Air Bottle Selling : ఇదేందయ్యా ఇది ఏడా సూడలే.. ఉత్త గాలి అమ్మి డబ్బు సంపాదిస్తున్నాడు.. యువకుడి బిజినెస్‌ ఐడియా అదుర్స్

ఫ్రీగా దొరికే గాలిని అమ్మి డబ్బులు పోగేసుకోవడం అంటే వింతేగా మరి. నాకూ మీకూ రాని అదిరిపోయే ఐడియా ఓ యువకుడికి వచ్చింది. అంతే.. సింపుల్ గా గాలిని అమ్మి డబ్బులు పోగేసుకుంటున్నాడు.

Air Bottle Selling : ఇదేందయ్యా ఇది ఏడా సూడలే.. ఉత్త గాలి అమ్మి డబ్బు సంపాదిస్తున్నాడు.. యువకుడి బిజినెస్‌ ఐడియా అదుర్స్

Air Bottles Selling : గాలిని అమ్మి డబ్బులు సంపాదించడం ఏంటి? అనే సందేహం వచ్చింది కదూ. మీకు అలాంటి డౌట్ రావడంలో తప్పు లేదు. ఎందుకంటే.. మన చుట్టూ ఎక్కడపడితే అక్కడ, ఎంత కావాలంటే అంత గాలి ఉంది. అంత ఫ్రీగా దొరికే గాలిని అమ్మి డబ్బులు పోగేసుకోవడం అంటే వింతేగా మరి. నాకూ మీకూ రాని అదిరిపోయే ఐడియా ఓ యువకుడికి వచ్చింది. అంతే.. సింపుల్ గా గాలిని అమ్మి డబ్బులు పోగేసుకుంటున్నాడా యువకుడు.

కాలుష్యం కారణంగా స్వచ్ఛమైన గాలి లభించడం గగనమైపోయింది ఈ రోజుల్లో. సరిగ్గా.. ఈ పాయింట్ ను క్యాష్ చేసుకుంటున్నాడు కొలంబియాకు చెందిన ఓ యువకుడు. అతగాడూ ఎవరూ ఊహించని కొత్త రకం బిజినెస్ కి తెర లేపాడు. కంటికి కనిపించని గాలిని బాటిళ్లలో నింపి అమ్మేస్తున్నాడు.
ఫ్రీగా దొరికే గాలిని అమ్మి డబ్బులు పోగేసుకుంటున్నాడు.

నమ్మబుద్ధి కాకపోయినా ఇది నిజ్జం. గాలితో డబ్బులు పోగేయడం ఎలాగో తెలుసుకున్న ఔత్సాహిక బిజినెస్‌ మ్యాన్‌ గా పేరొందిన ఆ యువకుడే కొలంబియాలోని మెడెలిన్‌ కు చెందిన జూవాన్‌ కార్లోస్‌ అల్వరాడో.

కొలంబియాలోని మెడలిన్‌ ప్రాంతం అద్భుతమైన వాతావరణానికి పేరు. దీనిని క్యాష్ చేసుకోవడంపై దృష్టి పెట్టాడు జూవాన్‌ కార్లోస్‌ అల్వరాడో. ఇక్కడి సహజమైన, నాణ్యమైన గాలిని ఆస్వాదించండి అంటూ గాలి నింపిన బాటిళ్లను టూరిస్టులకు అమ్ముడుతున్నాడు. ‘మెడలిన్‌ ఎయిర్‌’ అని బ్రాండ్‌ నేమ్‌ తో తన గాలి బాటిల్స్ ను విక్రయిస్తున్నాడు.

బాటిళ్లలో గాలి ఏంటి అంటూ అనేకమంది విమర్శించినా వాటన్నిటీ గాలికే వదిలేసి తన బిజినెస్‌ కంటిన్యూ చేస్తున్నాడు జూవాన్. అసలు బాటిళ్లలో గాలిని నింపడం ఎంతో కష్టమని, అందుకోసం తాను ఒక ప్రత్యేక పరికరాన్ని తయారు చేశానని జూవాన్ చెప్పుకొచ్చాడు. ఒక్కో బాటిల్‌ లో గాలిని శుద్ధి చేసి నింపడానికి పావు గంట నుంచి అరగంట దాకా సమయం పడుతుందన్నాడు.

మెడలిన్ ప్రాంతంలో తిరుగుతూ తన గాలి బాటిళ్లను అమ్ముతున్నాడు కార్లోస్. ఒక్కో బాటిల్ ను ఐదు డాలర్లకు (సుమారు రూ.400) టూరిస్టులకు విక్రయిస్తున్నాడు. మొదట్లో రోజూ కొన్ని బాటిళ్లు అమ్ముడుపోయాయని.. ఇప్పుడు వందల్లో విక్రయిస్తున్నానని కార్లోస్ చెబుతున్నాడు. ఇదేదో సరదాగా ఉందని కొందరు బాటిళ్లను కొంటుంటే.. మరికొందరు వింతగా చూస్తున్నారు. ఖాళీ బాటిళ్లను అమ్ముతూ జనాలను.. కార్లోస్ మోసం చేస్తున్నాడనే వారూ లేకపోలేదు.