TikTok: టిక్‌టాక్‌పై నిషేధం ఎత్తివేత?

గతేడాది సెప్టెంబర్‌లో చైనీస్ యాప్‌లు టిక్‌టాక్, WeChatలను అగ్రరాజ్యం అమెరికా నిషేధించగా.. ఇప్పుడు ఆ ఉత్తర్వులను రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకోనున్నట్లుగా తెలుస్తోంది.

TikTok: టిక్‌టాక్‌పై నిషేధం ఎత్తివేత?

Tiktok

White House on TikTok, WeChat: గతేడాది సెప్టెంబర్‌లో చైనీస్ యాప్‌లు టిక్‌టాక్, WeChatలను అగ్రరాజ్యం అమెరికా నిషేధించగా.. ఇప్పుడు ఆ ఉత్తర్వులను రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకోనున్నట్లుగా తెలుస్తోంది. ట్రంప్ అధ్యక్షుడుగా ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాలను పునః సమీక్షించి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు జో బైడెన్.

కరోనా ఫస్ట్ వేవ్ సమయంలో చైనాకు వ్యతిరేకంగా అమెరికా తీసుకున్న నిర్ణయాలను జో బైడెన్ పునః సమీక్షిస్తున్నట్లు వైట్ హౌస్ వర్గాలు వెల్లడించాయి. టిక్‌టాక్ యాప్‌తో WeChat తదితర Appలలో సెక్యురిటీకి సంబంధించిన అంశాలను వాణిజ్యవిభాగం పరిశీలిస్తుంది. అమెరికా విదేశాంగ వాణిజ్య విభాగం టిక్‌టాక్‌ విషయంలో ప్రైవసీ, సెక్యురిటీకి సంబంధించిన విషయాలపై నివేదిక ఇచ్చిన తర్వాత దీనిపై కీలక నిర్ణయం తీసుకోనుంది అమెరికా ప్రభుత్వం.

టిక్‌టాక్ మరియు వీచాట్‌లను చైనాతో ముడిపడి ఉన్న సాఫ్ట్‌వేర్ యాప్‌లు అంటూ.. జాతీయ భద్రతా నష్టాలను గుర్తించే పనిలో అమెరికా ప్రభుత్వం ఉంది. చైనా తయారు చేయబడిన యాప్‌ల లావాదేవీలపై “సాక్ష్యం-ఆధారిత”(evidence-based) విశ్లేషణను తీసుకుని వాణిజ్య విభాగం నివేదిక ఇస్తుంది. వినియోగదారుల వ్యక్తిత్వ డేటాను యాప్‌లు సేకరిస్తున్నాయా? లేదా చైనీస్ సైనిక లేదా ఇంటెలిజెన్స్ కార్యకలాపాలకు యాప్‌లకు కనెక్షన్ ఉందా? అనే విషయాలను విశ్లేషిస్తుంది వాణిజ్య విభాగం.

అమెరికన్ల జన్యు మరియు వ్యక్తిగత ఆరోగ్య సమాచారాన్ని ఎలా రక్షించాలనే దానిపై కూడా ఈ విభాగం సిఫార్సులు చేస్తుంది. అమెరికా ఆర్థిక మరియు రాజకీయ ప్రత్యర్థి అయిన చైనాతో ముడిపడి ఉన్న యాప్‌ల ద్వారా అమెరికన్ల వ్యక్తిగత డేటా బయటకు వస్తుందా? అనేదానిపై ముఖ్యంగా అగ్రరాజ్యం పరిశీలిస్తుంది.

TikTok, WeChat యాప్‌లతో పాటు మరో ఎనిమిది ఫైనాన్షియల్‌ టెక్నాలజీ సాఫ్టేవేర్‌ అప్లికేషన్లను కూడా ట్రంప్‌ ప్రభుత్వం నిషేధించింది. ఈ అప్లికేషన్లకు సంబంధించి కూడా మళ్ళీ విచారణ చేస్తుంది బైడెన్ ప్రభుత్వం.