Elizabeth-II health: బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌-IIకు ఏమైంది..? బల్మోరల్ కోటకు ప్రిన్స్ హ్యారీ, మేఘన్ సహా ఇతర కుటుంబ సభ్యులు

ఎలిజబెత్‌-II ఆరోగ్య పరిస్థితిపై ఆమె కుటుంబ సభ్యులకు అధికారులు పూర్తి సమాచారం అందించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వారు వెంటనే స్కాట్లాండ్ బల్మోరల్ కోటకు బయలుదేరారు. వారిలో ప్రిన్స్ హ్యారీ, మేఘన్ మార్కెల్ దంపతులు కూడా ఉన్నారు ఎలిజబెత్‌-IIకి ఏం జరిగిందన్న ఆందోళన నెలకొంది. మరోవైపు, ఎలిజబెత్‌-II కుమారుడు ప్రిన్స్ చార్లెస్ తో పాటు కామిల్లా పార్కెర్, ప్రిన్స్ విల్లియమ్, ఇతర కుటుంబ సభ్యులు కూడా స్కాట్లాండ్ బయలుదేరారు.

Elizabeth-II health: బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌-IIకు ఏమైంది..? బల్మోరల్ కోటకు ప్రిన్స్ హ్యారీ, మేఘన్ సహా ఇతర కుటుంబ సభ్యులు

Britain’s Queen Elizabeth-II health

Elizabeth-II health: బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌-II (96) ప్రస్తుతం ఉన్న స్కాట్లాండ్ లోని ఆమె నివాసం బల్మోరల్ కోటకు ఆమె కుటుంబ సభ్యులు అందరూ పలు ప్రాంతాల నుంచి బయలుదేరారు. దీంతో ఆమె ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందన్న ఆందోళన బ్రిటన్ వ్యాప్తంగా నెలకొంది. ఆమె బల్మోరల్ కోటలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు బకింగ్‌హామ్ ప్యాలెస్ ఓ ప్రకటనలో తెలిపిన విషయం తెలిసిందే. ఆమె ఆరోగ్య పరిస్థితిపై బ్రిటన్ కొత్త ప్రధాని లిజ్ ట్రస్ కూడా ఆందోళన వ్యక్తం చేశారు.

ఎలిజబెత్‌-II ఆరోగ్య పరిస్థితిపై ఆమె కుటుంబ సభ్యులకు అధికారులు పూర్తి సమాచారం అందించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వారు వెంటనే స్కాట్లాండ్ బల్మోరల్ కోటకు బయలుదేరారు. వారిలో ప్రిన్స్ హ్యారీ, మేఘన్ మార్కెల్ దంపతులు కూడా ఉన్నారు. ప్రిన్స్‌ హ్యారీ, మేఘన్‌ మార్కెల్‌ గతంలో బ్రిటన్‌ రాజకుటుంబంపై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. బకింగ్‌హామ్‌ ప్యాలెస్‌లో మేఘన్‌ ఇబ్బందులు ఎదుర్కున్నారని అన్నారు.

అంతేగాక, తమ కుటుంబంలో చోటుచేసుకుంటోన్న కొన్ని పరిణామాలు హ్యారీకి నచ్చలేదని చెప్పారు. దీంతో వారిద్దరు ప్యాలెస్‌, రాజకుటుంబాన్ని విడిచి మేఘన్‌ స్వస్థలమైన అమెరికాలోని కాలిఫోర్నియాకి వెళ్ళి స్థిరపడ్డారు. వారు కూడా ఇప్పుడు స్కాట్లాండ్ బయలుదేరడం గమనార్హం. దీంతో ఎలిజబెత్‌-IIకి ఏం జరిగిందన్న ఆందోళన నెలకొంది. మరోవైపు, ఎలిజబెత్‌-II కుమారుడు ప్రిన్స్ చార్లెస్ తో పాటు కామిల్లా పార్కెర్, ప్రిన్స్ విల్లియమ్, ఇతర కుటుంబ సభ్యులు కూడా స్కాట్లాండ్ బయలుదేరారు.

Heavy Rains In Telangana : తెలంగాణలో మరో మూడు రోజులు భారీ వర్షాలు.. పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్