Delta Fourth Wave : డెల్టా డేంజర్ బెల్స్.. మిడిల్ ఈస్ట్‌లో ఫోర్త్ వేవ్ దిశగా.. WHO వార్నింగ్

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ మహమ్మారి రూపాలు మార్చుకుంటూ మళ్లీ విజృంభిస్తోంది. కరోనా రకం డెల్టా వేరియంట్.. ప్రస్తుతం ప్రపంచాన్ని కలవరపెడుతోంది. పలు దేశాల్లో ఈ వేరియంట్‌​ కేసులు, మరణాలు భారీగా పెరిగిపోతున్నాయి. విస్తృతంగా వ్యాపిస్తున్న డెల్టా వేరియంట్‌ కారణంగా..

Delta Fourth Wave : డెల్టా డేంజర్ బెల్స్.. మిడిల్ ఈస్ట్‌లో ఫోర్త్ వేవ్ దిశగా.. WHO వార్నింగ్

Delta Fourth Wave

Delta Fourth Wave : ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ మహమ్మారి రూపాలు మార్చుకుంటూ మళ్లీ విజృంభిస్తోంది. కరోనా రకం డెల్టా వేరియంట్.. ప్రస్తుతం ప్రపంచాన్ని కలవరపెడుతోంది. పలు దేశాల్లో ఈ వేరియంట్‌​ కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. విస్తృతంగా వ్యాపిస్తున్న డెల్టా వేరియంట్‌ కారణంగా రీఇన్‌ఫెక్షన్‌ బారిన పడే ప్రమాదం అధికంగా ఉందని నిపుణులు చెబుతుననారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కచ్చితంగా వ్యాక్సిన్​ రెండు డోసులు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

డెల్టా వేరియంట్ అన్ని దేశాలకు విస్తరిస్తోంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 130 దేశాలకు డెల్టా వేరియంట్‌ వ్యాపించినట్లు ప్రపంచ ఆరోగ్యసంస్థ (WHO) వెల్లడించింది. తాజాగా డబ్ల్యూహెచ్ వో మరో షాకింగ్ న్యూస్ చెప్పింది. ఫోర్త్ వేవ్ హెచ్చరికలు జారీ చేసింది. కరోనా డెల్టా వేరియంట్ ప్రమాదకారిగా మారుతోంది. ముఖ్యంగా మిడిల్ ఈస్ట్ దేశాల్లో డెల్టా వేరియంట్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. డెల్టా వేరియంట్ తీవ్రత రోజురోజుకి పెరుగుతోందని, దాని తీవ్రత చూస్తుంటే ఫోర్త్ వేవ్ కు దారి తీయొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ వో) హెచ్చరించింది.

”డెల్టా వేరియంట్ కారణంగా అనేక దేశాల్లో మళ్లీ కరోనా కొత్త కేసులు, మరణాలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా తూర్పు మధ్యధరా ప్రాంతంలో. ఆ ప్రాంతంలో 22 దేశాలు ఉంటే, 15 దేశాల్లో కరోనా కేసులు, మరణాల సంఖ్య పెరిగింది. ఆ ప్రాంతంలోని చాలా దేశాల్లో డెల్టా వేరియంట్ ప్రమాదకారిగా మారింది. ఇంకా వ్యాక్సిన్ వేసుకోని వారిలో ఎక్కువమంది కరోనా బారిన పడుతున్నారు. అసలైన వైరస్ కంటే ఇతర వేరియంట్స్ కంటే కూడా డెల్టా వేరియంట్ మరింత డేంజర్. చాలా స్పీడ్ గా వ్యాపిస్తోంది” అని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పింది.

”తూర్పు మధ్యధరా ప్రాంతంతో పాటు డబ్ల్యూహెచ్ వో ప్రాంతాల్లో వేగంగా వ్యాపిస్తున్న డెల్టా వేరియంట్ ఆందోళన కలిగించే అంశం. గత కొన్ని వారాలుగా కొత్త కేసులు, మరణాల సంఖ్య పెరిగింది. కొత్త కేసులు, ఆసుపత్రి పాలైన వారిలో ఎక్కువమంది వ్యాక్సిన్ తీసుకోని వారే. ప్రస్తుతం మన కరోనా ఫోర్త్ వేవ్ ముంగిట ఉన్నాం” అని తూర్పు మధ్యధరా ప్రాంతం డబ్ల్యూహెచ్ వో రీజినల్ డైరెక్టర్ డాక్టర్ అహ్మద్ అల్ మందారి అన్నారు.

కొత్త కేసులు 55శాతం పెరిగాయి. మరణాల సంఖ్య 15శాతం పెరిగింది. గత నెలతో పోలిస్తే కొత్త కేసులు, మరణాలు పెరిగాయి. ప్రతి వారం 31వేలకు పైగా కొత్త కరోనా కేసులు, 3వేల 500 మరణాలు నమోదవుతున్నాయి. ఉత్తర ఆఫ్రికాలో టునీషియా లాంటి దేశాల్లో అధిక సంఖ్యలో కరోనా మరణాలు నమోదవుతున్నాయి. ఆక్సిజన్ ట్యాంకుల కొరత, ఐసీయూ బెడ్ల కొరత ఆసుపత్రులను వేధిస్తోంది. ఆరోగ్య వ్యవస్థపై తీవ్రమైన ఒత్తిడి ఉంది. కరోనాను కట్టడి చేయాలంటే వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గం అని డబ్ల్యూహెచ్ వో మరోసారి స్పష్టం చేసింది. ధనిక దేశాలు పేద దేశాలకు అండగా నిలవాలని, వారికి వ్యాక్సిన్లు సరఫరా చేయాలని డబ్ల్యూహెచ్ వో సూచించింది. సెప్టెంబర్ నాటికి ప్రపంచంలోని అన్ని దేశాల్లో 10 శాతం జనాభాకు వ్యాక్సిన్లు ఇవ్వాలని డబ్ల్యూహెచ్ వో టార్గెట్ గా పెట్టుకుంది. 2021 ఏడాది చివరి నాటికి 40శాతం, 2022 జూన్ నాటికి 70శాతం జనాభాకు వ్యాక్సిన్లు ఇవ్వాలన్నది డబ్ల్యూహెచ్ వో టార్గెట్. అయితే ఈ టార్గెట్ రీచ్ అవ్వాలంటే ధనిక దేశాలు, ఇదివరకే టార్గెట్ పూర్తి చేసినవి.. పేద దేశాలకు వ్యాక్సిన్లు విరాళం చేయాలి. అప్పుడే డబ్ల్యూహెచ్ వో అనుకున్న వ్యాక్సినేషన్ టార్గెట్ రీచ్ కాగలదు.

ప్రపంచంలోని చాలా దేశాలు కరోనా సెకండ్‌ వేవ్‌తో సతమమవుతుండగా మరికొన్ని దేశాలు థర్డ్ వేవ్‌ ముంగిట ఉన్నాయి. అయితే ఫ్రాన్స్‌లో కరోనా ఫోర్త్‌ వేవ్‌ కలకలం రేపుతోంది. డెల్టా వేరియంట్‌ కాంతివేగంతో వ్యాపిస్తోందని ఆ దేశ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. వారం రోజుల్లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 140 శాతానికి పెరిగిందని వెల్లడించాయి. ఒక్కరోజే 21 వేలకుపైగా కొత్త కేసులు నమోదవగా, ఇందులో 98శాతం మంది వ్యాక్సిన్ వేయించుకోని వారేనని తేలింది.

కరోనా ఫోర్త్‌ వేవ్‌ను నియంత్రించేందుకు ఫ్రాన్స్‌ ప్రభుత్వం మరోసారి కఠిన ఆంక్షలు విధించింది. కరోనా టీకా ప్రక్రియను వేగవంతం చేయడంతోపాటు వ్యాక్సిన్‌ వేయించుకోని వారికి వ్యతిరేకంగా పలు నిబంధనలు ప్రకటించింది. సాంస్కృతిక వేదికలు, అమ్యూజ్‌మెంట్‌ పార్కులు, జిమ్స్‌, స్విమ్మింగ్‌ పూల్స్‌కు వెళ్లేవారు తప్పని సరిగా కరోనా టీకా తీసుకున్న సర్టిఫికెట్‌ లేదా కరోనా నెగిటివ్‌ రిపోర్ట్‌ లేదా కరోనా నుంచి కోలుకున్న పత్రాలను చూపించాలంది.