Viral Video: 300 మంది ప్రయాణికులతో బయలుదేరిన విమానానికి మంటలు అంటుకున్న వైనం

రష్యాకు చెందిన అజర్ ఎయిర్ విమానానికి పెను ప్రమాదం తప్పింది. విమానాశ్రయం నుంచి 300 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బందితో విమానం బయలుదేరిన వెంటనే దాని ఇంజన్, టైర్లకు మంటలు అంటుకున్నాయి. థాయిలాండ్ లోని ఫుకెట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

Viral Video: 300 మంది ప్రయాణికులతో బయలుదేరిన విమానానికి మంటలు అంటుకున్న వైనం

Viral Video: రష్యాకు చెందిన అజర్ ఎయిర్ విమానానికి పెను ప్రమాదం తప్పింది. విమానాశ్రయం నుంచి 300 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బందితో విమానం బయలుదేరిన వెంటనే దాని ఇంజన్, టైర్లకు మంటలు అంటుకున్నాయి. థాయిలాండ్ లోని ఫుకెట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

ఫుకెట్ నుంచి అజర్ ఎయిర్ విమానం బోయింగ్ 767-300ఈఆర్ రష్యాలోని మాస్కో వెళ్లాల్సి ఉందని, అదే సమయంలో మంటలు అంటుకున్నాయని అధికారులు వివరించారు. దీంతో వెంటనే విమానాన్ని ఆపి, ప్రయాణికులను దించేశామని చెప్పారు. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదని అన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో పెద్ద చప్పుడు వచ్చిందని తెలిపారు.

ప్రయాణికులను ఇతర విమానంలో పంపామని చెప్పారు. విమాన ప్రమాదం జరుగుతున్న సమయంలో కొందరు మొబైల్ ఫోన్లలో వీడియోలు తీశారు.విమానాశ్రయంలో జరిగిన ప్రమాదంపై అజర్ ఎయిర్ విమానాశ్రయ సంస్థ స్పందించి ఓ ప్రకటన చేసింది. విమానానికి నష్టం తగ్గించడానికి తమ సంస్థకు చెందిన సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారని చెప్పింది.

సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియోలు వైరల్ అవుతున్నాయి. ప్రయాణికులకు పెనుముప్పు తప్పిందని, మంటలు మరింత చెలరేగితే వారి ప్రాణాలు పోయేవని కామెంట్లు చేశారు. విమానయాన సంస్థలు ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.

DMHO Visakhapatnam Recruitment : విశాఖ జిల్లా వైద్యఆరోగ్య శాఖలో ఒప్పంద ఉద్యోగ ఖాళీల భర్తీ