WHO: కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న డబ్ల్యూహెచ్ఓ డైరక్టర్, వ్యాక్సిన్ పేరేంటో…

వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డైరక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ క‌రోనా టీకా తీసుకున్నాడు. కరోనావైరస్‌కు వ్యాక్సిన్ ఫస్ట్ డోస్ వేయించుకున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ట్విట్టర్..

WHO: కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న డబ్ల్యూహెచ్ఓ డైరక్టర్,  వ్యాక్సిన్ పేరేంటో…

Who

WHO: వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డైరక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ క‌రోనా టీకా తీసుకున్నాడు. కరోనావైరస్‌కు వ్యాక్సిన్ ఫస్ట్ డోస్ వేయించుకున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ట్విట్టర్ ద్వారా గురువారం వెల్లడించారు. ప్ర‌జ‌లంతా వారి ప్రాంతాల్లో అందుబాటులో ఉన్న టీకాలు తప్పక తీసుకొని ప్రాణాలు కాపాడుకోవాల‌ని టెడ్రోస్ పిలుపునిచ్చారు.

బుధ‌వారం సాయంత్రం జెనీవాలోని యూనివ‌ర్సిటీ హాస్పిట‌ల్‌లో టెడ్రోస్ వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా భారత్ కు చెందిన రెండు వ్యాక్సిన్లతో కలిపి ఐదింటిని లిస్టులో పేర్కొంది డబ్ల్యూహెచ్ఓ. అవే కాక ప్రస్తుతం విదేశీ వ్యాక్సిన్లకు కూడా అప్రూవల్ దొరికింది. ఇలా ఉంటే డబ్ల్యూహెచ్ఓ డైరక్టర్ జనరల్ ఉండే స్విట్జ‌ర్లాండ్‌లో ఫైజ‌ర్‌, మోడ‌ర్నా వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి.

వ్యాక్సిన్ కోసం తన పేరును రిజిస్ట‌ర్ చేసుకున్న 56 ఏళ్ల టెడ్రోస్‌.. త‌న వంతు వచ్చిందనే మెసేజ్ రావడంతో వెళ్లి టీకా వేయించుకున్నాడు.

‘ఇవాళ కొవిడ్‌-19 కు టీకా వేసుకునేందుకు నా వంతు వ‌చ్చింది. టీకాలు ప్రాణాలను కాపాడతాయి. వాటిని అన్ని ప్రాంతాలకు తీసుకురావడం చాలా క్లిష్టమైంది. నాలాగా మీరంతా టీకాలు అందుబాటులో ఉన్న మేర తీసుకోండి’ అని ట్విట్ట‌ర్‌లో రాశారు. 2020 మార్చి 11 న కరోనావైరస్‌ను మహమ్మారిగా డ‌బ్ల్యూహెచ్ఓ ప్రకటించింది.