శవంతో పెళ్లి..మృతి చెందిన అన్న..తమ్ముడితో సంసారం..!!

  • Published By: nagamani ,Published On : September 16, 2020 / 04:21 PM IST
శవంతో పెళ్లి..మృతి చెందిన అన్న..తమ్ముడితో సంసారం..!!

పెళ్లి వయస్సు వచ్చిన అమ్మాయికి పెళ్లి చేయాలంటే మంచి యువకుడి కోసం వెతుకుతారు. తమ బిడ్డ సుఖంగా..సంతోషం ఉండే ఇంటికి పంపించాలని ప్రతీ తల్లిదండ్రులు కోరుకుంటారు. కానీ పోయి పోయి ఏ కన్నవారైనా తమ కూతురికి శవంతో పెళ్లి చేస్తారా?..!! అసలు అటువంటి మాట ఎప్పుడైనా విన్నారా? అంటే లేదనే అంటాం. కానీ ఏ ఇంటిలో మగవాడు చనిపోతాడా? తమ కూతుర్ని ఇచ్చి పెళ్లిచేయటానికి రెడీగా ఉంటారు. ఇది వారి సంప్రదాయమట..!!


ఈ అరాచకం అక్కడితో ఆగదు..శవంతో పెళ్లి చేశాక ఆమె పరిస్థితి ఏంటి అనే మరో ప్రశ్న తలెత్తుతుంది. అది మరో అరాచకమనే చెప్పాలి. ఏ వ్యక్తి శవంతో పెళ్లి చేస్తారో ఆ వ్యక్తికి అన్న గానీ..తమ్ముడు గానీ ఉంటే వారితోనే ఆ అమ్మాయి సంసారం చేయాలి..!! ఇక్కడ మరో విషయం ఏమిటంటే..ఆమె అతనితో సంసారం చేసినా ఆమెకు భార్య స్థానం మాత్రం ఉండదు..!! వినటానికి వెన్నులో వణుకు వచ్చే ఈ సంప్రదాయం ఆఫ్రికా ఖండంలోని సూడన్‌లోని డింకా, న్యూర్ తెగకు చెందిన గిరిజనులది.



https://10tv.in/tripura-7-teenagers-rape-8-year-old-after-inviting-her-to-play-hide-and-seek-6-arrested/
ఈ తెగల్లోని అమ్మాయిలను శవాలకు ఇచ్చి పెళ్లి చేయడం సంప్రదాయంగా వస్తోంది. ఎవరి ఇంట్లోనైనా వ్యక్తి చనిపోతున్నాడని..చనిపోయాడని తెలిస్తే.. చాలు అమ్మాయి తరఫువాళ్లు ఆ ఇంటికి వెళ్లి సంబంధం కలుపుకుంటారు. సదరు వ్యక్తి ప్రాణం పుటుక్కుమనగానే..వెంటనే పెళ్లి ఏర్పాట్లు చేసి ఆ శవంతో పెళ్లి చేస్తారు.


ఆ చనిపోయిన వ్యక్తికి తమ్ముడు లేదా అన్న ఉంటే.. వధువు వారితోనే సంసారం చేయాలి. శవాన్ని పెళ్లి చేసుకునే అమ్మాయిని వితంతువుగా భావించరు. పెళ్లయిన మహిళగానే చూస్తారు..గౌరవిస్తారు. భర్త తమ్ముళ్లతో సంసారం చేసినా.. ఆమె వారికి భార్య కాదు. కానీ భార్యతో ఎలా ఉంటారో అలాగే ఉంటారు.


ఎప్పుడో ఎలాగో పుట్టిన ఈ సంప్రదాయం పేరుతో అమ్మాయిలు..మహిళలపై ఒత్తిడి తెచ్చిశవాలతో పెళ్లిళ్లు చేస్తున్నారు డింగా..న్యూర్ తెగల గిరిజనులు. ఇలా జరుగుతున్న పెళ్లిళ్లను ప్రస్తుతం తరం అమ్మాయిలు వ్యతిరేకిస్తున్నారు. గత కొంత కాలంలో మహిళల్లో చైతన్యం రావడంతో ఇటువంటి పెళ్లిళ్లను వ్యతిరేకిస్తున్నారు. దీంతో వారికి ఇష్టమైతే తప్ప బలవంతంగా శవాలతో పెళ్లిళ్ల సంఖ్య తగ్గించి దూరంగా ఉంటున్నారు.