సినీఇండస్ట్రీలో ‘నెపోటిజం’పై టాక్ నడుస్తుంటే.. ఈ ఆరుగురు బాలీవుడ్‌ను జయించారు.. 

  • Published By: srihari ,Published On : June 18, 2020 / 05:06 PM IST
సినీఇండస్ట్రీలో ‘నెపోటిజం’పై టాక్ నడుస్తుంటే.. ఈ ఆరుగురు బాలీవుడ్‌ను జయించారు.. 

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పూత్ ఆకస్మాత్తుగా ఆత్మహత్య చేసుకోవడంతో సినీ ఇండస్ట్రీలో నెపోటిజం (బందుప్రీతి) వెలుగులోకి వచ్చింది. బాలీవుడ్ లో చాలామంది ఈ బందుప్రీతిపై అనేక ఆరోపణలు తెరపైకి వచ్చాయి. ఎందరో టాలెంట్ ఉన్న వారంతా ఎన్నో ఏళ్లుగా కార్పెట్ కిందనే అణగారిపోయారనే వాదన వినిపిస్తోంది. బాలీవుడ్ లో స్టార్ కిడ్స్ ఆధిపత్యంతో బయటి టాలెంట్ ఉన్నోళ్లను తొక్కేశారంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

బాలీవుడ్ లోని ఓ నిర్దిష్ట వర్గాన్ని సోషల్ మీడియాలో నిందించడం.. సుశాంత్ సింగ్ రాజ్ పూత్ ఆత్మహత్యకు పాల్పడేందుకు దారితీసిన పరిస్థితులకు సంబంధించి కొందరి పేర్లతో #nepotismkilledsushant అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. నెపోటిజం కారణంగా ఇప్పటికే కరణ్ జోహార్, సంజయ్ లీలా భన్సాలీ, సల్మాన్ ఖాన్, ఏక్తా కపూర్ వంటి నటులు, దర్శకులు సైతం విమర్శలు ఎదుర్కొంటున్నారు. 
 

నివేదిక ప్రకారం.. సుధీర్ కుమార్ ఓఝా  అనే న్యాయవాది.. రాజ్ పూత్ మృతితో సంబంధం ఉన్న ఈ ప్రముఖులతో పాటు నాలుగురు వ్యక్తులపై బీహార్ లోని ముజఫర్పూర్‌ కోర్టులో ఫిర్యాదు దాఖలు చేశారు. బాలీవుడ్ నటుడు కంగనా రనౌత్ ఒక వీడియోను కూడా పోస్టు చేశారు. దీనిలో ఆమె సుశాంత్ మరణాన్ని ‘ప్లాన్ ప్రకారమే హత్య’ గా పేర్కొంది.

ఈ వీడియోలో, నటుడిని బలహీనమైన మనస్సు ఉన్న వ్యక్తిగా చిత్రీకరించినందుకు అసహనం వ్యక్తం చేసింది. మరోవైపు.. బాలీవుడ్ స్టార్ #nepotism కిడ్స్ మూవీలను ఎవరూ చూడొద్దని అనవసరంగా డబ్బులు వృధా చేసుకోవద్దంటూ ట్విట్టర్ లో పోస్టులు పెడుతున్నారు. స్టార్ కిడ్స్ కంటే టాలెంట్ ఉన్న బయటి నటులకు సపోర్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.