సముద్రంలో 100,200లు కాదు ఏకంగా వేల సంఖ్యలో జెల్లీ ఫిష్ లు ఆకాశంలో చుక్కల్లా పరుచుకుని కనిపించాయి. ఓ బోటు చుట్టూ పరుచుకుని తెల్లగా మెరుస్తూ కనిపించాయి.

Jellyfish Video : ఒకేచోట వేలాది జెల్లీ ఫిష్ లు..బోటు చుట్టూ తెల్లని చుక్కల్లా..

massive jellyfish swarm appear like polka dots in israeli sea : సముద్రం ఎంత అందమైనదో..అంత ప్రమాదకరమైనది అంతకంటే ఎక్కవ ఆసక్తిని కలిగింది కూడా. అనంత రహస్యాలను గర్భంలో దాచుకున్న సముద్రం ఎప్పటికప్పుడు ఆసక్తికర విషయాలపై సవాలు విసురుతునే ఉంటుంది. అందాలను తనలో దాచుకుని అబ్బురపరుస్తునే ఉంటుంది. అటువంటి ఓ అరుదైన దృశ్యం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఒకేచోట వేలకొద్దీ జెల్లీఫిష్ లు ఓ బోటును చుట్టుముట్టాయా? అన్నట్లుగా..పై నుంచి చూస్తే చుక్కలన్నీ ఒకేచోట కొలువుతీరాయా? అన్నట్లుగా కనువిందు చేస్తున్నాయి.

ఇజ్రాయెల్ లోని హైఫా బే ప్రాంతంలో ఒకటి రెండు..వందలు కూడా కాదు..వేల సంఖ్యలో జెల్లీ ఫిష్ లు ఆకాశంలో చుక్కల్లా పరుచుకుని కనిపించాయి. ఆ ప్రాంతంలో ఏటా జెల్లీ ఫిష్ లు వలస వస్తుంటాయట. ఈసారి కూడా అలా కొన్ని జెల్లీ ఫిష్ లు కనిపించడంతో.. ఇజ్రాయెల్ కు చెందిన పార్క్స్ అండ్ నేచర్ అథారిటీ విభాగం.. డ్రోన్ కెమెరాతో చిత్రీకరించింది. ఈ వీడియోను తమ యూట్యూబ్ చానల్ లో పోస్ట్ చేసింది.

ఈ జెల్లీ ఫిష్ లకు సంబంధించిన వివరాలను వెల్లడించింది. ఈ జెల్లీ ఫిష్ లు చాలా వరకు హిందూ మహా సముద్ర ప్రాంతం నుంచి..సూయజ్‌ కాలువా ద్వారా ఇజ్రాయెల్ సమీపంలోని మధ్యధరా సముద్ర ప్రాంతానికి ఏటా వలస వస్తాయని అధికారులు తెలిపారు. భూమ్మీద మొట్టమొదట పుట్టిన జీవ రాశుల్లో జెల్లీ ఫిష్ లు కూడా ఒకటని శాస్త్రవేత్తలు తెలిపారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని సముద్ర ప్రాంతాల్లో వివిధ రకాల జెల్లీ ఫిష్ లు జీవిస్తున్నాయని..జెల్లీ ఫిష్ లు పేరులో ఫిష్ అని ఉన్నా అవి చేపలు కాదు. పూర్తిగా భిన్నమైన ప్రాణులు. వాటికి మెదడు ఉండదు.

జెల్లీ ఫిష్ ల శరీరంలో 95 శాతానికిపైగా నీరే ఉంటుంది. కొన్ని రకాల జెల్లీ ఫిష్ లు అత్యంత విష పూరితమైనవి. వాటికి ఉండే టెంటకిల్స్ ను తాకితే తీవ్ర స్థాయిలో ప్రమాదకరం కూడా అవుతుంటాయి. కొన్నిసార్లు ప్రాణాలూ కూడా పోయే అవకాశం ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చిత్రమైన విషయం ఏమిటంటే.. సాధారణంగా కాలుష్యం వల్ల సముద్రాల్లో ఇతర జీవ రాశులకు నష్టం కలుగుతుంటే.. జెల్లీ ఫిష్ లకు మాత్రం అది అనుకూలమని..దీంతో వాటి సంతతి భారీగా పెరుగుతోందని అంటున్నారు.