Body Positivity: ‘ఒంపులు, ఫ్యాట్ ఉన్న మేమే నిజమైన ఆడాళ్లం’

ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాలా మంది సెలబ్రిటీలు, సెలబ్రిటీలు కాని వారు బాడీ పాజిటివిటీ గురించి ఆలోచించారు. శరీరంలో ఏదో లోపం ఉందని గంటల తరబడి ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు.

Body Positivity: ‘ఒంపులు, ఫ్యాట్ ఉన్న మేమే నిజమైన ఆడాళ్లం’

Body Positivity (1)

Body Positivity: ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాలా మంది సెలబ్రిటీలు, సెలబ్రిటీలు కాని వారు బాడీ పాజిటివిటీ గురించి ఆలోచించారు. శరీరంలో ఏదో లోపం ఉందని గంటల తరబడి ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు. కొందరు ఆకతాయిలైతే అదే పనిగా శరీరాకృతి మీద వంక చూపెడుతూ విమర్శిస్తూ ఉంటారు. ఆడాళ్లకైతే ఈ బెడద ఎక్కువ.

ఈ విషయాన్నంతా పక్కకుపెట్టేసి క్యూబన్-అమెరికన్ సింగర్ – సాంగ్ రైటర్ అయిన క్యామిలా కెబెల్లో రీసెంట్ గా ఓ అద్భుతమైన కామెంట్ చేసింది. మూడు సార్లు గ్రామీ అవార్డుకు నామినేట్ అయిన 24ఏళ్ల యువతి బాడీ షేమర్స్ పై కౌంటర్ వేస్తూ.. అభిమానులను ఎంకరేజ్ చేసేలా వ్యాఖ్యానించింది.

View this post on Instagram

A post shared by camila (@camila_cabello)

మీ ఒంపులను ప్రేమించండి, వాళ్లు వెక్కిరిస్తున్న ఆ చర్మమే మీకు అందాన్నిస్తుందని చెప్పింది. టిక్ టాక్ ద్వారా వీడియో షేర్ చేసిన ఆమె.. బాడీ షేమర్స్ మాటలు వింటే మనల్ని మనం తగ్గించుకున్నట్లు అవుతుంది. అలా చెప్తూ తన శరీరం అంటే చాలా ఇష్టపడతానని చెప్పింది.

‘నేను కేవలం పార్కులో పరిగెడతాను. ఎందుకంటే ఫిట్ గా ఉండటానికి, ఆరోగ్యంగా ఉండటానికి అనే కామెంట్ పెడుతూ పోస్టు చేసింది. ఇంకా నేను బొడ్డు కనిపించేలా ఒక టాప్ వేసుకున్నా. దాన్ని ఎప్పుడూ దాచాలనుకోను. ఎందుకంటే నేను నార్మల్ పర్సన్. ప్రతీసారి దానిని దాచేసి ఉన్న దానిని లేదని చూపించను. ప్రతీరోజూ శరీరంతో యుద్ధం చేయలేం కదా.

ఈ శరీరం నాకు ఉన్నందుకు గొప్పగా ఫీల్ అవుతున్నా. దాంతో నాకు కావాల్సినది మాత్రమే చేసుకుంటా. ఒంపులు, ఫ్యాట్, స్ట్రెచ్ మార్క్స్, ఫ్యాట్ ఉణ్న మనం నిజమైన మహిళలం’ అని చెప్పుకొచ్చింది. ఆ మాత్రం పాజిటివ్ యాంగిల్ లో చెప్తే చాలాదు మరి. ఇక నెటిజన్లు, ఆమె అభిమానులు అదేదో కొటేషన్ లా ఫీల్ అవుతూ లైకులు, షేర్లు చేసుకుంటున్నారు.