Mask : కరోనాకు తొలి మందు మాస్కే.. దీంతో 87శాతం మరణాలు తగ్గుతాయి

కరోనా నుంచి రక్షణకు మాస్క్.. రక్షణ కవచంగా పని చేస్తుంది. కోవిడ్ కు మొదటి మందు కూడా మాస్కే. ఈ వాస్తవం తెలిసినా ప్రజలు నిర్లక్ష్యం వీడటం లేదు. ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. మాస్కు పెట్టుకుంటే 87శాతం మరణాలు తగ్గుతాయని అధ్యయనాలు కూడా చెబుతున్నాయి.

Mask : కరోనాకు తొలి మందు మాస్కే.. దీంతో 87శాతం మరణాలు తగ్గుతాయి

Wear Mask

Wear Mask : కరోనా నుంచి రక్షణకు మాస్క్.. రక్షణ కవచంగా పని చేస్తుంది. కోవిడ్ కు మొదటి మందు కూడా మాస్కే. ఈ వాస్తవం తెలిసినా ప్రజలు నిర్లక్ష్యం వీడటం లేదు. ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. మాస్కు పెట్టుకుంటే 87శాతం మరణాలు తగ్గుతాయని అధ్యయనాలు కూడా చెబుతున్నాయి. అమెరికాకు చెందిన సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్(సీడీసీ) ఆరు నెలల పాటు పరిశోధనలు చేసి ఈ విషయాన్ని నిర్ధారించింది. డబుల్ మాస్కు పెట్టుకుని కరోనా బ్రిటన్ వేరియంట్ ను కూడా ఎదుర్కోవచ్చని తేల్చింది. క్లాత్ మాస్కు పెట్టుకున్న వారిలో 82శాతం మరణాలు తగ్గినట్టు అధ్యయనం చెబుతోంది. మెడికల్ మాస్కులతో క్యుములేటివ్ ఇన్ ఫెక్షన్ 78శాతం తగ్గితే, క్లాత్ మాస్కుతో 69శాతం తగ్గినట్టు రుజువైందని సీడీసీ వెల్లడించింది.

కరోనాకు మొదటి మందు మాస్కే అని తెలిసినా.. మాస్కు పెట్టుకోవడానికి ప్రజలు ఇంకా విముఖత చూపిస్తున్నారు. అలాంటి వారు నిర్లక్ష్యాన్ని వీడి తక్షణమే మాస్కు పెట్టుకోవాలని సీడీసీ సూచించింది. డబుల్ మాస్కులు పెట్టుకుంటే యూకే, వుహాన్ వేరియంట్లను ఎదుర్కోవచ్చని అధ్యయనంలో తేలింది. వైరస్ సోకి వ్యక్తి మరో ఇద్దరికి దాన్ని అంటిస్తున్నట్లు నిర్ధారించింది. డబుల్ మాస్కులు పెట్టుకుంటే వైరస్ నుంచి రక్షణ పొందొచ్చని చెప్పింది. ప్రజలు సర్జికల్ మాస్కులు కొనలేకపోయినా క్లాత్ మాస్కు పెట్టుకున్నా కరోనా నుంచి రక్షణ పొందొవచ్చని డాక్టర్లు సూచిస్తున్నారు. మహమ్మారిని ఎదుర్కోవడంలో మాస్కు కీలక పాత్ర పోషిస్తుందని చెబుతున్నారు. మాస్కులు ధరించడంతో పాటుగా అన్ని చోట్ల భౌతిక దూరం పాటిస్తే వైరస్ మన దరి చేరదని డాక్టర్లు సూచిస్తున్నారు.

మాస్కులు పెట్టుకోవాలని మొత్తుకుంటున్నా ఇంకా ప్రజలు నిర్లక్ష్యం వహించడం కోవిడ్ మరణాల పెరుగుదుల కారణంగా భావిస్తున్నారు. మాస్కే శ్రీరామరక్ష అనే వాస్తవాన్ని ఇప్పటికైనా అందరూ గ్రహించాలని కోరుతున్నారు. కరోనా సెకండ్ వేవ్ లో ఎలాంటి లక్షణాలు లేకుండానే చాలామంది కోవిడ్ బారిన పడుతున్నారు. టెస్టుల్లో పాజిటివ్ వచ్చినా, నెగిటివ్ వచ్చినా మాస్కు పెట్టుకుంటే ఇన్ ఫెక్షన్ నుంచి రక్షణ పొందొచ్చని అమెరికా సీడీసీ అధ్యయనం తేల్చింది. తాము కోవిడ్ బారిన పడ్డామనే విషయం వ్యాధి లక్షణాలు లేని వారిలో చాలామందికి తెలియదు. ఈ క్రమంలో మాస్కులు సరిగ్గా పెట్టుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. మూతి, ముక్కు పూర్తిగా కవర్ అయ్యేలా మాస్కు పెట్టుకుంటే వైరస్ బారిన పడే అవకాశాలు ఉండవని చెబుతున్నారు.