హ్యాకింగ్ Risk : ఈ చిన్న సెట్టింగ్‌తో.. మీ WhatsApp సేఫ్!

  • Published By: sreehari ,Published On : January 27, 2020 / 04:57 AM IST
హ్యాకింగ్ Risk : ఈ చిన్న సెట్టింగ్‌తో.. మీ WhatsApp సేఫ్!

వాట్సాప్ అకౌంట్ వాడుతున్నారా? హ్యాకర్ల నిఘాలో ఉన్నారు తస్మాత్ జాగ్రత్త. ఎప్పుడు ఎలా మీ వాట్సాప్ హ్యాక్ అవుతుందో చెప్పలేం. ఏ క్షణంలోనైనా హ్యాకర్లు మీ ఫోన్ సహా వాట్సాప్ హ్యాక్ చేసే ప్రమాదం ఉంది. ఇప్పటికే అమెజాన్ వ్యవస్థాపకుడు, సీఈవో జెఫ్ బెజోస్ మొబైల్ ఫోన్లో వాట్సాప్ హ్యాక్ చేశాడో హ్యాకర్.

ఒక ప్రముఖుడి వాట్సాప్ హ్యాక్ అయినప్పుడు సామాన్యుల పరిస్థితి ఏంటి? అన్న ప్రశ్న అందరిలోనూ ఉంటుంది. ఈ ఏడాదిలో ఫేస్ బుక్ సొంత మెసేజింగ్ ప్లాట్ ఫాం వాట్సాప్ భద్రతపరమైన సమస్యలు ఎదుర్కొంటోంది. ఇప్పుడు మరో వాట్సాప్ ఎటాక్ ఇష్యూ ఆందోళన కలిగిస్తోంది. మీరు వాడే వాట్సాప్ అకౌంట్లో ఓ చిన్న సెట్టింగ్ తో ముడిపడింది. 

ఇలాంటి SMS లతో జాగ్రత్త : 
ఈ వాట్సాప్ హ్యాకర్ల చేతికి చిక్కకుండా ఉండాలంటే తప్పకుండా ప్రతిఒక్కరూ తమ వాట్సాప్ అకౌంట్లో ఈ సెట్టింగ్ సెట్ చేసి ఉండాలి. లేదంటే వాట్సాప్ హ్యాక్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటోంది సైబర్ సెక్యూరిటీ సెల్. ఈ సింపుల్ సెట్టింగ్ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే.. వాట్సాప్ తో పాటు ఇతర వ్యక్తిగత వివరాలు సైబర్ మోసగాళ్ల కంట్రోల్లోకి వెళ్లిపోతాయని హెచ్చరిస్తోంది.

ప్రస్తుతం.. స్పైవేర్ తో ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్ యూజర్లే లక్ష్యంగా సైబర్ దాడులకు ప్రయత్నిస్తున్నారు హ్యాకర్లు. ప్రత్యేకించి వాట్సాప్ లో పంపే media filesతో పెద్ద చిక్కు వచ్చి పడింది. ఇలాంటి ఫైల్స్ పంపడం ద్వారా వాట్సాప్ అకౌంట్లను హ్యాకర్లు హ్యాక్ చేస్తున్నారు. 

వాట్సాప్ లోని కొన్ని లూప్ హోల్స్ సాయంతో హ్యాకర్లు యూజర్ల అకౌంట్లను హ్యాక్ చేస్తున్నారు. మరోవైపు.. వాట్సాప్.. సెక్యూరిటీ ఇష్యూలను ఒక్కొక్కటిగా ఫిక్స్ చేసుకుంటూ వస్తోంది. గ్రూపు చాట్ లేదా పర్సనల్ చాటింగ్ లో ఒక యూజర్ తన అకౌంట్ హ్యాక్ అయినట్టు మెసేజ్ పెట్టింది.

ఇలాంటి మెసేజ్ లు ఎవరూ ఓపెన్ చేయొద్దని హెచ్చరించింది. తన వాట్సాప్ అకౌంట్లోని ఫోన్ నెంబర్లు, గ్రూపు సభ్యుల నెంబర్లను హ్యాకర్లు తస్కరించినట్టు తెలిపింది. అయితే తన వాట్సాప్ అకౌంట్లో సెట్టింగ్స్ లో PIN సెట్ చేయలేదని చెప్పింది. అందుకే హ్యాకర్లు ఈజీగా తన వాట్సాప్ హ్యాక్ చేయగలిగినట్టు పేర్కొంది. 

PIN సెట్ చేశారా? :
వాట్సాప్ యూజర్లు తమ అకౌంట్ ప్రొటెక్ట్ చేసుకోవాలంటే తప్పనిసరిగా వాట్సాప్ లో ఆరు సంఖ్యల గల PIN సెట్ చేసుకోండి. PIN మర్చిపోయిన మళ్లీ పొందడానికి ఈమెయిల్ అడ్రస్ కూడా సెట్ చేయండి. ఈ ఆరు అంకెల పిన్ కోడ్ ఉంటుంది. దీనిద్వారా ఈజీగా మీ వాట్సాప్ సెక్యూర్ చేసుకోవచ్చు. దీనికి మీరు చేయాల్సిందిల్లా Settingsలో చిన్న ఆప్షన్ సెట్ చేసుకోవడమే. అదే.. Two Factor అథెంటికేషన్ ఫీచర్. యూజర్లకు అదనపు సెక్యూరిటీ ఉంటుంది. ఇంతకీ ఈ సెట్టింగ్ వాట్సాప్ లో ఎక్కడ ఉంటుంది. అది ఎలా సెట్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

ఇదిగో ప్రాసెస్ : :
* మీ ఆండ్రాయిడ్ లేదా ఐఫోన్ లో వాట్సాప్ ఓపెన్ చేయండి.
* వాట్సాప్ టాప్ రైట్ కార్నర్ లో వర్టికల్ డాట్స్ పై క్లిక్ చేయండి.
* Setttings ఓపెన్ చేసి.. అందులో Accountపై Tap చేయండి.
* Two-step verification అనే ఆప్షన్ పై Tap చేయండి.
* Disable, Change PIN, Change email address ఉంటాయి.
* ఒకవేళ PIN సెట్ చేసి ఉంటే.. Tick mark కనిపిస్తుంది.
* లేదంటే.. వెంటనే 6 అంకెల PIN సెట్ చేసుకోండి. 
* ఈ PIN మర్చిపోతే ఈమెయిల్ అడ్రస్ ద్వారా మళ్లీ PIN రీసెట్ చేసుకోవచ్చు.

 ఇంకెందుకు ఆలస్యం.. వాట్సాప్ లో సెక్యూరిటీ PIN లేకపోతే.. వెంటనే సెట్ చేసుకోండి. మీ వాట్సాప్ అకౌంట్‌ను హ్యాకర్ల బారి నుంచి సురక్షితంగా ఉంచుకోండి.