Tedros Adhanom : క‌రోనా మ‌హ‌మ్మారిని 2022లో అంతం చేయాలి.. లేకపోతే!

కరోనా మహమ్మారిని 2022 సంవత్సరంలోనే అంతం చేయాలనీ ప్రపంచ ఆరోగ్యసంస్థ చీఫ్ టెడ్రోస్ అధనమ్ ఘోబ్రేసన్ అన్నారు. ఈ మహమ్మారివలన ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు కుదేలవుతున్నాయన్నారు.

Tedros Adhanom : క‌రోనా మ‌హ‌మ్మారిని 2022లో అంతం చేయాలి.. లేకపోతే!

Tedros Adhanom

Tedros Adhanom : కరోనా మహమ్మారిని 2022 సంవత్సరంలోనే అంతం చేయాలనీ ప్రపంచ ఆరోగ్యసంస్థ చీఫ్ టెడ్రోస్ అధనమ్ ఘోబ్రేసన్ అన్నారు. ఈ మహమ్మారివలన ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు కుదేలవుతున్నాయని.. అభివృద్ధి చెందుతున్న దేశాలపై దీని ప్రభావం అధికంగా పడుతుందని తెలిపారు. జెనీవా నగరంలో సోమవారం మీడియాతో మాట్లాడిన టెడ్రోస్.. ఒమిక్రాన్ లాంటి కొత్త వేరియంట్లలో కరోనా కలకలం సృష్టిస్తున్న సమయంలో పండుగల వేళ ఆంక్షలు తప్పనిసరిగా విధించాలి. పండుగల కంటే ప్రాణం ముఖ్యం ఆరోగ్యంగా ఉంటే వచ్చే ఏడాది ఇంతకంటే గొప్పగా పండుగ జరుపుకోవచ్చని సూచించారు. ప్రాణాలు పోగొట్టుకోవ‌డం క‌న్నాపండ‌గ‌లు చేసుకోక‌పోవ‌డం మంచిదని టెడ్రోస్ తెలిపారు.

చదవండి : Omicron : ఒమిక్రాన్‌కు డెల్టాకంటే స్పీడెక్కువ.. లైట్ తీసుకోవద్దు – WHO

అలాగే చాలా దేశాలలో ఇప్ప‌టికే జ‌నం మొద‌టి డోస్ కోసం ఎదురుచూస్తున్నారు.. మ‌రోవైపు ధ‌నిక దేశాలు వ్యాక్సినేష‌న్ పూర్తి చేసుకుంటున్నాయి.. ఈ ప‌రిస్థితి మారాలి. ప్ర‌పంచ‌మంతా సమాంత‌రంగా వ్యాక్సినేష‌న్ జ‌రిగితే మంచిది” అని అన్నారు. ఈ ముప్పును మూకుమ్మడిగా ఎదురుకోవాలి.. మనం ఒక్కరం సేఫ్ ఉంటే సరిపోదు మనచుట్టూ ఉన్నవారు.. మనచుట్టూ ఉన్న దేశాలు కూడా సేఫ్ జోన్ లో ఉండాలి.. ఆలా జరిగినప్పుడే మనం ఈ మహమ్మారిని ప్రపంచం నుంచి పారద్రోలినట్లని తెలిపారాయన. ప్ర‌స్తుతం ద‌క్షిణాఫ్రికా, అమెరికా, యూర‌ప్ లాంటి దేశాల‌లో ఒమిక్రాన్ కేసులు వేగంగా పెరుగుతుండ‌గా.. క్రిస్మ‌స్ పండుగల కోసం అక్క‌డ జ‌నం స‌మూహాలుగా ఏర్ప‌డితే వైర‌స్ ఇంకా ప్ర‌బ‌లే అవ‌కాశం ఉండ‌డంతో ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ హెచ్చ‌రిక‌లు కీల‌కంగా మారాయి. ఇక జనవరి 1కూడా సమీపిస్తుండంతో టెడ్రోస్ వ్యాఖ్యలు కీలకంగా మారాయి.

చదవండి : WHO On Omicron : ఆస్పత్రుల్లో బెడ్ల సంఖ్య పెంచండి.. ప్రపంచ దేశాలకు WHO సూచన