కరోనాని ఖతం చేసే వ్యాక్సిన్లలో ఇండియాకి ఏది సురక్షితం? భద్రపరచడానికి ఏది సులభం?

  • Published By: naveen ,Published On : November 26, 2020 / 05:45 PM IST
కరోనాని ఖతం చేసే వ్యాక్సిన్లలో ఇండియాకి ఏది సురక్షితం? భద్రపరచడానికి ఏది సులభం?

safe coronavirus vaccine: కరోనాపై గన్ షాట్ ట్రీట్‌మెంట్ కోసం ఏ కంపెనీ తయారు చేసిన టీకా అయితే మంచిదనే చర్చ ఇప్పుడు పతాకస్థాయికి చేరుకుంది. ఇండియాలో కొవిడ్-19 వ్యాక్సిన్ కు సంబంధించి ఫార్మా దిగ్గజం ‘సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్ఐఐ)’ అభివృద్ధి చేసిన ‘కొవిషీల్డ్’ రిజల్ట్స్ ప్రాధాన్యత సంతరించుకున్నాయ్.

స్వీడిష్-బ్రిటిష్ ఫార్మా సంస్థ ఆస్ట్రాజెనెకా, ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీతో కలిసి సీరం రూపొందించిన కొవిషీల్డ్.. టెక్నికల్ గా AZD1222 ఎఫికసీపై రెండు రకాల రిపోర్టులు వచ్చాయ్. ఇండియాలో నిర్వహించిన క్లినికల్ ట్రయల్స్ లో.. వ్యాక్సిన్ మొదటి డోసు 90 శాతం సమర్థవంతంగా పనిచేయగా, అదే నెల రోజుల వ్యవధిలో రెండో డోసు దగ్గరికి వచ్చేసరికి సమర్థత 62 శాతానికి పడిపోయింది.

ఆస్ట్రాజెనెకా ఎఫికసీ 70శాతం:
ఓవరాల్‌గా ఆస్ట్రాజెనెకా ఎఫికసీ 70శాతంగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఫైజర్, మోడెర్నా, స్పుత్నిక్ తో పోల్చితే కోవిషీల్డ్ వ్యాక్సిన్ మన దేశానికి అన్ని రకాలుగా అనువైనదిగా చెప్తున్నారు.. ఎందుకంటే భారత్ సహా తక్కువ ఆదాయం ఉన్న దేశాలకు చౌక ధరలో వ్యాక్సిన్ అందించాలనే లక్ష్యంతోనే సీరం ఇన్సిట్యూట్ ఆఫ్ ఇండియా డోసులు ఉత్పత్తి చేస్తోంది.

ఫైజర్, మోడెర్నా వ్యాక్సిన్లను విస్తృతంగా వాడుకునే అవకాశాలు చాలా తక్కువ:
అమెరికా ఫార్మా సంస్థలు ఫైజర్, మోడెర్నా తాము అభివృద్ధి చేసిన వ్యాక్సిన్లు 90 నుంచి 95 శాతం సమర్థవంతంగా పనిచేస్తున్నాయని ప్రకటించుకున్నాయి. అటు రష్యా తయారీ స్పుత్నిక్-వీ సైతం 90 శాతానికిపైగా ఎఫెక్టివ్ అని చెప్పుకుంది. అయితే ఆయా దేశాల్లోని ప్రభుత్వ నియంత్రణ సంస్థల నుంచి అనుమతులు పొందిన తర్వాత కూడా ఫైజర్, మోడెర్నా వ్యాక్సిన్లను విస్తృతంగా వాడుకునే అవకాశాలు చాలా తక్కువ.

ఎందుకంటే ఈ రెండు వ్యాక్సిన్లు మైనస్ 70 డిగ్రీల ఉష్ణోగ్రతలో స్టోర్ చేయాల్సి ఉండటం, అలాంటి కోల్డ్ చైన్ చాలా దేశాల్లో అందుబాటులో లేకపోవడం, ధరలు కూడా ఒక్కో డోసుకు రూ.3వేల వరకు ఉండటమే ప్రతికూల అంశాలుగా మారుతున్నాయ్.

అదే సీరం ఇన్సిట్యూట్ ఉత్పత్తి చేస్తోన్న ఆస్ట్రాజెనెకా కొవిషీల్డ్ ను 2 నుంచి 8 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతలోనే స్టోర్ చేసుకోవచ్చు. అంటే రవాణా చేయడం సులభంగా సాధ్యపడటమే కాదు.. స్టోరేజ్ కోసం ప్రత్యేకమైన వ్యవస్థలు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం లేదు.. రేటు చూసినా ప్రభుత్వానికి రూ.400లోపు, విస్తృత వాడకానికి రూ.1000లోపే ఉంటుందని సీరం సీఈవో పూనావాలా చెప్పారు.

ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌కి ఉన్న మరో అడ్వాంటేజ్.. అన్ని రకాల వయసు వారిపై పని చేస్తుంది:
ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌కి ఉన్న మరో అడ్వాంటేజ్.. ఈ వ్యాక్సిన్ అన్ని రకాల వయసు వారిపై పని చేస్తుంది.. అంతేకాదు.. ఎసింప్టమేటిక్ ఇన్ఫెక్షన్‌ని కూడా నిరోధిస్తుంది..ఈ రెండు అంశాలు మోడెర్నా, ఫైజర్ వ్యాక్సిన్‌పై కోవిషీల్డ్‌కి ఎడ్జ్ తెచ్చిపెడుతున్నాయ్.

అలానే 23వేలమందిపై చేసిన క్లినికల్ ట్రయల్స్‌లో ఎక్కడా తీవ్రమైన ప్రతికూల ప్రభావాలు కన్పించ లేదు.. అంతే కాదు విశాలమైన భారత దేశంలోని మారుమూల పల్లెలకు కూడా కోవిషీల్డ్‌ని ఎలాంటి థర్మల్ షిప్పర్లు లేకుండానే పంపిణీ చేయవచ్చు.. తక్కువ ధర, ఎక్కువ సౌలభ్యత, సమర్ధత కలిగిన ఆస్ట్రాజెనెకాకి ఈ మూడు అంశాల్లో పోటీకి వచ్చేది ఒక్క స్పుత్నిక్ వి వ్యాక్సిన్ మాత్రమే..

స్పుత్నిక్ వి రేటు కూడా 20 డాలర్ల లోపే:
గమేలియా ఇన్సిట్యూట్ తయారు చేసిన స్పుత్నిక్ విని కూడా 8డిగ్రీల ఉష్ణోగ్రతలో వాడుకోవచ్చు. కాబట్టే భారత్ స్పుత్నివ్ వ్యాక్సిన్ పై కూడా ఆసక్తి ప్రదర్శించే అవకాశాలు ఉన్నాయ్. స్పుత్నిక్ వి రేటు కూడా 20 డాలర్ల లోపే అంటే..1400రూపాయల లోపే అందిస్తానని చెప్తోంది..

ఐతే ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ని సీరమ్ ఇన్సిట్యూట్ ఆఫ్ ఇండియా భారత్‌లోనే ఉత్పత్తి చేస్తోంది కాబట్టి..ఇండియా ఫస్ట్ అనే కాన్సెప్ట్‌తో మనకే మొదటగా పంపిణీ చేస్తుంది.. ఈ కోణంలోనే ఎక్కువమంది ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ భారత అవసరాలకు అనుగుణంగా ఉంటుందనే అంచనా వేస్తున్నారు.