మార్స్ మీద ఏలియన్లు.. బీర్ తాగుతున్నారా.. అక్కడ కూడా దేవుళ్ల విగ్రహాలున్నాయా.. NASAకు దొరికిన ఫొటోలు ఏం చెబుతున్నాయ్..

మార్స్ మీద ఏలియన్లు.. బీర్ తాగుతున్నారా.. అక్కడ కూడా దేవుళ్ల విగ్రహాలున్నాయా.. NASAకు దొరికిన ఫొటోలు ఏం చెబుతున్నాయ్..

కొన్ని సంవత్సరాలుగా NASA బయటపెట్టిన ఫొటోల్లో అన్నింటికీ వివరణ ఇవ్వలేదు. వాటిలో కొన్ని ప్రశ్నార్థకంగానే మిగిలిపోయాయి. బీర్ బాటిల్స్ దగ్గర్నుంచి, సైనికుడు, విగ్రహాలు లాంటివి బయటపడినా ప్రశ్నలుగానే మిగిలిపోయాయి.


1. మార్స్ మీద సైనికుడు
2017లో ఏలియన్ గురించి వెదుకుతూ.. మార్స్ మీద సైనికుడు గెటప్ లో ఎవరో కనిపించారని ఫొటో రిలీజ్ చేసింది ఓ రోవర్. హ్యుమనాయిడ్ జీవి స్పేస్ సూట్ ధరించి ఓ ఆయుధాన్ని మోస్తున్నట్లుగా అందులో ఉంది. సాధారణంగా కనిపించిన ఇమేజ్ కు స్పేస్ సూట్ చేతిలో ఆయుధాన్ని హైలెట్ గా చేసిన ఫొటోను బయటపెట్టారు.


2. గ్రీకు ఫిలాసఫర్
హిస్టరీలోని గ్రేటెస్ మైండ్స్ లో పురాతన గ్రీకు ఫిలాసఫర్ సోక్రటీస్ ఒకరు. కొన్ని రికార్డుల సోక్రటిస్ కూడాఅంతరిక్ష యానం చేసినట్లు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే స్కాట్ సీ వారింగ్ అనే వ్యక్తి 15ఏళ్ల క్రితం మార్స్ పై సోక్రటిస్ ముఖం ఆకృతి గల ఫొటోను విడుదల చేసిందని పేర్కొన్నాడు. ‘ఇది సోక్రటిస్ గ్రేట్ గ్రీక్ ఫిలాసఫర్ అండ్ టీచర్ ఫొటో. ముఖాకృతికి కచ్చితంగా మ్యాచ్ అవుతుంది. నిజానికి ఆయన మార్స్ నుంచి వచ్చాడా.. అనే అనుమానం వ్యక్తం చేశాడు.


3. ఈజిప్ట్‌కు చెందిన వ్యక్తి విగ్రహం
స్కాట్ సీ వారింగ్ మరో వాదన తీసుకొచ్చాడు. అతని రీసెర్చ్ లో ఓ శిల కనిపించందట. అది అచ్చం ఈజిప్ట్ పూర్వికులను పోలి ఉందట. దీనిని బట్టి ఈజిప్షియన్లు మార్స్ నుంచే వచ్చారా.. అనే అనుమానం కనబరిచాడు. నిజానికి మార్స్ వాతావరణం భూమి మీద మరే ప్రాంతానికిదగ్గరి పోలిక ఉండదు. ఒక్క ఈజిప్ట్ కు తప్ప.


4. బీర్ బాటిల్
మార్స్ గ్రహవాసులు బీర్ తాగుతారా.. ఏలియన్ పై రీసెర్చ్ చేసే ఓ వ్యక్తికి 2017లో మార్స్ గ్రహంపై బీర్ బాటిళ్లు ఆనవాళ్లు కనిపించాయట. నిజానికి ఈ ఫొటోను నవంబర్ 2007లోనే అక్కడి రోవర్ తీసిందంటున్నాడు.


5. ఏలియన్ల విగ్రహాలు
నవంబర్ 2018లో మార్స్ లాండర్ మరో విచిత్రాన్ని చూసింది. ఆ గ్రహంపై ఉన్న విగ్రహాలను ఫొటో తీసింది. అక్కడి తలాలపై మనిషిని పోలిన విగ్రహాలు ఉన్నాయి. మార్స్ మిషన్ కోసం నాసా 25 సంవత్సరాలు ఆలస్యం చేసింది. టెక్నాలజీ పుణ్యమా అని ఇక భవిష్యత్ లో మరెన్ని విచిత్రాలు చూడనున్నామో..