ఫిబ్రవరి 1 నుంచి ఈ ఫోన్లలో వాట్సప్ పనిచేయదు

  • Published By: chvmurthy ,Published On : January 27, 2020 / 03:10 PM IST
ఫిబ్రవరి 1 నుంచి ఈ ఫోన్లలో వాట్సప్ పనిచేయదు

మీరు స్మార్ట్ ఫోన్ వాడుతున్నారా….అందులో వాట్సప్ వాడుతున్నారా… అది పని చేస్తోందా… ఐతే ఓకే…ఎందుకంటే విండోస్ ఫోన్లలో జనవరి 1 నుంచి వాట్సప్ పనిచేయటం లేదు. మీది ఆండ్రాయిడ్ ఫోన్ అయినప్పటికీ ఈవిషయమై మీరు ఒకసారి అలర్ట్ కావల్సిన సమయం ఆసన్నమైంది. 
android mobile phone
ఆండ్రాయిడ్, ఐఓఎస్ పాత వెర్షన్ ఉన్న ఫోన్లల్లో 2020 ఫిబ్రవరి 1 నుంచి వాట్సప్ సేవలు నిలిచిపోతాయి. ఇటీవలే విండోస్ ఫోన్లలో వాట్సప్ తన సేవలను నిలిపివేసింది. ఇప్పుడు మరో నాలుగురోజుల్లో అంటే  2020 ఫిబ్రవరి 1 నుంచి పాత వెర్షన్ ఉన్న ఆండ్రాయిడ్, ఐ ఫోన్లలో కూడా  వాట్సప్  తన సేవలను నిలిపివేయనుంది.
i phone apps
ఆఫోన్లు ఉన్నవారు వాట్సప్ సేవలు ఉపయోగించుకోవాలంటే కొత్త ఫోన్ కొనుక్కోవాల్సిందే. వాట్సప్ తన వెబ్ సైట్ లో తెలిపిన ప్రకారం ఐఓఎస్7, మరియు పాత సాఫ్ట్ వేర్లతో నడుస్తున్న ఐ ఫోన్లలో 2020 ఫిబ్రవరి 1 నుంచి వాట్సప్ సేవలు నిలిచిపోతాయి. 
whatsapp 4
ప్రస్తుతం మీ ఫోన్లో ఉన్న ఆండ్రాయిడ్ వెర్షన్ ఏమి ఉందో ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే ఆండ్రాయిడ్ 2.3.7 కన్నా తక్కువ వర్షన్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటే మీ ఫోన్‌లో ఫిబ్రవరి 1 నుంచి వాట్సప్ పనిచేయదు.
whats app 2

అలాగే ఐఓఎస్ 8 కన్నా తక్కువ వర్షన్ ఉన్నా వాట్సప్ పని చేయదని తన వెబ్ సైట్ లో పేర్కోంది. వాట్సప్ పాత వెర్షన్ ఫోన్లకు తన సేవలను నిలుపుదల చేస్తోంది.. ఎందుకంటే ఇప్పుడు ఆ ఫోన్లు వాడుతున్నవారి సంఖ్య తక్కువగానే ఉందని సంస్ధ భావిస్తోంది.