నేటికి 46ఏళ్లు : ఫస్ట్ మొబైల్ ఫోన్ కాల్ ఎవరు, ఎవరికి చేశారో తెలుసా?

టెలిఫోన్ ఎవరు కనిపెట్టారంటే.. అలెగ్జాండర్ గ్రహంబెల్ టక్కున చెప్పేస్తారు. మరి మొబైల్ ఫోన్ (వైర్ లెస్) ఎవరు కనిపెట్టారో తెలుసా? ఎప్పుడు నుంచి సెల్ ఫోన్ లో కాల్స్ మొదలయ్యాయో తెలుసా?

  • Published By: sreehari ,Published On : April 4, 2019 / 07:13 AM IST
నేటికి 46ఏళ్లు : ఫస్ట్ మొబైల్ ఫోన్ కాల్ ఎవరు, ఎవరికి చేశారో తెలుసా?

టెలిఫోన్ ఎవరు కనిపెట్టారంటే.. అలెగ్జాండర్ గ్రహంబెల్ టక్కున చెప్పేస్తారు. మరి మొబైల్ ఫోన్ (వైర్ లెస్) ఎవరు కనిపెట్టారో తెలుసా? ఎప్పుడు నుంచి సెల్ ఫోన్ లో కాల్స్ మొదలయ్యాయో తెలుసా?

టెలిఫోన్ ఎవరు కనిపెట్టారంటే.. అలెగ్జాండర్ గ్రహంబెల్.. టక్కున చెప్పేస్తారు. మరి మొబైల్ ఫోన్ (వైర్ లెస్) ఎవరు కనిపెట్టారో తెలుసా? ఎప్పుడు నుంచి సెల్ ఫోన్ లో కాల్స్ మొదలయ్యాయో తెలుసా? అసలు మొదటి మొబైల్ ఫోన్ కాల్ ఎవరూ చేసారూ.. ఎక్కడా? ఎప్పుడు చేశారో తెలుసా? ఒకప్పుడు మొబైల్ ఫోన్ ఎంత సైజు ఉండేవి.. ఎంత బరువు ఉండేవి.. ఎలా వాడేవారు.. ఏ కంపెనీ ముందుగా మొబైల్ ఫోన్ అందుబాటులోకి తెచ్చిందో తెలుసా? మీరు వాడుతున్న స్మార్ట్ ఫోన్లు.. చూడటానికి ఎంతో సాఫ్ట్ గా, స్మార్ట్ గానే కాదు.. ఎంతో తేలికగా ఉంటున్నాయి. ప్రేమికులు కావొచ్చు.. స్నేహితులు, బంధువులు ఇలా ఎందరికో రోజూ ఫోన్ కాల్స్ చేస్తుంటారు. గంటల తరబడి ఫోన్లో మాట్లాడుతుంటారు. అసలు మొబైల్ ఫోన్ కాల్ పుట్టుక ఎప్పుడో జరిగిందో తెలుసా? ఎవరూ కనిపెట్టారో తెలుసా? ఈ ప్రశ్నలు అన్నింటికి సమాధానం కావాలంటే.. ఇప్పడే చదివి తెలుసుకోండి.. 

ఏప్రిల్ 3 నాటికి 46 ఏళ్లు : 
మొట్టమొదట సెల్ ఫోన్ నుంచి తొలి కాల్ వెళ్లి ఏప్రిల్ 3 నాటికి 46 ఏళ్లు అవుతోంది. అంటే.. 1973, ఏప్రిల్ 3న మొబైల్ తొలి ఫోన్ కాల్ వెళ్లింది. ఈ తొలి ఫోన్ కాల్ ను మార్టిన్ కూపర్ అనే మోటారోలా కంపెనీ ఉద్యోగి చేశాడు. న్యూయార్క్ సిటీలోని 53వ, 54వ స్ట్రీట్, బెల్ టెలిఫోన్ కంపెనీ 6వ అవెన్యూ నుంచి వైర్ లెస్ ఫోన్ తో కాల్ చేశాడు. న్యూజెర్సీలోని బెల్ ల్యాబ్స్ హెడ్ క్వార్టర్స్ కు కూపర్ కాల్ చేసి మాట్లాడాడు.  బెల్ ల్యాబ్ లో (ఏటీ అండ్ టీఎస్) పనిచేసే తన పోటీదారుడు జోయెల్ ఎంజెల్ కు కాల్ చేశాడు.
Read Also : ఎక్కడున్నావమ్మా : హైదరాబాద్ ATMల్లో రూ.2వేల నోటు మిస్సింగ్

21/2 పౌండ్ ప్రొటోటైప్ ను తన చెవి దగ్గర పెట్టుకుని మోటారోలా టీమ్ ఫంక్షనల్ పొర్టబుల్ ఫోన్ కనిపెట్టిందని సంతోషంతో చెప్పాడు. మళ్లీ 2015లో బ్లూమ్ బెర్గ్ కు కూపర్ మరో కాల్ చేశాడు. ప్రొటోటైప్ DynaTAC (డైనమిక్ అడాప్టీవ్ టోటల్ ఏరియా కవరేజ్) 8000x సాయంతో తొలి వైర్ లెస్ ఫోన్ కాల్ చేశారు. ఆ తర్వాత కమర్షియల్ గా రిలీజ్ చేసిన తొలి ఫోన్ కూడా ఇదే కావడం విశేషం. 

బరువు, సైజు ఎంతంటే?
1973లో వైరలెస్ సెల్ ఫోన్ 1.1 కిలోల బరువు ఉండేది. 22.86 సెంటీమీటర్ల పొడువు ఉంది. 12.7 సెంటీమీటర్లు పరిమాణం, 4.44 సెంటీమీటర్లు వెడల్పు ఉండేది. కూపర్ మొబైల్ ఫోన్ కాన్ సెప్ట్ (రేడియో టెలిగ్రాఫ్‌ సిస్టమ్) కోసం.. 1973 నుంచి 1993 మధ్య కాలంలో మోటారోలా కంపెనీ 100 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టింది. 1980లో పర్సనల్ సెల్యూలర్ ఫోన్లకు సంబంధించి ప్రమోషన్ వీడియోలను రిలీజ్ చేసినట్టు EDN నెట్ వర్క్ తెలిపింది.

QUARTZ నివేదిక ప్రకారం.. AMPS డెవలప్ మెంట్ కు 15ఏళ్ల సమయం పట్టింది. ప్రొటోటైప్ నెట్ వర్క్ ఆధారంగా తొలి కమర్షియల్ నెట్ వర్క్ మొబైల్ కాల్ చేసిన దశాబ్దం తర్వాత AMPS చేయడం మొదలైంది. అప్పటినుంచి సుదీర్ఘకాలంగా సాంకేతికంగా తలెత్తే హార్డ్ వేర్, సాఫ్ట్ వేర్, రేడియో ప్రీక్వెన్సీ సమస్యలను పరిష్కరిస్తూ వచ్చారు. ఇప్పుడు సరికొత్త టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో కొత్త కొత్త స్మార్ట్ ఫోన్లు మార్కెట్లోకి విడుదల అవుతున్నాయి.  
Read Also : ప్రపంచం మెచ్చింది : నా కోడిపిల్లను కాపాడండీ.. పాకెట్ మనీతో ఆస్పత్రికి పరిగెత్తిన బుడతడు