Blockchain : వర్చువల్ ద్వారా రింగ్స్ మార్చుకున్న జంట

వేళ్లకు ఉంగరాలను తొడుక్కొనే బదులుగా...వారు డిజిటల్ ఉంగరాలను NFT రూపంలో మార్చుకోవడం విశేషం.

Blockchain : వర్చువల్ ద్వారా రింగ్స్ మార్చుకున్న జంట

Virtual Rings

NFTs as Virtual Rings : కరోనా వైరస్ అందరి జీవితాలను ప్రభావితం చేస్తోంది. ప్రధానంగా శుభకార్యాలపై ఎఫెక్ట్ బాగానే పడుతోంది. ఎంతో ఘనంగా..పెళ్లి చేసుకోవాలని అనుకున్న వారి కలలు నెరవేరడం లేదు. ఏదో తూ.తూ మంత్రంగా పెళ్లిళ్లు కానిచ్చేస్తున్నారు. అయితే..ఓ జంట వెడ్డింగ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఒకరికి ఒకరు ముట్టుకోకుండా..వేళ్లకు ఉంగరాలను తొడుక్కొనే బదులుగా…వారు డిజిటల్ ఉంగరాలను NFT రూపంలో మార్చుకోవడం విశేషం. ప్రేమకు సాక్ష్యమిచ్చే విధంగా తమ ఉంగరాలు ఇప్పుడు బ్లాక్ చెయిన్ లో ఉన్నాయని వధువు ట్విట్టర్ వేదికగా..ట్వీట్ చేసింది.

రింగులు క్రిప్టోకరెన్సీ వాలెట్ లో ఉన్నాయని, ఇక్కడ మా ప్రతిజ్ఞలు కూడా వాస్తవంగా మార్పిడి చేయబడ్డాయని తెలిపారు. అమెరికన్ క్రిప్టోకరెన్సీ మార్పిడికి వేదిక ఉన్న కాయిన్ బేస్ లో Rebecca Rose, Peter Kacherginskyలు వర్క్ చేస్తున్నారు. వీరికి మార్చి 14వ తేదీన వివాహం జరిగింది. @Coinbase లో పనిచేస్తున్ననందున తమ వివాహం కోసం @_iphelix @Ethereum smart contract రాసినట్లు రోజ్ తెలిపారు. క్రిప్టోకరెన్సీ వాలెట్‌లకు డిజిటల్ కళాకృతులను టోకెన్లుగా (ఎన్‌ఎఫ్‌టీ) జారీ చేసింది. వారు టోకెన్‌కు ‘తబాత్’ అని పేరు పెట్టారు. తబాత్‌ అంటే హిబ్రూ భాషలో ఉంగరాలు’ అని రోజ్‌ తన ట్వీట్‌లో తెలిపింది. దీనికి సంబంధించిన విషయాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో తెగ వైరల్ అయ్యింది. నెటిజన్లు రీ ట్వీట్ చేశారు. ఇలాంటిది సాధ్యమౌతుందని ఎవరైనా ఊహించారా అంటూ కామెంట్స్ పెడుతున్నారు.