లీప్‌ ఇయర్‌ అంటే ఏమిటి? ఫిబ్రవరిలోనే ఎందుకొస్తుంది?

  • Published By: veegamteam ,Published On : February 29, 2020 / 07:26 AM IST
లీప్‌ ఇయర్‌ అంటే ఏమిటి? ఫిబ్రవరిలోనే ఎందుకొస్తుంది?

ఈరోజు ఫిబ్రవరి 29. అంటే ఈరోజు నాలుగు సంవత్సరాలకు ఒకసారి అదురుగా వస్తుంది. ఈ రోజు ఎంతో మందికి ప్రత్యేకం కూడానూ. సాధారంగా ప్రతిఏటా క్యాలెండర్‌లో 365 రోజులు ఉంటే.. ఈ ఏడాది  మాత్రం 366 రోజులు ఉంటాయి.అందుకే దీన్ని లీపు సంవత్సరం అంటున్నాం. అసలు లీప్‌ ఇయర్‌ అందే ఏమిటి? ఇది ఫిబ్రవరిలోనే ఎందుకు వస్తుంది?  వాచ్‌ దిస్‌ స్టోరీ…

నాలుగేళ్లకోసారి వస్తోన్న లీపు సంవత్సరం
ప్రతీ సంవత్సరం ఫిబ్రవరి నెలలో 28 రోజులు ఉంటాయి. అదే లీపు ఇయర్‌ అయితే… ఫిబ్రవరిలో 29 రోజులు ఉంటాయి. లీఫ్‌ ఇయర్‌ అనేది నాలుగేళ్లకోసారి వస్తుంది. ఈరోజు పుట్టిన వారికి నాలుగేళ్లకోసారి బర్త్‌ డే సెలబ్రేషన్స్‌ జరపుకుంటారు. ఇక ఈరోజు పెళ్లి చేసుకున్న వారు కూడా అంతే.. వారి మ్యారేజ్‌ యానివర్సరీ నాలుగేళ్లకు వస్తుందన్నమాట.

నాలుగేళ్లకు ఒకరోజు ఎక్స్‌ట్రా
అసలు ఈ ఎక్స్‌ట్రా డే ఫిబ్రవరిలో ఎందుకు వస్తుందబ్బా అన్నది అందరి డౌట్‌. భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతుందని.. అందుకు ఏడాది పడిపడుతుందని మనం చదువుకునే ఉంటాం. భూమి సూర్యుడి చుట్టూ తిరగడానికి కరెక్ట్‌గా చెప్పాలంటే… 365 రోజుల 5 గంటల 48 నిమిషాల 46 సెకండ్ల సమయం పడుతుంది. ఒక్కమాటలో చెప్పాలంటే 365రోజులకు తోడు మరో పావురోజు పడుతుందన్నమాట. ఆ పావురోజును ఒకరోజుగా తీసుకోలేం. కాబట్టి ప్రతీ నాలుగేళ్లలో నాలుగు పావురోజుల్ని కలిపి.. ఒక రోజుగా మార్చి.. లీఫ్‌ ఇయర్‌లో ఫిబ్రవరి నెలలో ఒకరోజును అదనంగా చేర్చుతారు. 

ఫిబ్రవరిలోనే 28 రోజులు ఎందుకు?
మనకు ఇక్కడ ఇంకో డౌట్‌ వస్తుంది. ఫిబ్రవరిలోనే అదనపు రోజును ఎందుకు కలుపుతారని. ఫిబ్రవరిలో 28 రోజులే ఉన్నాయికాబట్టి… లీప్‌ సంవత్సరంలో వచ్చే ఎక్స్‌ట్రా డేను యాడ్‌  చేస్తారు. మరి ఫిబ్రవరిలో 28 రోజులే ఎందుకున్నాయన్న  డౌట్‌ కూడా వస్తుంది. దీనికో ఇంట్రెస్టింగ్‌ స్టోరీ ఉంది.  

365 రోజులు కేలండర్‌ జూలియస్‌ కాసర్‌ సృష్టి
క్రీస్తు పూర్వం గ్రీస్, రోమన్‌లు… కేలండర్‌లో రోజుల్నీ, నెలలనూ ఇష్టమొచ్చినట్లు మార్చేసేవాళ్లు. రోమ్‌ చక్రవర్తిగా జూలియస్ కాసర్ బాధ్యతలు స్వీకరించేటప్పటికి రోమన్ క్యాలెండర్‌‌లో ఏడాదికి 355 రోజులే ఉండేవి. ప్రతీ రెండేళ్లకూ 22 రోజులు ఉన్న ఒక నెల అదనంగా చేరేది. ఆయన ఎంటరయ్యాక… కేలండర్‌లో చాలా మార్పులు చేశారు. తద్వారా 365 రోజుల కేలండర్ వచ్చింది. అలాగే… ప్రతీ నాలుగేళ్లకూ అదనపు రోజును… ఆగస్టు నెలలో కలిపారు. ఫలితంగా అప్పట్లో ఫిబ్రవరికి 30 రోజులు, జులైకి 31 రోజులు, ఆగస్టుకు 29 రోజులు వచ్చాయి.

ఫిబ్రవరిలో రెండు రోజులు తగ్గింపు
జూలియస్ కాసర్ తర్వాత కాసర్ ఆగస్టస్… చక్రవర్తి అయ్యాడు. ఆయన పుట్టింది ఆగస్టులో. తాను పుట్టిన నెలలో రోజులు తక్కువగా ఉండటాన్ని ఇష్టపడలేదు. ఆగస్టు నెలకు 2 రోజులు పెంచుకున్నాడు. జూలియస్ కాసర్ ఫిబ్రవరిలో పుట్టాడు కాబట్టి… ఫిబ్రవరిలో ఆ రెండు రోజులూ తగ్గించాడు. ఫలితంగా ఆగస్టుకి 31 రోజులు, ఫిబ్రవరికి 28 రోజులూ వచ్చాయి. అప్పటి నుంచీ లీపు సంవత్సరంలో 1 రోజును ఆగస్టుకి కాకుండా… ఫిబ్రవరికి కలపడం మొదలుపెట్టారు. ఫిబ్రవరిలో 28 రోజులు ఉండటానికి ఇదీ కారణం.