బై..బై 2020 : వెల్ కమ్ 2021, అక్కడ ముందే వేడుకలు

New Zealand Rings in New Year : 2020 సంవత్సరానికి బై బై చెప్పారు. 2021 న్యూ ఇయర్ కు గ్రాండ్ గా వెల్ కమ్ చెప్పారు. ఇంకా రాత్రి 12 గంటలే కాలేదు. అప్పుడే న్యూ ఇయర్ కు ఎలా వెల్ కమ్ చెబుతారు అనేగా మీ డౌట్. భారతదేశంలో కాదు. విదేశాల్లో. మనకంటే ముందుగానే…కొన్ని దేశాలు కొత్త ఏడాదిలోకి ప్రవేశించాయి. పసిపిక్ మహా సముద్రంలోని సుమోవా ద్వీపం అందరికంటే ముందుగా 2021ని వెల్ కమ్ చెప్పింది. మధ్యాహ్నం 3.30 గంటలకు అక్కడ నూతన సంవత్సరం వచ్చేసింది.

న్యూజిలాండ్ లో మిరుమిట్లు గొలిపే బాణా సంచా మధ్య హ్యాపీ న్యూ ఇయర్ అంటూ గ్రీటింగ్స్ చెప్పుకున్నారు. టోంగా, కిరిబాటి దీవులు, వెల్లింగ్టన్ కొత్త ఏడాదికి స్వాగతం పలికాయి. కరోనా కారణంగా ప్రపంచ దేశాలు పలు ఆంక్షల నడుమ న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వైరస్ వ్యాపించకుండా ఉండేందుకు వేడుకులను రద్దు చేశాయి. అనేక దేశాలు వేడుకలపై ఆంక్షలు, షరతులు విధించాయి. దీంతో పలు పర్యాటక ప్రాంతాలు వేడుకలు లేక వెలవెలబోతున్నాయి.

ఆస్ట్రేలియా మనకంటే ముందుగా నూతన సంవత్సరం ప్రారంభం కానుంది. జపాన్ మూడున్నర గంటల ముందే..2021లోకి అడుపెట్టనుంది. సౌత్ ఆఫ్రికా, ఉత్తర కొరియా కూడా ఇదే విధంగా కొత్త ఏడాదిలోకి ప్రవేశిస్తాయి. భారత్ పొరుగు దేశాలైన భూటాన్, నేపాల్, బంగ్లాదేశ్ లు 30 నిమిషాల ముందు కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతాయి.

ట్రెండింగ్ వార్తలు