Taliban : భారత్‌తో నో ప్రాబ్లమ్..అందువల్లే వ్యతిరేకించాల్సి వచ్చింది

భారత్ తో తమకు ఎలాంటి సమస్య లేదని తాలిబన్ సృష్టం చేసింది.

10TV Telugu News

Taliban భారత్‌తో తమకు ఎలాంటి సమస్య లేదని తాలిబన్ సృష్టం చేసింది. అప్ఘానిస్తాన్ లో భారత్ చేపట్టిన ప్రాజెక్టులు కొనసాగించవచ్చునని..తమకు భారత్ పట్ల ఎలాంటి వ్యతిరేకత లేదని..అయితే కేవలం అష్రఫ్ ఘనీ(అప్ఘానిస్తాన్ మాజీ అధ్యక్షుడు)నేతృత్వంలోని కీలుబొమ్మ ప్రభుత్వానికి భారత్ మద్దతివ్వడాన్ని మాత్రమే తాము వ్యతిరేకించామని తాలిబన్ ప్రతినిధి మొహమ్మద్ సుహేల్ షాహీన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

గత 20 ఏళ్లల్లో అప్ఘానిస్తాన్ లో రోడ్డు,డ్యామ్ లు,పార్లమెంట్ బిల్డింగ్ నిర్మాణం సహా భారత పెట్టుబడులపై మరియు భారత్ తో ద్వైపాక్షిక్ష వాణిజ్యాన్ని తాలిబన్లు నిలిపివేయబోతున్నారా అని అడిగి ప్రశ్నకు.. అప్ఘాన్ లకు ప్రయోజనం చేకూర్చే ప్రాజెక్టులు ఏవైనా నిర్మాణదశలో లేదా ఇంకా అసంపూర్ణంగా ఉండి ఉంటే వాటిని భారత్ తప్పక పూర్తిచేయవచ్చు అని షాహీన్ సమాధానమిచ్చారు. కేవలం గత ప్రభుత్వానికి భారత్ ఇచ్చిన మద్దతునే తాము వ్యతిరేకించామని మరోసారి షాహీన్ సృష్టం చేశారు. భారత్ సహా ప్రపంచదేశాలు అప్ఘానిస్తాన్ ప్రజలను సపోర్ట్ చేయాలని,వారితో రిలేషన్ కలిగి ఉండాలని మాత్రమే గత 20 ఏళ్లుగా తాలిబన్ కోరుకుందని తెలిపారు. అప్ఘాన్ స్వాతంత్ర్యం కోసం దేశ ప్రజల యొక్క ఉద్దేశ్యాన్ని గుర్తించాలని వారు(ప్రపంచదేశాలు)గుర్తించాలన్నారు.

ఇక,కాబూల్ ని తాలిబన్లు ఆగస్టు-15న ఆక్రమించుకున్న తర్వాత అప్ఘానిస్తాన్ లోని భారతీయులు కొందరు దేశం వదిలి పారిపోవడానికి ప్రయత్నించగా..తాలిబన్లు వారిని కిడ్నాప్ చేశారంటూ వచ్చిన వార్తలపై షాహీన్ స్పందిస్తూ…నేను దీనిని వ్యతిరేకిస్తున్నాను. దౌత్యవేత్తలు మరియు ఎంబసీల నిర్వహణ కోసం తగిన ఏర్పాట్లు చేస్తామంటూ తాలిబన్ ఇప్పటికే ఓ ప్రకటన విడుదల చేసింది. వారి(కాబూల్ వదిలి వచ్చే భారతీయులకు)వద్ద డాక్యుమెంట్లు సరిగా లేవని మాకు తెలిసింది. అందుకోసమే కొన్ని గంటలపాటు వారిని ఆపడం జరిగింది. మేం ఏదైతే వాగ్ధానం చేశామో..దానికి కట్టుబడి ఉన్నాం. కొంతమంది చెడ్డవాళ్లు దేశంలో మరియు దేశం బయట ఉన్నారు. మాకు వ్యతిరేకంగా ప్రచారం చేయడానానికి అవసరమైన ముడి సరుకుని వారు అందిస్తున్నారు. విచారణ చేసినప్పుడే మీకు ఈ రిపోర్టులు ఖచ్చితమైనవి కాదని తెలుస్తుంది అని షాహీన్ పేర్కొన్నారు.

కాగా,2001లో అప్ఘానిస్తాన్ లోకి నాటో దళాలు ప్రవేశించిన తర్వాత..ఆ దేశంలో భారత్ పెట్టుబడులు పెడుతున్న విషయం తెలిసిందే. అప్ఘానిస్తాన్ కి 3 బిలియన్ డాలర్లకు పైగా అభివృద్ధి సహాయాన్ని భారత్ అందించింది. అప్ఘానిస్తాన్ లో 500కి పైగా మౌలిక సదుపాయాలు మరియు అభివృద్ధి ప్రాజెక్టులకు నిధులు సమకూర్చడం, మరియు 90 మిలియన్ డాలర్లతో అఫ్ఘాన్ పార్లమెంట్ భవన నిర్మించడం వంటివి ఉన్నాయి.

అప్ఘానిస్తాన్ లో భారత్ చేపట్టిన ముఖ్యమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు
నిమ్రోజ్ ప్రావిన్స్‌లోని జరాంజ్ నుండి డెలారామ్ వరకు 218 కి.మీ.ల పొడవు గల హైవే మరియు పవర్ సబ్ స్టేషన్‌లతో పాటు రాజధాని కాబూల్‌కు 220 కేవీ ట్రాన్స్‌మిషన్ లైన్ ఏర్పాటు చేయడం,అఫ్ఘానిస్తాన్-ఇండియా ఫ్రెండ్‌షిప్ డ్యామ్‌గా నామకరణం చేయబడిన సల్మా డ్యామ్ పూర్తి చేయడానికి నిధులు ఇవ్వడం వంటివి ఉన్నాయి.