కరోనా వైరస్ : చైనా నుంచి భారత్ నేర్చుకోవాల్సిన పాఠాలు ఏమిటి

కరోనా వైరస్ (Coronavirus).. ఇప్పుడీ పేరు యావత్ ప్రపంచాన్ని వణికిపోతోంది. మనుషుల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. ప్రాణాలు అరచేత పట్టుకుని జీవించేలా చేసింది. ట్రీట్

  • Published By: veegamteam ,Published On : January 30, 2020 / 10:27 AM IST
కరోనా వైరస్ : చైనా నుంచి భారత్ నేర్చుకోవాల్సిన పాఠాలు ఏమిటి

కరోనా వైరస్ (Coronavirus).. ఇప్పుడీ పేరు యావత్ ప్రపంచాన్ని వణికిపోతోంది. మనుషుల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. ప్రాణాలు అరచేత పట్టుకుని జీవించేలా చేసింది. ట్రీట్

కరోనా వైరస్ (Coronavirus).. ఇప్పుడీ పేరు యావత్ ప్రపంచాన్ని వణికిపోతోంది. మనుషుల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. ప్రాణాలు అరచేత పట్టుకుని జీవించేలా చేసింది. ట్రీట్ మెంట్ లేదు, మెడిసిన్ లేదు. వైరస్ సోకితే ప్రాణం పోవాల్సిందే. అందుకే కరోనా పేరు వింటే చాలు..పై ప్రాణాలు పైనే పోతున్నాయి.

చైనాలోని వూహన్(wuhan)లో పుట్టిన ఈ ప్రాణాంతక వైరస్ మనుషుల ప్రాణాలు తీసేస్తోంది. చైనాలో ఇప్పటికే 170మంది చనిపోయారు. 8వేల coronavirus కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య రోజు రోజుకు రెట్టింపు అవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. కరోనా వైరస్ చైనాను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఆ దేశ ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. చైనాకు వెళ్లాలంటే విదేశీయులు వణికిపోతున్నారు. దీంతో వ్యాపార పరంగా, పర్యాటక పరంగా, వాణిజ్య పరంగా చైనాపై ఎఫెక్ట్ బాగా పడింది.

అన్ని రంగాల్లో బాగా అభివృద్ధి చెందిన దేశం చైనా.. ప్రపంచంలోనే అమెరికా తర్వాత రెండో పవర్ ఫుల్ దేశం చైనా.. అలాంటి దేశమే కరోనా దెబ్బకి కుదేలైంది. ఇంతవరకు కరోనా వైరస్ కి ట్రీట్ మెంట్ కనుక్కోలేదు. మెడిసిన్ లేదు. అసలు వైరస్ ఎలా వచ్చిందో కూడా చెప్పలేకపోతున్నారు. ఇక ట్రీట్ మెంట్, మెడిసిన్ సంగతి దేవుడెరుగు. దీంతో కరోనా వైరస్ పేరు వింటే చాలు హడలిపోతున్నారు. చైనా పరిస్థితే ఇలా ఉంటే… ఇక భారత్ లాంటి దేశాల పరిస్థితి ఏ విధంగా ఉంటుందో చెప్పలేము.

కరోనా లాంటి వైరస్ భారత్ లోనూ వస్తే.. మనుషులు పిట్టల్లా రాలిపోవాల్సిందే అనే భయం కలుగుతోంది. కరోనా లాంటి ప్రాణాంతక వైరస్ లను ఎదుర్కోవడం ఎలా అన్నది భారత్ కు మిలియన్ డాలర్ల ప్రశ్నే. కరోనా వైరస్ నేపథ్యంలో చైనాకు ఎదురైన అనుభవాల నుంచి భారత్ నేర్చుకోవాల్సిన పాఠాలు, గుణపాఠాలు ఏంటి? అనే చర్చ జరుగుతోంది.

కరోనా వైరస్… చైనా నుంచి భారత్ నేర్చుకోవాల్సిన పాఠం:
* అంటు వ్యాధులను ఎదుర్కోనేందుకు సిద్ధంగా ఉండాలి
* ప్రాథమిక హెల్త్ కేర్ సిస్టమ్ ను డెవలప్ చేసుకోవాలి
* ఆసుపత్రుల్లో వసతులు పెంచుకోవాలి
* పబ్లిక్ హెల్త్ కేర్ ను అభివృద్ధి చేయాలి
* సీ పోర్టులు, ఎయిర్ పోర్టుల్లో ప్రత్యేక నిఘా పెట్టాలి. స్క్రీనింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలి
* సీ పోర్టులో, ఎయిర్ పోర్టుల్లో హీట్ స్కానర్లు ఏర్పాటు చేయాలి
* జ్వరం, ఇన్ ఫెక్షన్ గుర్తించగల హీట్ స్కానర్లు పోర్టులు, ఎయిర్ పోర్టుల్లో పెట్టాలి

* డయాగ్నోస్ వ్యవస్థను పటిష్టం చేయాలి
* ట్రీట్ మెంట్ సౌకర్యాలను అభివృద్ధి చేయాలి
* అంటువ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి
* పబ్లిక్ లో అవేర్ నెస్ పెంచాలి
* వైరస్ లపై నిత్య అధ్యయనం జరగాలి

* వ్యాక్సిన్లు కనుగొనాలి
* వ్యాక్సిన్ రీసెర్చ్ లను డెవలప్ చేయాలి
* వాతావరణ మార్పులను నిత్యం అధ్యయనం చేయాలి
* ఎలాంటి వ్యాధి, జబ్బు, వైరస్ అటాక్ అయినా ఎదుర్కొనే వ్యవస్థను సిద్ధం చేసుకోవాలి
* హెల్త్ కేర్ రంగాన్ని పటిష్టం చేయాలి

* ప్రయోగశాలల సంఖ్య పెంచాలి
* నిరంతరం వ్యాధులు, జబ్బులు, వైరస్ లపై అధ్యయనం జరగాలి
* ప్రత్యేక ఆసుపత్రులు, వైద్య సౌకర్యాలు, ఐసోలేటేడ్ వార్డులు ఏర్పాటు చేయాలి
* రాబోయే ప్రమాదాన్ని ముందే పసిగట్టే వ్యవస్థ కావాలి

Also Read : #Coronavirus మందు కనిపెట్టా : ఇదే మెడిసిన్ అంటున్న తమిళ వైద్యుడు!