హ్యాపీనెస్ క్లాసులంటే ఏంటి..ఢిల్లీ ప్రభుత్వ స్కూల్ కు మెలానియా రావాలనుకోవడానికి కారణం!

హ్యాపీనెస్ క్లాసులంటే ఏంటి..ఢిల్లీ ప్రభుత్వ స్కూల్ కు మెలానియా రావాలనుకోవడానికి కారణం!

భారత్‌కు రావాలని అనుకున్న సమయంలో హ్యాపీనెస్ క్లాసులకు వెళ్లాలని ప్లాన్ చేశారట. ఈ క్లాసులు ఢిల్లీలోని గవర్నమెంట్ స్కూల్స్‌లో జులై 2018లో స్టార్ట్ అయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం మొదలుపెట్టిన కార్యక్రమం వీక్షించేందుకు వస్తుండగా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రికి కూడా అధికారిక సమాచారం ఇవ్వలేదు కేంద్రం. 

అసలు ఈ హ్యాపీనెస్ క్లాసులేంటి:
వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్టు ప్రకారం.. 155దేశాల్లో భారత్‌ది 133వ స్థానం. మానసిక  అభివృద్దికి, భాషాపరంగా, సంఖ్యలను త్వరగా అర్థం చేసుకోవడానికి గానూ ఈ క్లాసులు ప్రారంభమయ్యాయి. తెలివితేటలు, అవగాహన, ఉత్సాహం చిన్ననాటి నుంచి అలవర్చితే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోగలుగుతారు. 

క్రిటికల్‌గా ఆలోచించి.. ఎంక్వైరీ చేసే విధంగా తయారైతే పిల్లలు నేర్చుకునే లక్షణాలను త్వరగా అలవరచుకుంటారు. ఇతరులతో త్వరగా కమ్యూనికేట్ అవగల్గుతారు. పరిస్థితుల్లో ఎదురైన ఒత్తిడిని సులువుగా ఎదుర్కోగలుగుతారు. 

నర్సరీ నుంచి ఎనిమిదో తరగతి వరకూ ఈ క్లాసులు నిర్వహిస్తారు. గ్రూప్ 1లో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ విద్యార్థులు(45నిమిషాల పాటు) క్లాసులో ఉంటారు. 1-2తరగతి విద్యార్థులు వీక్ డేస్ లో ఉంటాయి. 3-5తరగతుల విద్యార్థులు సెకండ్ గ్రూప్‌గా, 6-8తరగతుల విద్యార్థులు మూడో గ్రూప్‌గా యాక్టివిటీస్ లో పాల్గొంటారు. సొంత భావాలను బయటపెట్టడంలో ప్రవర్తనలో మార్పులు చేసుకోవచ్చు. 

వీటన్నిటి ద్వారా నాలుగు రకాలుగా ఉపయోగకరంగా ఉంటాయి. 
1. స్వయంగా విషయాలపై అవగాహన తెచ్చుకోవడం, వినడంలో నైపుణ్యం.
2. సొంత ఆలోచనలు బయటకు వ్యక్తీకరించగలగడం, అంచనాలకు మించి ఆలోచించగలగడం.
3. ఒత్తిడి, బాధ అధిగమించి బెటర్‌గా కమ్యూనికేట్ చేయగలగడం.
4. రోజువారీ జీవితంలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అభివృద్ధి చేయడం, శుభ్రంగా, ఆరోగ్యంగా ఉండేలా చేయడం. 

ఇవన్నీ ప్రత్యేకంగా అనిపించాయి కాబట్టే అమెరికా తొలి మహిళ చూడాలనుకున్నారట. స్కూల్స్ సందర్శన రాజకీయ లబ్ధి కోసం కాదని.. కేవలం చిన్నారులతో కలిసి గడిపేందుకేనని అధికారులు చెప్పుకొస్తున్నారు. మరోవైపు ఓట్లు కోసం ట్రంప్ ఇక్కడకు వచ్చారంటూ సోషల్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. తొలి రోజు సభా ప్రసంగంలోనూ ట్రంప్.. బీజేపీ మనిషిలా మాట్లాడారనే విమర్శలు వినిపిస్తున్నాయి.