Covid అలర్ట్: వాడేసిన మాస్క్ కంటే అస్సలు వాడకపోవడమే బెటర్

Covid అలర్ట్: వాడేసిన మాస్క్ కంటే అస్సలు వాడకపోవడమే బెటర్

Covid Mask: రీసెర్చర్లు ప్రత్యేకంగా మూడు లేయర్ల మాస్క్‌లు వాడటమే బెటర్ అని సూచిస్తున్నారు. హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ రెగ్యూలర్ గా వాడే మాస్కులు అయితేనే కరెక్ట్ అని చెబుతున్నారు. ఈ మాస్కులు ఇతరుల నుంచి మనకు సోకకుండా మన నుంచి ఇతరులకు వ్యాపించకుండా ప్రొటెక్షన్ కల్పిస్తాయి.

Mask తొలి సారి ధరించినప్పుడు గాలిలో బయటి నుంచి వచ్చే చిన్నపాటి అణువులను మూడో వంతు ఫిల్టర్ చేస్తుంది. రెండోసారి అంతకంటే ఎక్కువసార్లు వాడినప్పుడు ఒక వంతు మాత్రమే ఫిల్టర్ చేస్తుంది. మస్సాచుసెట్స్ లోవెల్ యూనివర్సిటీ, కాలిఫోర్నియా బాప్టిస్ట్ యూనివర్సిటీకి చెందిన వారి ప్రకారం.. కొత్త Mask ఎప్పుడు వాడాలి. ఎంత వరకూ ప్రొటెక్షన్ ఇస్తుందనే వివరాలు ఇలా ఉన్నాయి.

ఐదు మైక్రోమీటర్ల కంటే ఎక్కువ సైజు ఉన్నవి మాత్రమే ఫిల్టర్ చేయగలదు. కానీ, అంతకంటే తక్కువ అంటే 2.5మైక్రోమీటర్ల పదార్థాలను మాత్రం అలాగే ఉంచుతుంది. అందుకే మూడు లేయర్ల Mask అనేది అత్యంత ప్రాముఖ్యంగా వాడదగినది అంతేకాకుండా కొవిడ్ 19 వ్యాప్తిని అడ్డుకోగలిగేదని అంటున్నారు.

మూడు లేయర్ల Maskలో ఇన్నర్ లేయర్ శోషించుకునే మెటేరియల్ తో తయారవుతుంది. మిడిల్ లేయర్ ఫిల్టర్ లా పనిచేస్తుంది. మూడో లేయర్ పదార్థాలు లోపలికి రాకుండా అడ్డుకుంటుంది. జర్నల్ ఫిజిక్స్ ఆఫ్ ఫ్లూయిడ్స్ లో ప్రచురించిన కథనం ప్రకారం.. Mask ధరించిన వారిలో ముఖం చుట్టూ చిన్నపాటి అణువుల రూపంలో నీటి తుంపరలు తిరుగుతూ ఉంటాయి. అవి ఇతరుల మాస్క్ ల మీద పడే అవకాశముంది.

సరిగ్గా ఫిల్టర్ అవకపోతే Mask ధరించినప్పటికీ గొంతు, ముక్కు లోనికి చొచ్చుకుపోయే అవకాశముందని అంటున్నారు. అవి తక్కువ వేగంతో ఉంటే మాత్రం Mask సింగిల్ లేయర్ ఉన్నా లోపలికి రాలేవు. ఒకవేళ ఎదుటి వ్యక్తి తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు మనం ఎదురుగా ఉన్నామంటే కచ్చితంగా మూడు లేయర్ల Mask ధరించి ఉంటేనే సేఫ్. ఇలా చేయడం వల్ల 65శాతం అణువులు ఫిల్టర్ అవుతాయి. అదే వాడేసిన Maskను రెండోసారి ధరిస్తే అది కేవలం 25శాతం మాత్రమే ఫిల్టర్ చేయగలదు.

ఒకసారి వాడిన మాస్క్‌కు అంటి ఉన్న అణువులు వాటి జీవిత కాలం అవకముందే అదే మాస్క్ మరోసారి వాడినప్పుడు లోపలికి పోయే ప్రమాదం ఉంది. ఇలా మొదటిసారి వాడినప్పుడు ఉన్న క్రిములను మళ్లీ మళ్లీ వాడి మనమే హాని కొని తెచ్చుకున్నట్లు అవుతుంది. ఎలా అంటే ముందుసారి వాడినప్పుడు కరోనా వైరస్ ఫిల్టర్ అయి మాస్క్ మీద ఉన్నప్పుడు మనం సేఫ్ గానే ఉంటాం. అదే మాస్క్ పారేయకుండా రెండో సారి వాడితే ఆ క్రిములు లోపలికి చొచ్చుకుపోతాయి.