వాట్సప్ కొత్త ప్రైవసీ నిబంధనలతో ఇబ్బందులు ఏంటి?

వాట్సప్ కొత్త ప్రైవసీ నిబంధనలతో ఇబ్బందులు ఏంటి?

new-rules-

WHATSAPP NEW PRIVACY TERMS: గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. వాట్సప్ చాట్స్ లో ఉన్న మెసేజ్ లు కంపెనీ కావాలన్నా దొరకవు. ఎందుకంటే అవి ఆల్రెడీ ఎన్‌క్రిప్ట్ అయి ఉంటాయి కాబట్టి. మరెవ్వరూ మెసేజెస్ చూసే వీలుండదు. కేవలం వారు తీసుకోగలిగిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఫోన్ నెంబర్, మన ప్రొఫైల్ లో ఉన్న కాంటాక్ట్ ల వివరాలు, ప్రొఫైల్ పేర్లు, పిక్చర్లు, డయాగ్నోస్టిక్ డేటా మాత్రమే.

దీనిపై ఇప్పటివరకూ ఎటువంటి కన్ఫర్మేషన్ లేదు. ప్రైవేట్ వాట్సప్ సంభాషణలు కూడా ఫేస్ బుక్ యాడ్స్ లాంటి వాటికోసం వాడేసుకుంటుందా అనేది చూడాలి. ఆల్రెడీ యూరోపియన్ యూజర్లకు వచ్చిన అప్ డేట్‌లో వాట్సప్ వారి డేటాను ఏం చేయలేదు.

యూరోపియన్ రీజియన్‌లో వాట్సప్ అనేది తన డేటాను ఫేస్‌బుక్ కు షేర్ చేసుకోలేదు. యాడ్ ల కోసం వాడుకోవడం లేదు. దీనిపై యూరప్ వాట్సప్ పబ్లిక్ పాలసీ డైరక్టర్ మాట్లాడారు. వాట్సప్ యూరోపియన్ రీజియన్ లో వాట్సప్ యూజర్ ఇన్ఫర్మేషన్ ను ఫేస్ బుక్ తో పంచుకుని, ప్రొడక్ట్స్ , యాడ్స్ ఇంప్రూవ్ అయ్యేందుకు దోహదపడలేదు అని వెల్లడించారు.

వాట్సప్ రీసెంట్ అప్‌డేట్‌లో కొత్త ఫీచర్లు యాడ్ అవడంతో బిజినెస్ పీపుల్ కమ్యూనికేట్ అవడానికి అనుమతి ఇచ్చినట్లు అవుతుంది. ఆ బిజినెస్ లు ఫేస్ బుక్ హోస్టెడ్ చేసినవి కూడా ఉన్నాయి. ఒకవేళ అలా జరిగితే యూజర్లు వాట్సప్‌కు ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. బిజినెస్ గురించి చెప్పాలంటే.. ఫేస్‌బుక్ మెసేజెస్ మేనేజ్ చెయ్యాల్సి ఉంటుంది. ఒకవేళ వాళ్ల ఇన్ఫర్మేషన్ షేర్ అవలేదంటే దాని గురించి మాట్లాడకపోతేనే మంచిదని అధికారులు అంటున్నారు.