సూర్య గ్రహణం: తీసుకోవలసిన జాగ్రత్తలు.. ముఖ్యంగా గర్భవతులు

  • Published By: vamsi ,Published On : December 26, 2019 / 01:41 AM IST
సూర్య గ్రహణం: తీసుకోవలసిన జాగ్రత్తలు.. ముఖ్యంగా గర్భవతులు

సూర్య గ్రహణం.. కేతుగ్రస్త కంకణాకార సూర్యగ్రహణం..  అసలు సూర్యగ్రహణం రోజు ఏం చేయాలి, ఏం చేయకూడదు అనే అంశంపై భిన్న వాదనలు వినిపిస్తూ ఉంటాయి. సూర్యుడు, భూమి మధ్య మార్గాన్ని చంద్రుడు అడ్డుకున్న సమయంలో సూర్యగ్రహణం వస్తోంది. సూర్యుడిని కప్పి ఉండటం వల్ల గ్రహణం ఏర్పడుతుంది.

ఆహారం తీసుకోకూడదా? ఆలయాలు మూసేస్తారు:
అయితే ఈ సమయంలో కొందరు గ్రహణం సమయంలో ఆహారం తీసుకోవద్దని, నీళ్లు తాగొద్దంటూ శాస్త్రాలు చెబుతుంటాయి. వాటిని విశ్వసించేవాళ్లు ఉంటారు. విశ్వసించని వాళ్లు కూడా ఉంటారు. గ్రహణానికి ముందు నుంచే ఇంట్లో వంట చేయకూడదు అని అనేక నియమాలు చెబుతూ ఉంటారు. సూర్యరశ్మి కనిపించని సమయంలో బ్యాక్టీరియా చురుగ్గా పనిచేస్తుందని ఆయుర్వేద నిపుణులు కూడా చెబుతుంటారు. అంతుకే గ్రహణ సమయంలో ఆహారం తీసుకోవద్దని సూచనలు చేస్తుంటారు.

సూర్యగ్రహణం సమయంలో అతినీతలోహిత కిరణాలు చురుగ్గా ఉంటాయి. అందుకే ఆహారం తీసుకోవద్దని చెప్పే మాటలను చాలామంది విశ్వసిస్తారు. అంతేకాదు గ్రహణం సమయంలో ఆకాశం వైపు నేరుగా చూడొద్దని సలహా ఇస్తుంటారు. నేరుగా కిరణాలను చూస్తే కంటికి ఇబ్బంది అనే విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందుకే ఈ రకమైన సూచనలు పెద్దలు చేస్తుంటారు. గ్రహణం సమయంలో ఆలయాలను మూసివేస్తారు. శుద్ధి చేశాకే మళ్లీ ఆలయాలను ఓపెన్ చేస్తారు.

గర్భవతులు జాగ్రత్తగా ఉండాలి:
ఎవరు ఎటువంటి నియమాలు పాటించినా పాటించకపోయినా కూడా గర్భవతులు మాత్రం కొన్ని నియమాలు పాటించాలంటూ.. గ్రహణం గురించి పురాణాల్లో అనేక విషయాలు వెల్లడించారు. తినొద్దని, మంచినీళ్లు తీసుకోవద్దని, వెలుగునిచ్చే సూర్యుడు కనిపించని సమయంలో ఏం పని చేయకూడదని విశ్వసిస్తారు. గ్రహణ సమయంలో వారు ఒకేవిధంగా పడుకోవాలని కూడా చెబుతున్నారు. గ్రహణ సమయంలో వాతావరణంలో అనేక మార్పులు వస్తుంటాయి. అందుకని గర్భిణీ స్త్రీలపై ఆ కిరణాలు పడకుండా ఉంటే మంచిదని శాస్రాలలో చెప్పారు.

గర్భవతులకు గర్భంలో శిశువు “పిండం” ఎదుగుతున్న సమయంలో శరీరానికి ఎలాంటి నెగటివ్ పవర్‌ని తట్టుకునే శక్తి ఉండదు. గ్రహణ సమయంలో రోగ నిరోధక శక్తి గర్బములో ఉన్న బిడ్డ కోల్పోతారు అందుకే ఏదైనా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని వారిని బయటకు రానివ్వకుండా చూసుకుంటారు. గ్రహణం సమయంలో చేసే దైవ స్మరణ, జపం అనేక రెట్ల శుభ ఫలితాలను ఇస్తాయనేది నమ్మకం. 

గ్రహణం పూర్తయిన తర్వాత ఏమి చెయ్యాలి.. చెయ్యకూడదు..:
గ్రహణం పట్టిన సమయానికి మరుసటిరోజు వరకు ముఖ్యమైనవి, దూర ప్రయాణాలు చేయడం మంచిది కాదు. గ్రహణం తర్వాత మరుసటి రోజు కేవలం గ్రహణ దోషం ఉన్నవారే కాకుండా పన్నెండు రాశుల వారు గ్రహణ దోష నివారణ కొరకు గోధుమలు, ఉలవలు కిలోంపావు చొప్పున తీసుకుని వాటిని నీళ్ళలో నానబెట్టి మరుసటిరోజు నీళ్ళను వడగట్టిన తరవాత వాటికి చిక్కగా బెల్లాన్ని పట్టించి ఆవుకు అరటి ఆకులో కాని, మోదుగ, తామర ఆకులతో కుట్టిన విస్తరి ఆకులో దాన పెడితే మంచిది అనేది ఓ నమ్మకం.

నేడే సూర్య గ్రహణం: జాగ్రత్త.. మళ్లీ 16ఏళ్ల తర్వాతే!