దగ్గును బట్టి కరోనాను పసిగట్టే డివైజ్

  • Published By: Subhan ,Published On : May 5, 2020 / 04:25 AM IST
దగ్గును బట్టి కరోనాను పసిగట్టే డివైజ్

చికాగోలోని శాస్త్రవేత్తలు కొత్త డివైజ్ ను కనుగొన్నారు. ఇది గొంతుకు అమర్చుకుంటే చాలు మనిషిలోని కరోనా లక్షణాలను ఇట్టే బయటపెట్టేస్తుంది. కొత్త కేసుల నమోదుపై హెల్త్ అథారిటీని అలర్ట్ చేసేందుకు.. రోగులు మరింత అనారోగ్యానికి గురికాక ముందే సమస్యను పసిగడుతుంది. ఇది అదేమంత పెద్ద డివైజ్ కాదు. 

ఓ చిన్న, సాఫ్ట్ ప్యాచ్ మాత్రమే. దీనిని గొంతు దగ్గర అంటించుకుంటే చాలు. దగ్గు, శ్వాస విధానాన్ని బట్టి, గుండె చప్పుడు, శరీర ఉష్ణోగ్రత అంశాల ఆధారంగా వ్యక్తికి కరోనా సోకిందా అని అలర్ట్ చేస్తుంది. ఈ డేటాను నేరుగా HIPAA (హెల్త్ ఇన్సూరెన్స్ పోర్టబిలిటీ అండ్ అకౌంటబిలిటీ యాక్ట్)కు పంపిస్తుంది. 

హాస్పిటల్లో అడుగుపెట్టుకుండానే కొవిడ్ లక్షణాలను ఇంటి నుంచే పసిగట్టవచ్చని రీసెర్చర్లు చెబుతున్నారు. ఈ సెన్సార్లు ఇన్ఫర్మేషన్ ను ఎప్పటికప్పుడు పంపిస్తు ఉండటంతో వ్యాప్తి వల్ల వచ్చే నష్టాన్ని తగ్గించడమే కాకుండా.. సత్ఫలితాలను ఇస్తుందని షిర్లే ర్యాన్ ఎబిలిటీ ల్యాబ్ రీసెర్చ్ సైంటిస్ట్ అరుణ్ జయరామన్ అన్నారు. 

టెలి మెడిసిన్లో కొత్త అంచనాలకు తెరలేపింది. రోగులను మానిటర్ చేయడానికి వీలులేని పరిస్థితుల్లోనూ వారికి ట్రీట్మెంట్ అందించవచ్చు. మామూలుగా హాస్పిటల్లో చేరిన పేషెంట్ల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవడానికి ఫిజిషియన్లు గంటలు, రోజులు, వారాలు, వెంటవెంటనే స్టడీ చేస్తుంటారు. ఈ డివైజ్ వల్ల అంత శ్రమ కూడా ఉండకపోవచ్చు. రీసెర్చర్లు ఈ డివైజ్ ను శరీరంలో ఎక్కడైనా అతికించినా.. లేదా గొంతు దగ్గర అంటిస్తే Covid-19లక్షణాలును ఇట్టే పసిగడుతుంది. 

రీసెర్చర్లు వారంలో డజన్ల కొద్దీ డివైజ్ లను రెడీ చేస్తున్నారు. కంపెనీ టీంలుగా విడపోయి ట్రాకర్లను రెడీ చేస్తున్నారని అధికారులు చెబుతున్నారు. 

Also Read | కరోనావైరస్‌లో మార్పు వచ్చిందా? వచ్చే వ్యాక్సిన్లు పనిచేస్తాయా? సైంటిస్టులు ఏమంటున్నారు?