Ukraine Crisis: రష్యా సైన్యం దాడులు ప్రారంభించిన రాత్రి ఉక్రెయిన్ అధ్యక్ష భవనంలో ఏం జరిగింది.. జెలెన్‌స్కీ ఏం చేశాడు..?

రష్యా సైన్యం దాడులతో ఉక్రెయిన్ అల్లాడుతోంది. ఆ దేశ ప్రజలు లక్షలాది మంది సరిహద్దులు దాటిపోయారు. దేశంలో ఉన్నవారు ప్రాణాలతో బిక్కుబిక్కుమంటూనే రష్యా సైన్యాన్ని ఎదుర్కొనేందుకు...

Ukraine Crisis: రష్యా సైన్యం దాడులు ప్రారంభించిన రాత్రి ఉక్రెయిన్ అధ్యక్ష భవనంలో ఏం జరిగింది.. జెలెన్‌స్కీ ఏం చేశాడు..?

Zelensky

Ukraine Crisis: రష్యా సైన్యం దాడులతో ఉక్రెయిన్ అల్లాడుతోంది. ఆ దేశ ప్రజలు లక్షలాది మంది సరిహద్దులు దాటిపోయారు. దేశంలో ఉన్నవారు ప్రాణాలతో బిక్కుబిక్కుమంటూనే రష్యా సైన్యాన్ని ఎదుర్కొనేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రధాన నగరాల్లో రష్యా సైన్యం నరమేదాన్ని సృష్టిస్తుంది. మిసైళ్లతో దాడి చేస్తుంది. వందలాది మంది మృత్యువాత పడుతున్నారు. అయినా అధ్యక్షుడు జెలెన్ స్కీ, ఉక్రెయిన్ సైన్యం, అక్కడి ప్రజలు రష్యా సైన్యం ఎత్తుగడలను తిప్పికొడుతున్నారు. ఉక్రెయిన్ ప్రజల పోరాటాన్ని ప్రపంచ దేశాలు ప్రశంసిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఉక్రెయిన్ పై రష్యా సైన్యం దాడిని ప్రారంభించిన తొలిరోజు రాత్రి ఉక్రెయిన్ అధ్యక్ష భవనంలో ఏం జరిగింది? జెలెన్‌స్కీ, భార్య, పిల్లలను రష్యా సైన్యం దాడుల నుంచి ఎలా బయటపడ్డారనే విషయాలను అమెరికన్ టైమ్ మ్యాగజైన్ ‘హౌ జెలెన్‌స్కీ లీడ్’ పేరుతో ఓ కవర్ స్టోరీ ప్రచురించింది. ఈ కథనంలో అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్‌స్కీ, ఉక్రెయిన్ కీలక అధికారుల ఇంటర్వ్యూలు చేశారు.

Ukraine Crisis: ఎంతకైనా తెగిస్తాం.. రష్యా సేనలను అడ్డుకొనేందుకు ఉక్రెయిన్ వాసుల సాహసోపేత చర్యలు

యుద్ధం మొదలైనప్పటి నుంచి ఎదుర్కొంటున్న అనుభవాలను, మానసిక సంఘర్షణలను జెలెన్‌స్కీ వివరించారు. రాత్రి సమయంలో రష్యా సైన్యం దాడులను ప్రారంభించింది. బాంబుల మోత ప్రారంభమైంది. నేను, నా భార్య ఒలెనా, 17ఏళ్ల కూతురు, తొమ్మిదేళ్ల కొడుకు నిద్ర లేచాం. మా ఇద్దరు పిల్లలకు బాంబుల దాడి మొదలైందని చెప్పాం. వెంటనే కొంత మంది అధికారులు మా దగ్గరికి వచ్చారు. కుటుంబంతో సహా సురక్షిత ప్రాంతానికి తరలిస్తామని చెప్పారు. రష్యా బలగాలు ఏ క్షణమైనా కీవ్ లో అడుగు పెట్టొచ్చని, కుటుంబంతో సహా తనను చంపే అవకాశాలు ఉన్నాయని వాళ్లు మమ్మల్ని హెచ్చరించారు. వేరే ప్రాంతానికి వెళ్దామని ప్రయత్నిస్తుండగానే అధ్యక్ష భవనం నుంచి బయటకు చూస్తే విధ్వంసం, బాంబుల మోతే కనిపించింది.

ఇప్పటి వరకు తాను అలాంటి దృశ్యాలను సినిమాల్లోనే చూశానంటూ జెలెన్‌స్కీ తెలిపాడు. అధ్యక్ష భవనం వెనుక ద్వారానికి పోలీసు బారికేడ్లు, ప్లైవుడ్ బోర్డులతో అడ్డుకట్ట వేశాం. ఆ రాత్రంతా ఉక్రెయిన్ అధ్యక్ష భవనం ప్రాంగణంలో తమ సిబ్బంది లైట్లు ఆర్పేశారు. ఈ క్రమంలో రష్యా బలగాలు దాదాపుగా మా దగ్గరికి వచ్చాయంటూ జెలెన్‌స్కీ మ్యాగజైన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడు. రష్యా సైన్యం మా దగ్గరికి వచ్చిన సమయంలో మా దళాలు గట్టిగా ప్రతిఘటించాయి. అంతకుముందే నాకు, నా భార్య, పిల్లలు, సిబ్బందికి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు ధరించమని ఇచ్చారు. రైఫిల్స్ ను అందించారు. ఆ రోజు రాత్రి అతి భయంకరమైన వాతావరణం అధ్యక్ష భవనంలో నెలకొందంటూ జెలెన్‌స్కీ వెల్లడించారు.