Noam Chomsky: మానవ చరిత్రలో అత్యంత ప్రమాదకరమైన ఘట్టానికి చేరుకుంటున్నాం: తత్వవేత్త నోమ్ చామ్‌స్కీ

ప్రస్తుతం మనం మానవ చరిత్రలో అత్యంత ప్రమాదకరమైన ఘట్టానికి చేరుకుంటున్నామని ప్రముఖ భాషావేత్త మరియు తత్వవేత్త నోమ్ చామ్‌స్కీ అన్నారు.

Noam Chomsky: మానవ చరిత్రలో అత్యంత ప్రమాదకరమైన ఘట్టానికి చేరుకుంటున్నాం: తత్వవేత్త నోమ్ చామ్‌స్కీ

Noam

Noam Chomsky: ప్రస్తుతం మనం మానవ చరిత్రలో అత్యంత ప్రమాదకరమైన ఘట్టానికి చేరుకుంటున్నామని ప్రముఖ భాషావేత్త మరియు తత్వవేత్త నోమ్ చామ్‌స్కీ అన్నారు. వాతావరణ సంక్షోభం, అణుయుద్ధం వంటి అంశాలపై “ది న్యూ స్టేట్స్‌మన్”(the New Statesman) అనే ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నోమ్ చామ్‌స్కీ..ప్రపంచ దేశాలకు పలు సూచనలు, హెచ్చరికలు చేశారు. “పర్యావరణ విధ్వంసం నుండి భూమిపై వ్యవస్థీకృత మానవ జీవితం నాశనాన్ని మనం ఇప్పుడు ఎదుర్కొంటున్నాము. ఇక సమీప భవిష్యత్తులో కాకపోయినా..భవిష్యత్తులో ఎదుర్కోలేని ప్రమాదకర మలుపులకు చేరుకుంటున్నాం. ప్రతి ఒక్కరూ చనిపోతారని దీని అర్థం కాదు, భవిష్యత్తును ఎదుర్కొనే కొందరు అదృష్టవంతులు మాత్రమే జీవించగలరు” అంటూ నోమ్ చెప్పుకొచ్చారు.

Also read:Ukraine Russia War : భారత్‌కు వార్నింగ్ ఇచ్చిన రష్యా

ప్రస్తుత రష్యా – యుక్రెయిన్ యుద్ధంపై నోమ్ స్పందిస్తూ..పుతిన్ ను రాక్షసుడిగా అభివర్ణించారు నోమ్. “పుతిన్ అసలు ఇలా ఎందుకు చేయాల్సి వచ్చింది? దీన్ని మనం రెండు కోణాల్లో చూడాలి..నాగరిక పరిభాషలో ఆలోచిస్తే..పుతిన్ ఆలోచనా విధానాన్ని అడ్డుకుని అతని లోతైన మనస్సులో ఏమి జరుగుతుందో తెలుసుకోవడానికి ప్రయత్నించడం, రెండు అమెరికా తీసుకుంటున్న చర్యలను పరిశీలించడం” అంటూ నోమ్ వ్యాఖ్యానించారు. “2021 సెప్టెంబర్లో, అమెరికా ఒక బలమైన విధాన ప్రకటనతో ముందుకు వచ్చింది, ఉక్రెయిన్‌తో మెరుగైన సైనిక సహకారం, అధునాతన సైనిక ఆయుధాలను సరఫరా చేయడం, నాటోలో చేరడంపై యుక్రెయిన్ నిర్ణయం.

Also read:Hyderabad: రోడ్డుపై ట్రాఫిక్ హోంగార్డ్‌ను సన్మానించిన హైకోర్టు చీఫ్ జస్టిస్.. ఎందుకంటే..

ఇలా ప్రతీ అంశాన్ని పరిశీలిస్తే ప్రస్తుత పరిస్థితికి దారి తీసిన విషయాలు మీకే అర్ధం అవుతాయి” అంటూ నోమ్ చామ్‌స్కీ పేర్కొన్నారు. యుక్రెయిన్ ‘విధ్వంసం కారణంగా చర్చల పరిష్కారం కోసం ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని పక్షంలో అణు యుద్ధం అనివార్యం అవుతుందని అది మానవాళికి పెను విపత్తుగా పరిణమిస్తుందని నోమ్ చామ్‌స్కీ చెప్పుకొచ్చారు.

Also read:Ukraine : ఉపగ్రహ చిత్రాలతో రష్యా నరమేధం తేటతెల్లం.. మాకేం సంబంధం అంటూ బుకాయింపు