కరాచీలోనే దావూద్ ఇబ్రహీం.. తొలిసారి ఒప్పుకున్న పాకిస్తాన్‌

  • Published By: vamsi ,Published On : August 23, 2020 / 08:01 AM IST
కరాచీలోనే దావూద్ ఇబ్రహీం.. తొలిసారి ఒప్పుకున్న పాకిస్తాన్‌

అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం పాకిస్తాన్‌లో ఉన్నట్లు పాకిస్తాన్ అంగీకరించింది. పాకిస్తాన్ ఈ విషయాన్ని తొలిసారిగా అంగీకరించింది. పాకిస్తాన్ ఉగ్రవాదుల కొత్త జాబితాను విడుదల చేయగా.. అందులో దావూద్ ఇబ్రహీం కూడా ఉన్నాడు.

కరాచీలోని క్లిఫ్టన్ ప్రాంతంలో:
ఎఫ్‌ఎటిఎఫ్ నిఘా జాబితా నుంచి బయటపడే ప్రయత్నాల్లో భాగంగా పాకిస్తాన్ ఉగ్రవాదుల జాబితాను విడుదల చేసింది. ఇందులో దావూద్ ఇబ్రహీం పేరు ఉంది. కరాచీలోని క్లిఫ్టన్ ప్రాంతంలోని వైట్ హౌస్‌లో దావూద్ ఇబ్రహీం నివసిస్తున్నారు.

ముంబై దాడి సూత్రధారి దావూద్ ఇబ్రహీం:
ముంబై దాడికి సూత్రధారి దావూద్ ఇబ్రహీం. అతను 1993లో ముంబైలో బాంబు పేలుళ్లు జరిపాడు. ముంబై పేలుళ్ల తర్వాత ఆయన, ఆయన కుటుంబం పాకిస్తాన్ పారిపోయారు. భారతదేశ మోస్ట్ వాంటెడ్ జాబితాలో దావూద్ పేరు ఉంది.

పాకిస్తాన్ ఇంతకుముందు ఖండిస్తోంది:
ఇబ్రహీం పాకిస్తాన్‌లో ఉన్నట్లు అనేక సందర్భాల్లో ప్రపంచానికి ఆధారాలు వచ్చాయి. కానీ పాకిస్తాన్ ప్రతిసారీ దానిని నిరాకరిస్తూనే ఉంది. ప్రపంచంలోని చాలా దేశాలు అతని కోసం వెతుకుతూనే ఉన్నాయి. అప్పుడంతా పాకిస్తాన్ తమ దేశంలో దావూద్ లేడంటూ చెప్పుకొచ్చింది.

పాకిస్తాన్ నిషేధించిన 88 ఉగ్రవాద సంస్థలను, దాని యజమానులను, వారి మాస్టర్స్ బ్యాంక్ ఖాతాను కూడా సీలు చేయాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా దావుద్ ఇబ్రహీం పేరును కూడా అందులో చేర్చింది. హఫీజ్ సయీద్, మసూద్ అజార్ వంటి ఉగ్రవాదుల పేర్లు కూడా ఇందులో ఉన్నాయి.