Salman Rushdie: సల్మాన్ రష్దీ రచించిన ‘ది సాటానిక్ వెర్సెస్’ లో ఏముంది..? ముస్లింల ఆగ్రహానికి ఎందుకు కారణమైంది?

రచయిత సల్మాన్ రష్దీ పై న్యూ యార్క్ నగరంలో దాడి జరిగింది. ఓ వ్యక్తి రష్దీ పాల్గొన్న సమావేశంకు వచ్చి కత్తితో అతనిపై హత్యాయత్నంకు పాల్పడ్డాడు.

Salman Rushdie: సల్మాన్ రష్దీ రచించిన ‘ది సాటానిక్ వెర్సెస్’ లో ఏముంది..? ముస్లింల ఆగ్రహానికి ఎందుకు కారణమైంది?

Salman Rushdie: రచయిత సల్మాన్ రష్దీ పై న్యూ యార్క్ నగరంలో దాడి జరిగింది. ఓ వ్యక్తి రష్దీ పాల్గొన్న సమావేశంకు వచ్చి కత్తితో అతనిపై హత్యాయత్నంకు పాల్పడ్డాడు. కత్తితో పలు చోట్ల పొడవడంతో తీవ్రగాయాలైన రష్దీని చికిత్సనిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. నిందితుడిని న్యూయార్క్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రష్దీని హత్యచేసేందుకు యత్నించడానికి కారణం.. రష్దీ రచించిన ది సాటానిక్ వెర్సెస్ అని తెలుస్తోంది. దీంతో ఇప్పుడు అందరి దృష్టి ది సాటానిక్ వెర్సెస్ లో ఏముంది? ముస్లింలు దానిని ఎందుకు వ్యతిరేకించారు. ఆ నవలను తొలుత భారత్ దేశమే ఎందుకు నిషేధించింది అనే విషయాలు ఆసక్తికరంగా మారాయి.

Salman Rushdie: సల్మాన్ రష్దీపై దాడి ఎలా జరిగింది.. ‘ది సాటానిక్ వెర్సెస్’ అనే పుస్తకమే ఇందుకు కారణమా..?

సల్మాన్ రష్దీ ఇండియాలోని ముంబయిలో 1947లో జన్మించాడు. 14ఏళ్ల వయస్సులో ఇంగ్లండ్ వెళ్లారు. బ్రిటిష్ పౌరసత్వాన్ని తీసుకుని ముస్లిం మతాన్ని వదిలిపెట్టాడు. కొంతకాలం నటుడిగా కొనసాగిన అతను, తరువాత రచయితగా మారాడు. మొదట గ్రైమస్ అనే పుస్తకాన్ని ప్రచురించాడు. రెండో పుస్తకం మిడ్ చిల్డ్రన్, 1983లో మూడవది ది జగౌర్ స్మైల్. ఆ తరువాత 1988లో ‘ది సాటానిక్ వెర్సెస్’ అనే పుస్తకాన్ని ప్రచురించాడు. ఈ పుస్తకమే రష్దీ జీవితంలో కొత్త ఇబ్బందులను తెచ్చిపెట్టింది.

RBI Key Instructions: వారికి రాత్రి 7 దాటితే ఫోన్ చేయొద్దు.. బ్యాంకులు, రుణ సంస్థలకు ఆర్‌బీఐ కీలక ఆదేశాలు

ఈ పుస్తకం ఇస్లాంను అవమానించిందని కొంతమంది ముస్లింలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఇద్దరు వేశ్యలకు మహమ్మద్ ప్రవక్త భార్యల పేర్లు పెట్టడంపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఖురాన్ లో మహమ్మద్ ప్రవక్త తొలగించిన రెండు పంక్తులను రష్దీ ఈ పుస్తకం టైటిల్ గా పెట్టాడు. దీంతో 1989 జనవరిలో బ్రాడ్ ఫోర్డ్ లో ముస్లింలు ఈ పుస్తకం కాపీని దహనం చేశారు. అదే ఏడాది ఫిబ్రవరిలో రష్దీకి వ్యతిరేకంగా జరిగిన అల్లర్లలో కొంతమంది మరణించారు. టెహ్రాన్ లో బ్రిటీష్ రాయభార కార్యాలయంపై రాళ్లు రువ్వారు.

Ranveer Singh : ర‌ణ్‌వీర్‌సింగ్ న్యూడ్ ఫోటోషూట్.. విచారణకి రావాలని సమన్లు జారీ చేసిన ముంబై పోలీసులు..

రష్దీపై ఇరాన్ అత్యున్నత నాయకుడు అయతొల్లా ఖొమేనీ 1989లో ఫత్వా జారీ చేశాడు. రష్దీని చంపితే 3 మిలియన్ డాలర్లు (రూ. 23.89 కోట్లు) ఇస్తామని ప్రకటించారు. అదేవిధంగా రష్దీని చంపితే 6 లక్షల డాలర్లు (రూ.4.77 కోట్లు) ఇస్తామని 2016లో ఇరాన్ ప్రభుత్వం ప్రకటించినట్లు అక్కడి మీడియా సంస్థల్లో కథనాలుసైతం వచ్చాయి. ది సాటానిక్ వెర్సెస్ పుస్తకాన్ని భారత్ దేశం మొదటిగా నిషేధించింది. ఆ తర్వాత పాకిస్తాన్ తో పాటు మరికొన్ని ముస్లిం దేశాలతో పాటు దక్షిణ ఆఫ్రికాలో కూడా ఈ పుస్తకాన్ని నిషేధించారు. ది సాటానిక్ వెర్సస్‌ ను అనువాదం చేసిన జపాన్ అనువాదకుడు హితోషీ ఇగరాషీ‌ను టోక్యోలో 1991లో దారుణంగా హత్య చేశారు. ఆయన కంపేరిటివ్ కల్చర్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పని చేశారు.

GST On House Rent : ఇంటి అద్దెపై 18శాతం జీఎస్టీ..! క్లారిటీ ఇచ్చిన కేంద్రం

సల్మాన్ రష్దీపై పలుసార్లు దాడులకు యత్నించారు. దీంతో అతను కొంతకాలం అజ్ఞాతంలోకి వెళ్లారు. రష్దీ అజ్ఞాతంలో పోలీసు భద్రతలో ఉండేవారు. ఆయన వల్ల ముస్లింలు బాధపడటం గురించి చింతించారు. కానీ, అయతొల్లా ఖొమేనీ మాత్రం ఆయనపై జారీ చేసిన మరణ ఫత్వాను వెనక్కి తీసుకోలేదు.తాజాగా రష్దీపై హత్యాయత్నంకు పాల్పడిన వ్యక్తి ఫేస్ బుక్ లో ఫేస్‌బుక్ ఖాతాలో 1989లో సల్మాన్ రష్దీకి వ్యతిరేకంగా ఫత్వా జారీ చేసిన ఇరాన్ నాయకుడు అయతుల్లా ఖొమేనీ, అతని వారసుడు అయతుల్లా ఖమేనీ ఫోటోలు ఉన్నట్లు గుర్తించారు.