సంతానోత్పత్తి తగ్గుతుంది, గర్భస్రావం జరుగుతుంది.. రాత్రిళ్లు ఫోన్ ఎక్కువగా చూస్తే ప్రమాదమే

watching mobile phone in night dangerous: ఈ రోజుల్లో ఫోన్ లేని వారు ఎవరూ ఉండరు. చిన్న,పెద్ద.. పేద,ధనిక.. అనే తేడా లేదు. అందరి దగ్గర ఫోన్లు ఉన్నాయి. అందరి చేతుల్లోనూ స్మార్ట్ ఫోన్లు దర్శనం ఇస్తున్నాయి. ప్రతి పనికి దాదాపుగా అందరూ తమ స్మార్ట్ ఫోన్ లే వాడుతున్నారు. కొందరికి స్మార్ట్ ఫోన్ జీవితంలో భాగమైపోయింది. ఫోన్ లేనిది నిద్ర కూడా పట్టదు. తిండి, నీరు, నిద్ర లేకపోయినా ఉండగలరేమో కానీ, ఫోన్ లేకపోతే మాత్రం ఒక్క క్షణం కూడా ఉండలేని వారు చాలామందే ఉన్నారు. అంతగా ఫోన్ కి అడిక్ట్ అయిపోయారు. కొంతమంది పగలు, రాత్రి అనే తేడా లేదు.. నిత్యం ఫోన్ తోనే కాలం గడిపేస్తుంటారు. అలాంటి వారికి ఇది బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి.

మీకు రాత్రి పూట మొబైల్ వాడే అలవాటు ఉందా? నిద్రపోకుండా చీకట్లోనే ఫోన్ చూస్తుంటారా? రాత్రంతా దాంతోనే గడుపుతుంటారా? అయితే మీరు ప్రమాదంలో పడినట్టే అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాత్రి పూట మొబైల్ వాడటం చాలా ప్రమాదకరం అని నిపుణులు చెబుతున్నారు. ఫోన్ నుండి వచ్చే బ్లూ లైట్ అనేక అనర్థాలకు కారణం అవుతుందన్నారు. మగవారి శుక్ర కణాల నాణ్యతను దెబ్బ తీస్తుందని వివరించారు.

సంతానోత్పత్తి తగ్గుతుందని తెలిపారు. అతిగా స్మార్ట్ ఫోన్ల వినియోగం స్పెర్మ్ ప్రొగ్రెసివ్ మొటిలిటీని తగ్గిస్తుందని అధ్యయనంలో తేలింది. రేడియేషన్ ఆడవారిలో గర్భస్రావానికి ఓ కారణమని గుర్తించారు. తెలిసిందిగా, నైట్ టైమ్ మొబైల్ వాడటం వల్ల ఎన్ని అనర్థాలు ఉన్నాయో. అందువల్ల రాత్రి పూట మొబైల్ వినియోగాన్ని తగ్గించడమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు