Whatsapp Stop Working : వాట్సాప్ యూజర్లకు షాక్.. ఈ ఫోన్ల‌లో ఇక ప‌నిచేయ‌దు.. మీ మొబైల్ ఓఎస్‌ వ‌ర్ష‌న్ ఇలా తెలుసుకోండి

మెరుగైన సేవ‌లు అందించ‌డం కోసం మరిన్ని అప్‌డేట్స్ తీసుకొస్తున్న వాట్సాప్ కీలక నిర్ణయం తీసుకుంది. త్వ‌ర‌లోనే ఈ ఫోన్ల‌లో వాట్సాప్ త‌మ‌ సేవల‌ను నిలిపివేసే అవ‌కాశం ఉంది.

Whatsapp Stop Working : వాట్సాప్ యూజర్లకు షాక్.. ఈ ఫోన్ల‌లో ఇక ప‌నిచేయ‌దు.. మీ మొబైల్ ఓఎస్‌ వ‌ర్ష‌న్ ఇలా తెలుసుకోండి

Whatsapp Stop Working

whatsapp will stop working on these phones : మీరు పాత ఆండ్రాయిడ్ లేదా ఐఫోన్ వాడుతున్నారా? అయితే వెంట‌నే అప్‌డేట్ అవ్వండి. లేదంటే మీ మొబైల్‌లో ఇక వాట్సాప్ ఏ మాత్రం ప‌నిచేయ‌దు.

వినియోగదారులకు మెరుగైన సేవ‌లు అందించేందుకు ఎప్ప‌టిక‌ప్పుడు సరికొత్త ఫీచర్లు తీసుకొస్తోంది వాట్సాప్. ఇందులో భాగంగా వ్య‌క్తిగ‌త గోప్య‌త(డేటా ప్రైవసీ) కోసం ఇప్ప‌టికే ఎన్‌క్రిప్టెడ్ చాటింగ్ అందుబాటులోకి తెచ్చింది. తాజాగా ఇంకా మెరుగైన సేవ‌లు అందించ‌డం కోసం మరిన్ని అప్‌డేట్స్ తీసుకొస్తున్న వాట్సాప్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక‌పై పాత ఫోన్ల‌లో తన సేవ‌ల‌ను నిలిపివేయాల‌ని వాట్సాప్ భావిస్తోంది. త్వ‌ర‌లోనే ఈ ఫోన్ల‌లో వాట్సాప్ త‌మ‌ సేవల‌ను నిలిపివేసే అవ‌కాశం ఉంది.

ఏ ఫోన్ల‌లో వాట్సాప్ ప‌నిచేయ‌దు:
* ప్ర‌స్తుతం ఐఓఎస్‌లో వాట్సాప్ 2.21.50 వెర్ష‌న్ అందుబాటులో ఉంది. ఒక‌వేళ మీరు ఐఫోన్ 4S వాడుతున్న‌ట్ల‌యితే ఇది మీ యాప్ స్టోర్‌లో
క‌నిపించ‌దు. ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలంటే ఐఫోన్ 4S త‌ర్వాత మొబైల్స్ ఉండాలి.‌
* అదే ఐఫోన్ 5 దాని త‌ర్వాత మోడ‌ల్స్ ఉప‌యోగించిన‌ట్ల‌యితే మీ ఐఓఎస్‌10కు అప్‌డేట్ చేసుకోవాలి. ఐఓఎస్ 9 దానికంటే ముందు ఆప‌రేటింగ్
సిస్ట‌మ్‌(ఓఎస్‌) ఉంటే మీ మొబైల్‌లో వాట్సాప్ సేవ‌ల‌ను నిలిచిపోయే అవ‌కాశం ఉంది.
* ఆండ్రాయిడ్ మొబైల్స్‌లో అయితే 4.0.3 ఓఎస్ కంటే ముందు ఆప‌రేటింగ్ సిస్ట‌మ్ ఉన్న ఫోన్ల‌లో వాట్సాప్ ప‌నిచేయ‌దు. అంటే శాంసంగ్ గ్యాల‌క్సీ జ‌డ్
ఫ్లిప్‌, శాంసంగ్ గ్యాల‌క్సీ నోట్ 10.1, శాంసంగ్ గ్యాల‌క్సీ నెక్సస్‌, హెచ్‌టీసీ వ‌న్ వీ, హెచ్‌టీసీ డిసైర్ సీ, హెచ్‌టీసీ డిసైర్ ఎస్‌, సోనీ ఎక్స్‌పీరియా టేబుల్ ఎస్‌,
సోనీ ఎక్స్‌పీరియా నియో స‌హా ప‌లు ఫోన్ల‌లో ఆండ్రాయిడ్ ఓఎస్ 4.0.3 అంత‌కంటే పాత వ‌ర్ష‌న్ ఓఎస్ ఉంది. కాబ‌ట్టి ఈ ఫోన్ల‌లో వాట్సాప్ ప‌నిచేయ‌దు.
* KaiOS 2.5.1 అంతకంటే అడ్వాన్స్‌డ్ వ‌ర్ష‌న్‌ ఫోన్ల‌లో మాత్ర‌మే వాట్సాప్ ప‌నిచేస్తుంది. ఈ ఓఎస్‌ జియో ఫోన్‌, జియో ఫోన్‌2లో ఉంది.‌

మీ మొబైల్ ఓఎస్‌ వ‌ర్ష‌న్ ఇలా తెలుసుకోండి
* ఆండ్రాయిడ్ మొబైల్ వాడుతున్న‌ట్ల‌యితే సెట్టింగ్స్‌లోకి వెళ్లి ఎబౌట్ ఫోన్‌పై క్లిక్ చేసి వివ‌రాలు తెలుసుకోవ‌చ్చు.
* ఐఫోన్ వాడుతున్న‌ట్ల‌యితే సెట్టింగ్స్‌లోకి వెళ్లి జ‌న‌ర‌ల్‌పై క్లిక్ చేస్తే ఎబౌట్ అని క‌నిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే ఫోన్ వివ‌రాలు తెలుస్తాయి.

పాత వెర్షన్ ఫోన్లలో వాట్సాప్ పని చేయకపోవడం కొత్తేమీ కాదు. ఇది ప్రతి ఏటా జరిగే తంతే. పాత ఐఓఎస్, ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లలో తమ సేవలను వాట్సాప్ నిలిపివేస్తుంది. 2020 ఏడాది ఆరంభంలో యాండ్రాయిడ్ ఆధారిత 2.3.7 ఆపరేటింగ్ సిస్టమ్ అంతకన్నా తక్కువ ఆపరేటింగ్ సిస్టమ్ మీద పని చేసే ఫోన్లలో వాట్సాప్ తన సేవలను నిలిపివేసింది. అదే ఐఫోన్ విషయానికి వస్తే.. ఐఓఎస్ 8, అంతకన్నా తక్కువ ఆపరేటింగ్ సిస్టమ్ మీద నడిచే ఫోన్లలో వాట్సాప్ ఆగిపోయింది. పాత వెర్షన్ ఫోన్లలో కొత్తగా అకౌంట్లు క్రియేట్ చేయలేరు, అంతేకాదు.. అప్పటికే ఉన్న అకౌంట్ ను రీ వెరిఫై చెయ్యలేరు అని వాట్సాప్ చెబుతుంది.

ప్రముఖ మేసేజింగ్ యాప్ వాట్సాప్. ఫేస్‌బుక్ కు చెందిన సోషల్ మీడియా అప్లికేషన్స్ లో ఇదొకటి. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది(2 బిలియన్లు) వాట్సాప్ ను వినియోగిస్తున్నారు. కాగా, ఇటీవల వాట్సాప్ తీసుకొచ్చిన ప్రైవసీ పాలసీ తీవ్ర వివాదాస్పదమైంది. దీనిపై అందరిలో అనుమానాలు తలెత్తాయి. ఈ పాలసీ వల్ల తమ వ్యక్తిగత సమాచారానికి ఇక ఏ మాత్రం సేఫ్ లేదనే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది.

యూజర్ల డేటాను ఫేస్‌బుక్‌తో వాట్సాప్‌ పంచుకుంటోందని ఆందోళనల నేపథ్యంలో యూజర్ల ప్రైవసీకి ఎలాంటి ఇబ్బందులూ ఉండవని వాట్సాప్‌ చెబుతోంది. యూజర్ల వ్యక్తిగత సమాచార గోప్యతకు భరోసా ఇస్తామని కేంద్ర ప్రభుత్వానికి కూడా స్పష్టం చేసింది. ఎండ్ టు ఎండ్‌ ఎన్‌క్రిప్ట్‌డ్‌ టెక్నాలజీని వినియోగిస్తుండటంతో మెసేజ్‌లను తాము కూడా చూడలేమని ఇప్పటికే స్పష్టం చేసింది. అయినప్పటికీ వాట్సాప్‌ ప్రైవసీ పాలసీ వ్యవహారంపై రచ్చ జరుగుతూనే ఉంది.

వాట్సాప్‌ తీసుకొచ్చిన కొత్త గోపత్యా విధానాన్ని వినియోగదారుడు తప్పనిసరిగా అంగీకరించాల్సి ఉంటుంది. లేదంటే యాప్‌ నుంచి వైదొలగాలి. దీనిపై భారత్‌ సహా అంతర్జాతీయంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో వాట్సాప్‌ వెనక్కి తగ్గింది. దీని అమలును మే 15కు వరకు వాయిదా వేసింది. అప్పటి వరకు ఎవరి ఖాతాను రద్దు, సస్పెండ్‌ చేయబోమని ప్రకటించింది. కాగా కొత్త టర్మ్స్, ప్రైవసీ పాలసీని అంగీకరించకపోతే మాత్రం ఇకపై వాట్సాప్ పని చేయదని ఆ సంస్థ తేల్చి చెప్పింది.